salings
-
దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్‌రాజ్
ఆదిలాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తుల ను అర్హులైన ప్రతీ కుటుంబానికి ఉచితంగా అందజేస్తున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లాలో దరఖాస్తుల కొరత లేదని ప్రతి గ్రామం, ము న్సిపల్ వార్డులో ఉన్న కుటుంబాల కంటే పది శా తం అదనంగా పంపించామన్నారు. మీసేవ, జిరా క్స్ కేంద్రాలు, దళారులు విక్రయించినట్లైతే చర్యలు తప్పవన్నారు. మీసేవ కేంద్రాల లైసెన్స్ రద్దుతో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఆరు గ్యారంటీల దరఖాస్తుల వివరాలు వెల్లడించారు. దరఖాస్తు నింపేందుకు కొంతమంది రూ.50వరకు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలా జరుగకుండా అన్ని చోట్ల వాటిని నింపేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశామన్నారు. ఆరు గ్యారంటీలకు ఒకే కా మన్ దరఖాస్తు పత్రం ఉంటుందని, అందులో అవసరమైన సాయంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. రేషన్‌కార్డు లేని వారు, ఆధార్‌కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉన్న వారు కూడా నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పింఛన్ పొందుతున్న ల బ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, రైతుబంధు సాయం పొందుతున్న రైతులు మాత్రం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కొత్తగా రేషన్‌కార్డు పొందాలనుకునే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అద్దె ఇళ్లలో నివసించేవారు గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం అద్దె ఇంటి విద్యుత్ సర్వీస్ నంబర్‌తోనూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఇ బ్బందులు పడుకుండా ఉండేలా అన్ని కేంద్రాల్లో షామియానాలు, తాగునీటి వసతి కల్పించామన్నారు. జనవరి 6వరకు కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, అప్పటికీ అందించలేని వారు కూడా ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయవచ్చని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందజేస్తామన్నారు. డబ్బులిస్తే ఇప్పిస్తామని నమ్మబలికే దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. సంక్షేమ ఫలాల కోసం మహారాష్ట నుంచి వచ్చే వారికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తే మాత్రం బాధ్యులైన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో జనాభా ఎక్కువగా ఉన్నందున ప్రతి వార్డుకు ఓ జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించినట్లుగా వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా పాల్గొన్నారు. -
కంట్లో 'కారం'
* గుంటూరులో యథేచ్ఛగా కల్తీ కారం తయారీ * వ్యర్థాలకు రంగులద్ది.. ఆపై జనం నెత్తిన రుద్ది.. * తయారీలో ప్రమాదకర రసాయనాల వినియోగం * కోట్లల్లో వ్యాపారం.. ప్రమాదంలో ప్రజారోగ్యం * నియంత్రణ చర్యలు నామమాత్రం తోపుడుబళ్లు.. టిఫెన్ సెంటర్లలో తయారుచేసే ఆహార పదార్థాలు ఎర్రగా వర్రగా కనిపిస్తూ నోట్లో నీళ్లూరింపజేస్తాయి. వ్యాపారులు ఎదురుగా ప్రదర్శించే చికెన్ లేదా గోబీ మంచూరియాలకు రంగుల మసాలాలద్ది ఇట్టే ఆకట్టుకుంటారు. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లతో పోల్చితే ఇక్కడ రేట్లు కూడా తక్కువే. మరి ఇలాంటి కల్తీ కారాన్ని ఎలా తయారుచేస్తున్నారో తెలిస్తే గుండెలు బాదుకోవాల్సిందే. సాక్షి, అమరావతి బ్యూరో : ‘కాదేదీ కల్తీకనర్హం..’ అన్నట్లుంది జిల్లాలో పరి స్థితి. ప్రతి వస్తువులోను కల్తీ చేసి వ్యాపారులు అందినకాడికి దోచుకుం టున్నారు. నియంత్రించాల్సిన కొం దరు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడంతో వీటికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. నిత్యావసరాలు నూనె, నెయ్యి, కందిపప్పు, కారం ప్రతిదానిలో కల్తీ చేసి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. గుంటూరులో 100కు పైగా కారం మిల్లులు ఉన్నాయి. సగటున ఏడాదికి 40 వేల టన్నులకు పైగా కారంపొడిని తయారుచేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పంపుతారు. ఇందులో కొంతమంది కల్తీ కారం తయారుచేసి జనాలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. గురువారం మిల్లులు, కోల్డ్ స్టోరేజీలపై విజిలెన్స్ దాడుల నేపథ్యంలో కల్తీ కారం గురించి ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్తీకి శ్రీకారం చుడుతున్నారిలా.. కల్తీ కారాన్ని ప్రధానంగా రెండు పద్ధతుల్లో చేస్తున్నట్లు తెలిసింది. ప్రకాశం జిల్లా కంభం, మేదరమెట్లలో చైనా సాంకేతిక పరిజ్ఞానంతో మిరపకాయల నుంచి నేచురల్ ఎరుపు కలర్, ఆయిల్ తయారుచేస్తారు. ఈ నేచులర్ కలర్ ఫారిన్లో ఉపయోగిస్తారు. ఆయిల్‌ను టాబ్లెట్లపై ఉండే నున్నటి చిన్న పొరకు వినియోగిస్తారు. దీనిని తయారుచేసేటప్పుడు పెద్దఎత్తున వ్యర్థం వస్తుంది. ఇది రంపపు పొట్టు మాదిరి ఉంటుంది. దీనిని ఇక్కడి వ్యాపారులు చైనా కారం అని వాడుక భాషలో పిలుస్తారు. దీనికి కారానికి సంబంధించిన గుణాలు ఉండవు. ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వ్యర్థాన్ని దూరంగా తీసుకెళ్లి పారవేయాలి లేదా పాతిపెట్టాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పష్టంగా పేర్కొంది. పవర్ ప్లాంట్‌లో దీనిని ఉపయోగిస్తారు. దీంతో ఫ్యాక్టరీ యజమాన్యమే దీనిని బయట వేసేందుకు కిలోకు రెండు రూపాయల చొప్పున కాంట్రాక్టర్‌కు ఇస్తోంది. ఈ వ్యర్థాన్ని గుంటూరుకు చెందిన కొంతమంది కారం మిల్లుల యజమానులు కిలో రూ. 10–16 లకు కొనుగోలు చేసి కల్తీ కారం తయారు చేస్తున్నట్లు తెలిసింది. మిరపకాయలను ప్రాసెసింగ్ చేసేటప్పుడు కెమికల్స్ కలుపుతారు. అందువల్ల ఈ పొడిలో వ్యర్థాలు ఇమిడిపోతాయి. దీనివల్ల కిడ్నీ, లివర్ సంబంధ వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తయారీ ఇలా... ఫ్యాక్టరీల నుంచి వచ్చిన పొట్టు (బూడిద) 85 శాతం, 10 శాతం కారం, 5 శాతం రెడ్ఆక్సైడ్ మిక్స్ చేసి కల్తీ కారం తయారు చేస్తారు. ఇంకో పద్ధతిలో మిరపకాయల కాడలు, తాలు కాయలను తీసుకుని పొడి చేస్తారు. ఇది కొద్దిగా మిర్చి వాసన వస్తుంది. దీనికి కొంచెం మంచి కారం, రెడ్ ఆక్సైడ్, సూడాన్‌ను కలిపి కారం తయారు చేస్తారు. మిరప తొడిమల్లో సైతం ఆఫ్లటెగ్జాన్ ఉండడంతో లివర్ సంబంధ వ్యాధులు వస్తాయి. మంచి కారం అంటే... క్యాపిన్ గాఢత 900 ఎస్‌హెచ్‌యూ, కలర్ వాల్యూ 70 యూనిట్లు ఆస్టా, ఆప్లటెగ్జిన్ 10 పీబీ నుంచి 30 పీబీ వరకు ఉండాలి. బూడిద (వ్యర్థం) 7 శాతం, తేమ 11 శాతం ఉండాలి. ఈ నకిలీ కారంలో క్యాపిన్ గాఢత, కలర్ వాల్యూ వంటివి ఏవీ ఉండనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బూడిద మాత్రం 90 శాతానికి పైగా ఉన్నట్లు సమాచారం. సరఫరా చేస్తున్నారిలా... తక్కువ ధర పేరుతో హోటళ్లు, తోపుడు బళ్లు, హాస్టళ్లకు ఈ కారం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో తోపుడుబళ్లపై దీనిని అమ్ముతున్నట్లు సమాచారం. కొన్ని రకాల బ్రాండ్ల పేరుతో కారం పొడి తయారుచేసి ఈ కల్తీ కారం విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. -
దసరాకు కిక్కే కిక్కు!!
