sakshi cartoonist
-
తెలుగువాడి వర్ణఫలం ‘వాసు’
పత్రికల్లో రంగు వెలిసిపోతున్న తెలుగు బొమ్మ చివరి వెలుగు వాసు. బొమ్మల్ని తన బొమ్మల బల్ల వరకే పరిమితం చేసుకున్న సంయమన శీలి. అక్కడి నుంచి లేచాడా.. బొమ్మ కన్నా ప్రపంచం గొప్పదని ఎరుక ఉన్నవాడు. ఉదయాన్నే ఇంట్లోకి వచ్చి పడే దినపత్రిక లోగిల్లో తీరైన రేఖతో ప్రభాత వర్ణాల ఆ నీటి రంగుల ముగ్గు పేరు వాసు - తెలుగమ్మాయిల బుగ్గల ఎరుపు ముక్కు చివరి ముక్కెరను తాకి బంగారు కాంతిని జిగేల్మనిపించినా అది వాసే. అమ్మా, నాయనమ్మల కంచి ధర్మవరం బెనారస్ పోచంపల్లి చీరల ధగధగల మధ్య అల్లరల్లరిగా ఆటలాడే పిల్లిమొగ్గల, కోతి చేష్టల పిల్లకాయల నిండు పండులాంటి ముద్దు మొఖాల చిరునవ్వుకు సంతకం తెలిస్తే అది వాసు. ఈ రోజు తెలుగు వాడి వర్ణ ఫలం పేరు వాసు. తెలుగురేఖ దీటుకు దాని ఎనలేని సానకు బాపు, బాలి, గోపి, మోహన్, కరుణాకర్ వంటివారు శిఖర స్థాయికి చేరిస్తే ఆ పతాకం వెనుక నుంచి పంచ రంగుల సూర్యుణ్ణి వెలుగింప జేసింది చిత్రకారులు చంద్ర, ఆపై ఆయన ప్రియాతి ప్రియ అంతే వాసి వాసు. పాపం చాలామంది శిష్యులు ఒక పెద్ద నడక నడిచాకా వెనక్కి తిరిగి చూసే ఓపికా అవసరమూ లేక నడిచిన దారి గురుతులు మరిచి ‘పాపం ఆయనా! నా గురువా? అబ్బే!’ అని మొహమాటపడతారు కానీ... ఏనాడు చంద్రగారి పక్కన నిలబడి నాలుగునిముషాలైనా ఆయన చిత్రకళా విన్యాసాన్ని ప్రత్యక్షంగా చూడని వాసు, నిద్దరలో కూడా ఇదంతా చంద్ర బొమ్మల భిక్షేనని ఆయన్ని కన్నులక ద్దుకుంటారు. బొత్తిగా వెర్రి ఏకలవ్యుడు. చంద్ర మాత్రం ద్రోణుడు కారు. పత్రికల్లో రంగు వెలిసిపోతున్న తెలుగు బొమ్మ చివరి వెలుగు వాసు. ఒక చిత్రకారుడిగా ఆయన బొమ్మలు ప్రపం చానికి తెలియడమే తప్ప ఆయన గురించి ఫలానా సంవ త్సరం, ఫలానా నెల, ఫలానా ప్రాంతంలో ఫలానా జిల్లాలో పుట్టారు. అప్పుడు అది ఆ జిల్లే కానీ ఇప్పుడు అది ఈ జిల్లా అయ్యింది. పైగా రాష్ర్టం కూడా బదలాయించింది వంటి సమాచారం ఒక అనవసరం. మన వెర్రి కాకపొతే కళాకా రుడికి ఫలానా ఫలానా ఏమిటి? పైగా వాసు వంటి వారికి! వాసు అంటే కొందరి వ్యక్తి కాదు అది అందరి బొమ్మ. కోన సీమ పచ్చని బయలుపై ఠీవిగా నడిచే కోడెదూడ మెడన మెరిసే మువ్వల వరుస తళుకు వాసు కుంచెదే, భద్రాది రాములవారి గోపురంపై నీడ కప్పిన కొబ్బరాకు పచ్చదనం కూడా అదే. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారి నల్లని విగ్రహపు నవ్వు రంగు కూడా అంతే, శ్రీశైల మల్లికార్జుని కొలువులో సేదతీరుతున్న మల్లియలకు అద్దిన తెల్లని తెలుపు ముత్యపు రంగు కూడా వాసూదే. వాసు ఒక రకంగా కర్మ యోగి ఒక్క ఖానా, పీనా, పిలానాలో తప్ప మరే ఆర్టు గ్రూపుల్లో, గ్రూప్ ఫొటోల్లో తోసుకువచ్చి కనపడే రకం కాదు. ప్రేక్షకుల్లో ఒక ప్రేక్షకుడిగా మాత్రమే ఉండాలనుకుంటాడు. మన బొమ్మలో చేవ సత్తా వుంటే దాన్ని ప్రపంచం చూస్తుంది కానీ మన మొహం వెళ్ళి ప్రపంచం ముందు ఎందుక్కనపడాలని పేరు ప్రఖ్యాతులపై సిగరెట్ పొగ ఊదే ఒక