Salary and allowances
-
ఇన్‌కం ట్యాక్స్ చెల్లింపులు: మీకు ఫారం -16 అవసరం లేదు
ప్రశ్న: నేను 2022 మార్చి 31వరకూ పర్మనెంట్ ఉద్యోగం చేశాను. రిటైర్ అయ్యాక ఏప్రిల్–మేలో ఓ ఉద్యోగం తర్వాత మారి జూన్, జూలై, ఆగస్టులో మరో ఉద్యోగం చేశాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మానేశాను.ఆరోగ్యం కుదుటపడ్డాకా కొన్ని రోజులు కన్సల్టెంటుగా చేశాను. కలిసి రాలేదు. దాంతో అక్టోబర్ నుండి మళ్లీ ఉద్యోగం. ఎక్కడా ట్యాక్సబుల్ ఇన్‌కం దాటలేదు. అందుకని పన్ను రికవరీచేయలేదు. జవాబు: ఒక ఆర్థిక సంవత్సరంలో ఇలా మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా, మధ్యలో కన్సల్టెన్సీ చేసి మళ్లీ ఉద్యోగం .. ఇలా ఎన్నో చేస్తున్నారు. మీకు నెలకు వచ్చిన జీతం వివరాలు ఇవ్వలేదు. ఎవరూ పన్ను రికవరీ చేయలేదు. కాబట్టి ఫారం 16 ఇవ్వాల్సిన అవసరమూ లేదు. మీ జీతం, వేతనం అలాగే కన్సల్టెంటుగా మిగిలిన లాభం ఇలా.. మొత్తం ఆదాయం లేదా నికర ఆదాయం 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,00,000 దాటకపోతే మీకు ఎటువంటి పన్ను భారం ఏర్పడదు. నికర ఆదాయం రూ. 5,00,000 లోపల ఉంటే రిబేటు అమల్లో ఉండటం వల్ల పన్ను భారం పడదు. పన్ను రికవరీ జరగలేదు. ఇక ముందు కూడా జరగకపోతే రిఫండు ప్రశ్న రాదు. కాబట్టి రిటర్ను వేయనవసరంలేదు. కానీ ఒక విషయం ఆలోచించాలి. ఈ ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లో యజమాని జీతం ఇచ్చారు కానీ పన్ను రికవరీ చేయలేదంటున్నారు. ఆ తర్వాత మూడు నెలల పాటు మరో యజమాని కూడా అదేవిధంగా చేశారు. అంటే ఈ ఇద్దరూ ఎవరి మటుకు వాళ్లు ‘‘మీరు పన్ను భారం పరిధిలోకి రాలేదు’’ కాబట్టి వదిలేశారు. ఉదాహరణగా, మొదటి యజమాని నెలకు రూ. 1 లక్ష ఇచ్చారనుకోండి. మీ జీతం రూ. 2 లక్షలు, బేసిక్ లిమిట్ దాటలేదు. కాబట్టి రికవరీ చేయలేదు. రెండో యజమాని కూడా నెలకు రూ. 1 లక్ష చొప్పున మొత్తం రూ. 3 లక్షలకు ఇచ్చారు అనుకోండి. మొత్తం రూ. 3 లక్షలు.. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 .. మిగతాది బేసిక్ లిమిట్ దాటలేదు అందుకని రికవరీ చేయలేదు. ఇక కన్సల్టెంటు ఎందుకు రికవరీ చేయలేదో తెలియదు. నాలుగో వ్యక్తి మరో యజమాని. ఇక ఇప్పుడు మీరే స్వయంగా మీ కొత్త యజమానికి తెలియజేయండి. గతంలో మీరు పుచ్చుకున్న జీతభత్య వివరాలు, వాటితో బాటు .. చెల్లించి ఉంటే ఇంటద్దె, మీరు చేసిన సేవింగ్స్, మెడిక్లెయిం, డొనేషన్లు .. ఇవన్నీ రాతపూర్వకంగా తెలియజేయండి. అన్నీ కలిపితే ట్యాక్సబుల్ ఇన్‌కం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త యజమానిని ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఆదాయాన్ని లెక్కించమనండి. ఆ ప్రకారం పన్నును రికవరీచేసి .. అంటే టీడీఎస్ చేసి లెక్కించి, చెల్లించమనండి. ఇదే సరైన మార్గం. ఒకవ్యక్తి ఒక సంవత్సర కాలంలో వచ్చినది పూర్తిగా పరిగణనలోకి తీసుకుని పన్ను భారం లెక్కించాలి సుమా! -
రాష్ట్రపతిలా కాదు.. ఉపరాష్ట్రపతి జీతమెంతో తెలుసా?