* 20 శాతం అమ్మకాలు పెంచాలంటూ ఒత్తిడి * మద్యం దుకాణాల్లో ఫుల్‌గా స్టాక్ * ప్రభుత్వ చర్యతో విస్తుపోతున్న వ్యాపారులు నరసరావుపేట టౌన్ : దసరా పండుగకు కిక్కును పెంచేందుకు అబ్కారీ శాఖ సంసిద్ధమైంది. వరుసగా సెలవులు రావడంతో అమ్మకాలు పెంచాలంటూ వ్యాపారులపై తీవ్రమైన ఒత్తిడి పెంచింది. గత ఏడాదికంటే ఈ ఏడాది 20 శాతం అధికంగా విక్రయాలు చేపట్టాలంటూ టార్గెట్ విధించింది. దీంతో మద్యం దుకాణాల్లో స్టాక్ ఫుల్‌గా దర్శనమిస్తోంది. వివరాల్లో కెళితే... ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు పండుగలను సైతం అక్రమ మార్గంలో వినియోగించుకొంటున్నారు. డివిజన్లో 50 బార్ అండ్ రెస్టారెంట్లు, 180 వైన్‌షాపులు ఉన్నాయి. అక్టోబర్‌లో వరుసగా దసరా, మొహర్రం, దీపావళి పండుగలు వచ్చి సెలవులు రావడంతో ఎక్సైజ్ శాఖకు ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావించింది. దీంతో గత ఏడాది అక్టోబర్ నెలలో జరిగిన అమ్మకాల కంటే 20 శాతం అధికంగా ఆదాయం సమకూరాలని అధికారులకు ఆదేశాలు జారిచేసినట్టు తెలిసింది. అధికారులు వ్యాపారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ నెలలో అమ్మకాల శాతం పెంచాలని హుకుం జారీ చేశారు. చేసేదేమీ లేక వ్యాపారులు సాధారణంగా కొనుగోలు చేసే స్టాక్‌కు అదనంగా మరో 20 శాతం ఎక్కువ నగదుతో డీడీలు చెల్లించి స్టాక్‌ను తీసుకున్నారు. దీంతో ప్రతి మద్యం దుకాణంలో స్టాక్ ఫుల్‌గా దర్శనమిస్తోంది. సొంత ఊళ్లకు వచ్చే వారిని దృష్టిలో ఉంచుకొని ఈనెలలో ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఒత్తిడితో బెంబేలు.. ఈ నెలలో ఆదాయం పెంచాలని మద్యం వ్యాపారులపై అధికారులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడంతో వారు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే గతనెలలో ఆశించిన మేర అమ్మకాలు లేక దుకాణాల్లో స్టాక్ ఫుల్‌గా ఉన్న నేపథ్యంలో అధికారుల ఒత్తిడి కారణంగా కొందరు వ్యాపారులు అప్పులు తీసుకొచ్చి మరీ స్టాక్‌ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ పండుగల వేళల్లో కూడా మద్యం ఏరులైపారే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం పలు విమర్శలకు తావిస్తోంది. -
ఆరు విత్తన షాపుల లైసెన్స్‌లు సస్పెన్షన్
జేడీఏ కృపాదాసు గుంటూరు (కొరిటెపాడు) : నకిలీ విత్తనాలు విక్రయించి రైతులు నష్టపోవటానికి కారణమైన ఆరు విత్తన షాపుల లైసెన్సులను సస్పెండ్ చేసి అమ్మకాలు నిలిపి వేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వీడీవీ కృపాదాసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మేడికొండూరు, అమరావతి మండలాల్లో జీవా అగ్రి జెనిటిక్స్ కంపెనీకి సంబంధించిన మిరప జేసీహెచ్–802 హైబ్రిడ్ రకాన్ని సాగు చేసి తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు, రైతు సంఘాల నుంచి ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. ఆ ఫిర్యాదులకు స్పందించి ఉద్యాన శాఖ శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో కూడిన జిల్లా కమిటీ ఆయా పొలాలను సందర్శించారని తెలిపారు. ఈ రకం మిరప విత్తనాలు సాగు చేసిన రైతుల పొలాల్లో 30 నుంచి 35 శాతం జన్యు స్వచ్ఛత లేనట్లుగా తేలిందని పేర్కొన్నారు. దీంతో మేడికొండూరు పోలీస్ స్టేషన్లో జీవా కంపెనీపై నమోదు చే సిన 420 కేసుకు సపోర్టుగా జిల్లా కమిటీ రిపోర్టు ఇచ్చిందని వివరించారు. రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా చేసిన ఆరు షాపుల లైసెన్సులను విత్తన చట్టం ప్రకారం సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా అగ్రి జెనిటిక్స్ కంపెనీ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ వ్యవసాయ శాఖ డైరెక్టర్‌కు జిల్లా కమిటీ రిపోర్టు అందజేసినట్లు ఆయన వివరించారు.