తెంపరి. బొమ్మల్ని తన బొమ్మల బల్ల వరకే పరిమితం చేసుకున్న సంయమన శీలి, అక్కడి నుంచి లేచాడా బొమ్మ కన్నా ప్రపంచం గొప్పదని ఎరుక ఉన్నవాడు. వాసు ఆర్టిస్ట్‌గా కన్నా, ఒక స్నేహిగా, ఒక నిరంతర ప్రయా ణిగా, తనకు నచ్చినవారి మధ్య ఒక సందడిగా బతకాలను కునే మామూలు మనిషి. నేను 24 గంటలు కేవలం ఆర్ట్‌నే పీలుస్తానని హడావుడిగా ఆర్ట్ అ్ప్డేట్స్ కోసం పాకులాడే బాపతు కాదు కాబట్టే ప్రపంచానికి వాసు బొమ్మ తెలిసినంత వాసు అంటే ఏమిటో ఎవరికీ తెలుపదలుచుకోలేదు. తెలుగు బొమ్మల పెద్దలు బాపు, చంద్ర, మోహన్, బాలి, కరుణాకర్ల తరువాత తన బొమ్మల్తో ఈ తరానికి స్ఫూర్తి కలిగిస్తున్న ఈ కాలపు ఒకే ఒక చిత్రకారుడు వాసు. చాలా ఏళ్ళ తరువాత బొమ్మల కాలేజీలో చదువుకునే పిల్లలు, చిత్రకారులమవుదామనుకుని తపించే జనం ఓనామహ శివా యహ దిద్దినంత సీరియస్‌గా ఇప్పుడు వాసు రంగుని రేఖని సాధన చేస్తున్నారు. ఇది నిజంగా గొప్ప విప్లవం. అందుకు తరచు ఫేస్బుక్లో కనబడే వాసూలా గీయాలనుకునే చాలామంది బొమ్మలే సాక్షి. ఇప్పుడు వాయిస్ ఆఫ్ ఇమేజెస్ పేరిట వాసు తన మొదటి బొమ్మల ప్రదర్శన హైదరాబాద్ రవీంద్రభారతి కళాభవన్‌లో డిసెంబర్ 3, 4, 5న ఏర్పాటు చేస్తున్నారు. వర్ణానికి, వర్గానికి, ప్రాంతానికి కట్టుబడని ఈ కళాకారుడి దారిలో వెలిసిన బొమ్మల మైలురాళ్ళ జాతర ఇది. ఈ శుభ సమయాన ఇక్కడ హైదరాబాద్‌లో ప్రారంభ మవుతున్న ఈ రంగుల పండుగను ఇరు రాష్ట్రాల కళాభిమా నులు తమకు తామే పూనుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ నగరాల్లో బొమ్మల కొలువుగా కొలువు తీరుస్తే బావుంటుంది. నిజానికి ఈ ప్రదర్శన ఎప్పుడో జరగ వలసింది. కానీ ఇప్పుడు ఇన్నేళ్ళ తరువాత జరుగుతున్న వాసు బొమ్మల కొలువు కూడా ఎవరో బలవంతపెట్టి చేయిం చడం తప్ప వాసు తనకు తాను చేస్తున్నది అని నేను అనుకోవడం లేదు. ఆ పర్సన్- బిహైండ్ ది సీన్ ఎవరో అదే చేత్తో వాసు బొమ్మల పుస్తకం కూడా మార్కెట్లో తెస్తే మా తరం, మా తదుపరి తరం చిత్రకారులకు చాలా పెద్ద బొమ్మల బాలశిక్ష అవుతుంది. నిజానికి వాసు తన బొమ్మల పుస్తకానికి తన సొంత జేబులోంచి చెల్లని అయిదు వందలు, వెయ్యి రూపాయల నోటు తీయనవసరం లేకుండా కొండంత ప్రేమతో ఆ పుస్తక భారం వహించే పెద్దలు ఎంతోమంది వాసు అభిమానులుగా వున్నారు. కానీ ముందుగా చెప్పు కున్నట్టు ఇటువంటి సరదాలు ఏం పట్టని వాసు కర్మ యోగి. అదే మన ఖర్మ. (డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో హైదరాబాద్ రవీంద్రభారతిలోని కళాభవన్‌లో వాసు మొదటి బొమ్మల ప్రదర్శన సందర్భంగా) అన్వర్, సాక్షి కార్టూనిస్టు -
సాక్షి కార్టూనిస్టు శంకర్‌ను అభినందించిన కేసీఆర్
