‘సకల’ వేతనాల చర్చలు నేటికి వాయిదా
ౖయెటింక్లయిన్కాలనీ(కరీంనగర్) : సకల జనుల సమ్మె వేతనాల చెల్లింపులో లోపాలను సవరించాలని కోరుతూ సింగరేణి యాజమాన్యంతో బుధవారం జరిగిన గుర్తింపు యూనియన్ నాయకుల చర్చలు గురువారానికి వాయిదా పడ్డాయి. సమ్మెకు ముందు రోజు గైర్హాజరైన కార్మికులకు జీతాలు చెల్లించాలని, సెప్టెంబర్ నెల మొదటి రోజు మస్టర్ ఉన్న వారిని పరిగణలోకి తీసుకోవాలని, అత్యవసర సిబ్బందికి సైతం ‘సకల’ వేతనాలు చెల్లించాలని నాయకులు కోరారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో డైరెక్టర్(పా) పవిత్రన్కుమార్తో జరిపిన చర్చలు వాయి దా పడ్డాయని, గురువారం సీఎండీతో పూర్తి స్థాయి చర్చలు జరుగుతాయని గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తెలిపారు.