ఢిల్లీ: మన దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి. రాజ్యాంగబద్దంగా భారతదేశ రెండో అత్యున్నత పదవి.. ఉపరాష్ట్రపతి. అయితే రాష్ట్రపతిలా ఆమోద ముద్రలు, ఇతర నిర్ణయాలకు పరిమితం కాలేదు ఉపరాష్ట్రపతి. పార్లమెంట్లో రాజ్యసభ బాధ్యతలను పూర్తిగా చూసుకునే చైర్మన్ హోదా ఉంటుంది. అలాంటిది ఉపరాష్ట్రపతి జీత భత్యాలు, భారత ప్రభుత్వం నుంచి అందే సౌకర్యాలు, పెన్షన్, ఇతర సదుపాయాలు.. ఎలా ఉంటాయో తెలుసా?.. ► ఉపరాష్ట్రపతికి శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ పార్లమెంట్ ఆఫీసర్స్ యాక్ట్ 1953 ప్రకారం.. జీతభత్యాలను చెల్లిస్తారు. ఎందుకంటే.. రాజ్యసభకు ఆ వ్యక్తి చైర్మన్(ఎక్స్ అఫీషియో)గా వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి. అందుకే స్పీకర్‌లాగే ఉపరాష్ట్రపతికి జీతం, ఇతర బెనిఫిట్లు అందుతాయి. ► ఉపరాష్ట్రపతి జీతం.. అక్షరాల నాలుగు లక్షల రూపాయలు. ఇవి కాకుండా రకరకాల అలవెన్స్‌లు అందుతాయి. 2018 వరకు 1లక్ష25వేల రూపాయలుగా ఉండేది. ఆ దఫా బడ్జెట్లో మార్పుల మేరకు జీతం పెరిగింది. ► డెయిలీ అలవెన్స్, ఉచిత వసతి, మెడికల్ కేర్, ట్రావెల్, ఇతరత్రాలు అందుతాయి. పదవి నుంచి దిగిపోయాక.. సగం జీతం పెన్షన్‌గానూ అందుతుంది. ► ఉపరాష్ట్రపతికి భద్రతా, సిబ్బంది వాళ్ల వ్యక్తిగతం. అధికారిక కార్యక్రమాల సమయంలో మాత్రం సంబంధిత కేంద్ర, ఆయా రాష్ట్రాల తరపున సిబ్బంది భద్రత కల్పిస్తారు. ► రాష్ట్రపతి లేని సమయంలో ఉపరాష్ట్రపతి.. రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహిస్తారు. ఆ సమయంలో రాష్ట్రపతికి అందే జీతం, ఇతర బెనిఫిట్స్ ఉపరాష్ట్రపతికి అందుతాయి. అంతేకాదు రాష్ట్రపతి అందుకునే అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ప్రధాని, రాజ్యసభ సభ్యులు మన్మోహన్ సింగ్ ► రిటైర్మెంట్ తర్వాత.. పెన్షన్‌తో పాటు మరికొన్ని బెనిఫిట్స్ మాజీ ఉపరాష్ట్రపతులకు ఉంటాయి. ► ఉపరాష్ట్రపతి ఐదేళ్లపాటు పదవిలో ఉంటారు. ఉపరాష్ట్రపతిగా ఓ వ్యక్తిని ఎన్నిసార్లైనా ఎన్నుకోవచ్చు. ► ఒకవేళ ఉపరాష్ట్రపతి లేని టైంలో రాజ్యసభ వ్యవహారాలను డిప్యూటీ చైర్మన్ చూసుకుంటారు. ► రాష్ట్రపతి పదవిలో ఉన్న ఓ వ్యక్తి మరణిస్తే.. ఉపరాష్ట్రపతి ఆ బాధ్యతలను చేపడతారు. అయితే అది ఆరునెలల వరకే. అంటే తాత్కాలిక రాష్ట్రపతిగా అన్నమాట. ఆలోపు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ► 35 ఏళ్ల వయసు ఉండాలి. లాభదాయకమైన పదవులు అనుభవిస్తున్న వారు అనర్హులు. భారతీయ పౌరసత్వం ఉన్న ఎవరైనా సరే ఉపరాష్ట్రపతి పోటీకి అర్హులు. అయితే రాజకీయ పార్టీల ప్రాబల్యంతో.. పార్లమెంట్ అంతర్గత వ్యవహారంగానే మారింది ఉపరాష్ట్రపతి ఎన్నిక. ► 1962 నుంచి న్యూఢిల్లీలోని నెంబర్ 6, మౌలానా ఆజాద్ రోడ్‌లోని అధికారిక నివాసాన్ని ఉపరాష్ట్రపతి కోసం ఉపయోగిస్తోంది భారత ప్రభుత్వం. ఆరున్నర ఎకరాల్లో ఉంటుంది ఉపరాష్ట్రపతి భవన్ కాంపౌండ్. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ గనుక పూర్తైతే.. అందులో ఉపరాష్ట్రపతికి శాశ్వత భవనం కేటాయించాలని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ► భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం.. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యుల ఓట్లు.. విజేతను నిర్ణయిస్తాయి. ఎన్నికల సంఘం సీక్రెట్ బాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహిస్తుంది. ► ఐదేళ్ల పదవీకాలం. రాజ్యసభ పూర్తి మెజారిటీతో ఆమోదించిన తీర్మానం, సాధారణ మెజారిటీతో లోక్‌సభ తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చని భారత రాజ్యాంగం పేర్కొంది. రాజ్యసభకు అర్హత ప్రమాణాలను నెరవేర్చనందుకు మరియు ఎన్నికల అవకతవకలకు పాల్పడినందుకు ఉపరాష్ట్రపతిని సుప్రీంకోర్టు కూడా తొలగించవచ్చు . ఇదీ చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీతం ఎంతో తెలుసా? -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!
Latest News On Central Government Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను ఇటీవల పెంచిన తర్వాత, వారి జీతం రూ.95,000 పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈఏడాది జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)లో 28 శాతం పెంచింది. ఆ తర్వాత ఆ డీఏ నుంచి 28శాతం నుంచి 31శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పే గ్రేడ్ ప్రకారం జీతం పెరుగుతుంది ఉద్యోగుల బేసిక్ పే, గ్రేడ్ ప్రకారం వారి జీతం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు, డీఏ పెరిగిన తరువాత జీతం పెరగాల్సి ఉంటుంది. ఇక కేంద్రం నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 68.62 లక్షల మంది పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. 7వ పే కమిషన్ సిఫార్సు ప్రకారం, లెవెల్ 1 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి జీతం రూ. 18000 నుండి రూ. 56900 వరకు ఉంటుంది. రూ. 18000 జీతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి వార్షిక జీతం రూ. 30,240 పెరుగుతుంది. మినిమం బేసిక్ శాలరీ ►ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ. 18,000 ►కొత్త డియర్నెస్ అలవెన్స్ (31%) రూ. 5580/నెలకు ►డియర్నెస్ అలవెన్స్ ఇప్పటివరకు (17%) రూ. 3060/నెలకు ►ఎంత కరువు భత్యం పెరిగింది 5580-3060 = రూ 2520/నెలకు ►వార్షిక జీతం పెరుగుదల 2520X12 = రూ. 30,240 మ్యాగ్జిమం బేసిక్ శాలరీ ►ఉద్యోగి ప్రాథమిక వేతనం: రూ. 56900 ►కొత్త డియర్నెస్ అలవెన్స్ (31%) రూ 17639 / నెల ►డియర్నెస్ అలవెన్స్ ఇప్పటివరకు (17%) రూ. 9673 / నెల ►డియర్నెస్ అలవెన్స్ ఎంత పెరిగింది 17639-9673 = రూ 7966 / నెల ►వార్షిక వేతనం పెరుగుదల 7966X12 = రూ. 95,592 ►31% డియర్నెస్ అలవెన్స్ ప్రకారం, రూ. 56900 బేసిక్ జీతంపై మొత్తం వార్షిక డియర్నెస్ అలవెన్స్ రూ. 211,668. కానీ వ్యత్యాసం గురించి మాట్లాడితే, జీతంలో వార్షిక పెరుగుదల రూ. 95,592 పెరుగుతోంది. చదవండి : పీఎఫ్ఓ రూల్స్ మారాయ్, ఈపీఎఫ్ అకౌంట్‌తో రూ.7లక్షల వరకు బెన్ఫిట్స్..! -
ముకేశ్ అంబానీ వేతనం ఎంతంటే..