హైదరాబాద్: సాక్షి ప్రధాన కార్టూనిస్టు పామర్తి శంకర్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఈ నెల 11న పోర్చుగల్ రాజధాని లిస్బన్లో ప్రతిష్ఠాత్మక వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ-2014 అవార్డును శంకర్ అందుకున్నారు. ఆయన వరల్డ్ ప్రెస్ కార్టూన్ డైరెక్టర్ ఆంథోనీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌ను మంగళవారం కలుసుకున్నారు. శంకర్ లాంటి సామాజిక స్పృహ ఉన్న కార్టూనిస్ట్ తెలంగాణకు గర్వకారణం అని కొనియాడారు. పోర్చుగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ఏటా ప్రపంచ స్థాయిలో ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు గ్రాండ్ ప్రీ అవార్డును ప్రకటిస్తుంది. ఓ రకంగా దీనిని పత్రికా రంగంలో నోబెల్ అవార్డుగా భావిస్తారు. 2014 సంవత్సరానికి దాదాపు 64 దేశాల నుంచి పోటీకి వచ్చిన ఎంట్రీల్లో శంకర్ గీసిన హక్కుల పోరాటయోధుడు నెల్సన్ మండేలా క్యారికేచర్ ఉత్తమ ఎంట్రీగా ఎంపికైంది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మరణించినప్పుడు శంకర్ గీసిన ఈ క్యారికేచర్ 2013 డిసెంబర్ 6న ప్రచురితమైంది. గ్రాండ్ ప్రి అవార్డు ఆసియాకు చెందిన వారికి దక్కడం ఇదే తొలిసారి కూడా. కార్టూనిస్టులోకం దీన్ని ఆస్కార్, నోబెల్ ప్రైజుగా పరిగణిస్తుంటుంది. ఈ అవార్డు కింద 10 వేల యూరోల నగదు లభిస్తుంది. పోర్చుగల్‌లో ఏటా నవంబర్‌లో నిర్వహించే అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సందర్భంగా ఈ అవార్డును బహూకరిస్తారు. నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లికి చెందిన శంకర్ సాక్షి దినపత్రికలో కార్టూనిస్టుగా పనిచేస్తున్నారు. ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శంకర్‌కు గతంలో 20సార్లు అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు వచ్చాయి. బ్రెజిల్, ఇరాన్, చైనా దేశాల్లో నిర్వహించిన పోటీల్లో ఈ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆయన వేసిన వాటిలో దలైలామా, బ్రూస్లీ, మదర్ థెరిసా, ఆంగ్‌సాన్ సూకీ, ఒబామా తదితర ప్రముఖుల క్యారికేచర్లకు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కాయి. -
కార్టూనిస్ట్ శంకర్‌కు 'సాక్షి' ఘన సత్కారం
-
పదేళ్ల కృషికి ఫలితమీ అవార్డు
పదేళ్లుగా నెల్సన్ మండేలా బొమ్మలను వేస్తూ.. రోజురోజుకూ దానిలో మరింత పరిణితి సాధించానని, ఈ దశాబ్దకాలం నాటి కృషి ఫలితంగానే అంతర్జాతీయ స్థాయిలో కార్టూనిస్టులకు నోబెల్, ఆస్కార్‌లా భావించే అత్యున్నత అవార్డు తనకు దక్కిందని 'సాక్షి' కార్టూనిస్టు శంకర్ అన్నారు. పోర్చుగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ఏటా ప్రపంచ స్థాయిలో ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు ప్రకటించే గ్రాండ్ ప్రి అవార్డు ఈ ఏడాది ఆయన్ను వరించింది. 