శాకాంబరిగా ‘పెద్దమ్మ’
పాల్వంచ సమీపంలోని జగన్నాథపురం– కేశ్వాపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న పెద్దమ్మ తల్లి (శ్రీకనకదుర్గ మాత) ఆదివారం శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని పునీతులయ్యారు. భారీగా వచ్చిన భక్తులను ఆలయ సిబ్బంది క్యూలైన్లో దర్శనం కోసం పంపించారు. ఈఓ జగన్మోహన్రావు, సూపరింటెండెంట్ సత్యనారాయణ పర్యవేక్షణలో పురాణ పురుషోత్తమశర్మ, శేషాద్రిశర్మ, వేదపండితులు పద్మనాభశర్మ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుని..మొక్కులు చెల్లించారు. – పాల్వంచ రూరల్