సాక్షి, ముంబై: బిలయనీర్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వార్షికవేతనాన్ని మరోసారి పరిమితం చేసుకున్నారు. వరుసగా 11 సంవత్సరం కూడా వేతనాన్ని రూ.15 కోట్లుగా నిర్ణయించారు. 2008-09 నుంచి ఆయన జీతం, ఇతర అలవెన్సులు కలిపి రూ .15 కోట్లకు మించకుండా జాగ్రత్తపడుతున్నారు. అంటే సంవత్సరానికి దాదాపు రూ. 24 కోట్లను వదులకుంటున్నారు. కాగా 2019 ఆర్థిక సంవత్సారానికి గాను నిఖిల్ ఆర్ మేస్వానీ, హితాల్ మేస్వా సహా కంపెనీలోని పూర్తి కాలం డైరెక్టర్ల జీతం భారీగా పుంజుకుంది. ఆర్‌ఐఎల్‌విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలను ప్రకటించింది. అంబానీ బంధువులైన నిఖిల్ ఆర్ మేస్వానీ, హితాల్ మేస్వానీల ఒక్కొక్కరి వేతనం రూ .20.57 కోట్లకు పెరిగింది. ఇది 2017-18లో రూ .19.99 కోట్లు, 2016-17లో రూ .16.58 కోట్లు గా ఉంది. అలాగే, అతని ముఖ్య కార్యనిర్వాహకులలో ఒకరైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి ఎం ఎస్ ప్రసాద్ అతని వేతనం గత ఏడాదితో పోలిస్తే రూ .8.99 కోట్ల నుంచి రూ .10.01 కోట్లకు పెరిగింది. నీతా అంబానీతో సహా ఆర్ఐఎల్కు చెందిన నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకు సిట్టింగ్ ఫీజుతో పాటు ఒక్కొక్కరికి 1.65 కోట్ల రూపాయలు కమిషన్‌గా లభించాయి. ఈ కమిషన్ 2017-18లో రూ .1.5 కోట్లు, అంతకుముందు సంవత్సరంలో రూ .1.3 కోట్లు మాత్రమే. అయితే 2018 అక్టోబర్ 17న ఆర్ఐఎల్ బోర్డులోమాజీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) చైర్మన్ అరుంధతి భట్టాచార్య రూ. 75 లక్షలను మాత్రమే కమిషన్‌గా పొందారు. కంపెనీ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీకి ఫీజుగా రూ .7 లక్షలు దక్కాయి. అంతకుముందు సంవత్సరంలో ఇది రూ .6 లక్షలు. అంబానీతో పాటు, ఆర్ఐఎల్ బోర్డులో మెస్వానీ సోదరులు, ప్రసాద్, కపిల్‌లు హోల్‌టైమ్ డైరెక్టర్లుగా ఉండగా, నీతా అంబానీతో పాటు, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో మన్సింగ్ ఎల్ భక్తా, యోగేంద్ర పీ త్రివేది, దీపక్ సీ జైన్, రఘునాథ్ ఎ మషెల్కర్, ఆదిల్ జైనుల్భాయ్ రమీందర్ సింగ్ గుజ్రాల్, షుమీత్ బెనర్జీ , అరుంధతి భట్టాచార్య ఉన్నారు. కాగా కార్పొరేట్ సీఈవోల వేతనాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటున్నాయన్న విమర్శల నేపథ్యంలో 2009 అక్టోబర్‌లో స్వచ్ఛందంగా తన వేతనాన్ని రూ. 15 కోట్లకు పరిమితం చేసుకున్న సంగతి తెలిసిందే. -
జస్టిస్ కక్రూను వెంటనే తొలగించాలి
తెలంగాణ న్యాయవాదుల సంఘం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: విధులకు హాజరు కాకుండానే జీత భత్యాలు, ఇతర సౌకర్యాలను అనుభవిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూను వెంటనే తొలగించాలని తెలంగాణ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. ఉన్నత పదవిలో ఉన్నా అనైతికంగా ప్రవర్తిస్తున్నారని, చైర్మన్‌గా ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగే అర్హత ఆయనకు లేదని మండిపడింది. సంఘం అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ నేతృత్వంలో న్యాయవాదులు గురువారం కమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.