2014 సంవత్సరానికి దాదాపు 64 దేశాల నుంచి పోటీకి వచ్చిన ఎంట్రీల్లో శంకర్ గీసిన హక్కుల పోరాటయోధుడు నెల్సన్ మండేలా క్యారికేచర్ ఉత్తమ ఎంట్రీగా ఎంపికైంది. ఈ సందర్భంగా 'సాక్షి' యాజమాన్యం శంకర్‌ను ఘనంగా సత్కరించింది. ఆయనకు రెండు లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని చైర్పర్సన్ వైఎస్ భారతి అందించారు. ఈ సభలో శంకర్ తన అనుభవాలను, చిత్ర నేపథ్యాన్ని వివరించారు. తాను పదిహేడేళ్లుగా ఈ రంగంలో ఉన్నానని, నెల్సన్ మండేలా పోరాట పటిమను ప్రతిబింబించడం, దక్షిణాఫ్రికా నాయకులు వేసుకునే తరహా దుస్తులను చూపించడంతో పాటు.. ఆయన చేసిన పోరాటం (ఎరుపు రంగు) ఆయనకంటే పెద్దదనే భావనను చూపించడం, అందులోనూ సిమెట్రీ సాధించడం, సరిగ్గా మండేలా కన్నుమూసిన మర్నాడే పత్రికలోని సంపాదకీయ పేజీలో ఈ కారికేచర్ ప్రచురితం కావడం.. ఇవన్నీ అవార్డుకు అర్హతలయ్యాయని శంకర్ చెప్పారు. ఈ అవార్డు కోసం తాను గత ఆరున్నరేళ్లుగా ఎంట్రీలు పంపుతున్నానని, ఇన్నాళ్లకు తన కల ఫలించిందని తెలిపారు. ఆసియా దేశాల్లోనే ఎవరికీ ఇంతవరకు ఈ బహుమతి రాలేదని, కనీసం మూడో స్థానం దక్కితే చాలనుకుంటే.. ఏకంగా ప్రథమ బహుమతి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. అవార్డు సాధించిన శంకర్‌ను సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ కె.ఆర్.పి. రెడ్డి, ఫైనాన్షియల్ డైరెక్టర్ వై.ఇ.పి.రెడ్డి, డైరెక్టర్ మార్కెటింగ్ రాణీరెడ్డి, ఎడిటర్ వర్ధెల్లి మురళి, సాక్షి టీవీ సీఈవో రామ్, ఇతర సీనియర్ పాత్రికేయులు అభినందనలతో ముంచెత్తారు. శంకర్‌ను ఘనంగా సత్కరించారు. -
అవార్డుకు అర్హుడు శంకర్
సిద్దిపేట జోన్: ‘సాక్షి’ ప్రధాన కార్టూనిస్టు పామర్తి శంకర్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డు రావడం హర్షించదగ్గ విషయమని సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి మహేష్ పేర్కొన్నారు. ఆ అవార్డుకు ఆయన అర్హుడన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ చిత్రకారుల సమ్మేళనానికి తాను వెళ్లాననీ, ఈ కార్యక్రమానికి కార్టూనిస్ట్ శంకర్ హాజరుకాగా, తాను ఆటోగ్రాఫ్‌ను కోరనన్నారు. అయితే క్షణాల వ్యవధిలోనే తన నఖ చిత్రాన్ని శంకర్ ఆటోగ్రాఫ్ రూపంలో వేసిచ్చారన్నారు. వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ అవార్డు ఈ ఏడు ‘సాక్షి’ కార్టూనిస్టు శంకర్‌కు రావడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. -
కార్టూనిస్టు శంకర్‌కు కేసీఆర్ అభినందనలు
'సాక్షి' కార్టూనిస్టు శంకర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. కార్టూనిస్ట్ శంకర్‌కు ప్రపంచ ప్రఖ్యాత అవార్డు రావడం చాలా అభినందనీయమని ఆయన అన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన కార్టూనిస్టు అంతర్జాతీయ అవార్డు పొందడం పట్ల తనకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. పోర్చుగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ఏటా ప్రపంచ స్థాయిలో ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు ప్రకటించే గ్రాండ్ ప్రి అవార్డు ఈ ఏడాది శంకర్‌ను వరించిన విషయం తెలిసిందే. 2014 సంవత్సరానికి దాదాపు 64 దేశాల నుంచి పోటీకి వచ్చిన ఎంట్రీల్లో శంకర్ గీసిన హక్కుల పోరాటయోధుడు నెల్సన్ మండేలా క్యారికేచర్ ఉత్తమ ఎంట్రీగా ఎంపికైంది. -
