sakshi india Spell B
-
‘సాక్షి స్పెల్ బీ’ పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
హైదరాబాద్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సాక్షి ఇండియా స్పెల్ బీ’ పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 15వ తేదీ వరకు పాఠశాలల వారీగా, వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. నాలుగు రౌండ్లలో, నాలుగు కేటగిరీల్లో ఈ పోటీలు జరుగుతాయి. తొలి రౌండ్లో పాఠశాలల వారీగా సెప్టెంబర్ 30వ తేదీన, వ్యక్తిగతంగా అక్టోబర్ 4వ తేదీన ప్రిలిమినరీ పోటీలు జరుగుతాయి. రెండో రౌండ్లో నవంబర్ 1వ తేదీన క్వార్టర్ ఫైనల్స్, మూడో రౌండ్లో నవంబర్ 15వ తేదీన సెమీఫైనల్స్, నాలుగో రౌండ్లో డిసెంబర్ 4వ తేదీన ఫైనల్స్ జరుగుతాయి. కేటగిరీ-1లో ఒకటి, రెండో తరగతులు; కేటగిరీ-2లో 3, 4 తరగతులు; కేటగిరీ-3లో 5, 6, 7 తరగతులు, కేటగిరీ-4లో 8, 9, 10 తరగతుల వారికి పోటీలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా బహుమతులు అందజేస్తారు. మొదటి బహుమతి రూ. 25 వేలు, రెండో బహుమతి రూ. 15 వేలు, మూడో బహుమతి రూ. 10 వేలతోపాటు ‘చాంపియన్ స్కూల్’ ట్రోఫీ, విజేతలకు మెడల్స్, పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేస్తారు. www.indiaspellbee.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 250 (ఇండియా స్పెల్స్ రిఫరెన్స్ బుక్‌తో కలిపి). ఫీజును ‘ఇండియా స్పెల్ బీ, అకౌంట్ నంబర్ 6361514081, ఇండియన్ బ్యాంక్, బంజారాహిల్స్ శాఖ, హైదరాబాద్’లో జమ చేయాలి. మరిన్ని ఇతర వివరాలకు sakshiindiaspellbee@gmail.comకు ఈమెయిల్ ద్వారా లేదా 040-23256134, 9505551099, 9705199924 నంబర్లలో సంప్రదించవచ్చు. -
9న ‘సాక్షి ఇండియా స్పెల్ బీ 2014’
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి ఇండియా స్పెల్ బీ 2014’ రెండో దశ పోటీలను నవంబర్ 9వ తేదీన అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ప్రాథమిక దశ పోటీలు పాఠశాలల్లో ముగిశాయి. 20,000 మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొనగా దాదాపు 4,000 మంది రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. నిర్వాహకులు ఎంపిక చేసిన కేంద్రాల్లో రెండో రౌండ్ రాత పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు 9వ తేదీన సంబంధిత కేంద్రానికి చేరుకుని సాక్షి టీవీ లైవ్‌లో ప్రసారమయ్యే పదాలను విని రాతపరీక్ష రాయాలి. బీ మాస్టర్ విక్రమ్ 30 పదాలను ఉచ్చరిస్తారు. ఒక్కో పదాన్ని ఆయన మూడుసార్లు పలుకుతారు. విద్యార్థులు జాగ్రత్తగా విని స్పెల్లింగ్ రాయాలి. పరీక్షా సమయం 30 నిమిషాలు ఉంటుంది. పరీక్షకు స్కూల్ యూనిఫామ్‌లోనే రావాలి. కలం లేదా పెన్సిల్, పరీక్ష రాసేందుకు ప్యాడ్, పరీక్షలో పాల్గొనేందుకు ధ్రువపత్రాలు వెంట తెచ్చుకోవాలి. టిఫిన్, త్రాగునీరు విద్యార్థులే ఏర్పాటు చేసుకోవాలి. ఆలస్యంగా వచ్చేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. పరీక్షా కేంద్రం చిరునామా, ఇతర వివరాల కోసం సాక్షి జిల్లా కార్యాలయాలను సంప్రదించవచ్చు. 9న పరీక్షా షెడ్యూల్ ఇదీ కేటగిరీ - 1 వారికి: ఉదయం 10.15 గంటలకు కేటగిరీ - 2 వారికి: మధ్యాహ్నం 12.15 గంటలకు కేటగిరీ - 3 వారికి: మధ్యాహ్నం 2.15 గంటలకు కేటగిరీ - 4 వారికి: సాయంత్రం 4.15 గంటలకు -
‘సాక్షి ఇండియా స్పెల్ బీ’కి సెప్టెంబర్ 4 వరకూ రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్: దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సాక్షి ఇండియా స్పెల్ బీ’ పోటీలకు సెప్టెంబర్ 4వ తేదీ వరకూ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ విద్యార్థుల్లో ఆంగ్ల భాషా పదాల స్పెల్లింగ్ సామర్థ్యాన్ని పరీక్షించే ఈ పోటీలకు శుక్రవారమే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ఠీఠీఠీ.జీఛీజ్చీటఞ్ఛఛ్ఛ్ఛ.జీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా 9505551099, 9705199924, 040-23322330/ 23256134 నంబర్లలో సంప్రదించవచ్చు. ఒక్కో విద్యార్థి రూ. 250 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు ఇంగ్లిష్ పదాలు, వ్యాకరణంతో కూడిన రిఫరెన్స్ బుక్‌ను కూడా అందజేస్తారు. నాలుగు దశలుగా నాలుగు కేటగిరీల్లో జరిగే ఈ పోటీలు... మొదటి మూడు దశలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంయుక్తంగా నిర్వహిస్తుండగా.. నాలుగో దశ అయిన ఫైనల్స్‌ను ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా నిర్వహిస్తారు. ఫైనల్ విజేతలకు ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా.. మొదటి బహుమతి కింద బంగారు పతకం, రూ. 25 వేల నగదు అందజేస్తారు. రెండో బహుమతిగా రజత పతకం, రూ. 15 వేల నగదు.. మూడో బహుమతిగా కాంస్య పతకం, రూ. 10 వేల నగదు అందజేస్తారు.