‘సాక్షి’ కార్టూనిస్టుకు అంతర్జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ ప్రధాన కార్టూనిస్టు పామర్తి శంకర్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. పోర్చుగల్‌కు చెందిన వరల్డ్ ప్రెస్ కార్టూన్ సంస్థ ఏటా ప్రపంచ స్థాయిలో ఉత్తమ ఎడిటోరియల్ కార్టూన్లు, క్యారికేచర్లకు ప్రకటించే గ్రాండ్ ప్రి అవార్డు ఈ ఏడాది ఆయన్ను వరించింది. 2014 సంవత్సరానికి దాదాపు 64 దేశాల నుంచి పోటీకి వచ్చిన ఎంట్రీల్లో శంకర్ గీసిన హక్కుల పోరాటయోధుడు నెల్సన్ మండేలా క్యారికేచర్ ఉత్తమ ఎంట్రీగా ఎంపికైంది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మరణించినప్పుడు శంకర్ గీసిన ఈ క్యారికేచర్ 2013 డిసెంబర్ 6న ప్రచురితమైంది. గ్రాండ్ ప్రి అవార్డు ఆసియాకు చెందిన వారికి దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. కార్టూనిస్టులోకం దీన్ని ఆస్కార్, నోబెల్ ప్రైజుగా పరిగణిస్తుంటుంది. ఈ అవార్డు కింద 10 వేల యూరోల నగదు లభిస్తుంది. పోర్చుగల్‌లో ఏటా నవంబర్‌లో నిర్వహించే అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సందర్భంగా ఈ అవార్డును బహూకరిస్తారు. నల్గొండ జిల్లా నాగిరెడ్డిపల్లికి చెందిన శంకర్ ఎనిమిదేళ్లుగా ‘సాక్షి’ దినపత్రికలో కార్టూనిస్టుగా పనిచేస్తున్నారు. ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శంకర్‌కు గతంలో నాలుగుసార్లు అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు వచ్చాయి. బ్రెజిల్, ఇరాన్, చైనా దేశాల్లో నిర్వహించిన పోటీల్లో ఈ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఆయన వేసిన వాటిలో దలైలామా, బ్రూస్లీ, మదర్ థెరిసా, ఆంగ్‌సాన్ సూకీ, ఒబామా తదితర ప్రముఖుల క్యారికేచర్లకు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కాయి. నాకు నచ్చిన నేత మండేలా: పామర్తి శంకర్ ‘‘నాకు నచ్చిన నేత నెల్సన్ మండేలా. ఆయనపై గీసిన క్యారికేచర్కే ఈ అవార్డు దక్కడం ఆనందంగా ఉంది. ఈ క్యారికేచర్‌లో మూడు విశేషాలున్నాయి. నల్ల సూరీడుకు సూచికగా ఆయన మొహాన్ని నలుపు రంగు... ఆ దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆయన షర్టును విభిన్నరంగులు.. ఆయన పోరాటానికి సంకేతంగా పిడికిలిని ఎరుపురంగు వేశాను. విభిన్నమైన పెన్సిల్ వర్క్ కూడా దీనికి తోడైంది. ఈ ప్రయోగమే అవార్డు జ్యూరీకి నచ్చిందని నా భావన. ఈ ప్రతిష్టాత్మక అవార్డు, గుర్తింపు కోసం ఏడేళ్లుగా పోటీలో పాల్గొంటున్నాను. నిజానికి 2005లో చార్కోల్తో మండేలా బొమ్మను గీశాను. ఆయన మరణం నేపథ్యంలో క్యూబిక్ ఫామ్‌లో విభిన్నమైన పెన్సిల్ వర్క్‌తో గీయాలని సంకల్పించాను. దీనికి అంతర్జాతీయస్థాయి గుర్తింపు లభించడం సంతోషకరం. అడుగడుగునా నా వెన్నుతట్టి ప్రోత్సహించే ‘సాక్షి’ యాజమాన్యం, ఎడిటోరియల్ విభాగానికి కృతజ్ఙతలు’’ -
సాక్షి కార్టునిస్టు శంకర్‌కు అరుదైన పురస్కారం