salivahana
-
వుడయార్ శిల్పశాలలో శాలివాహన చక్రవర్తి
కొత్తపేట : చరిత్రకందిన తొట్ట తొలి తెలుగు చక్రవర్తి, నవశక సృష్టికర్త, ప్రథమాంధ్ర మహా పాలకుడు శాలివాహన చక్రవర్తి కాంస్య విగ్రహం కొత్తపేటలోని శిల్పి రాజకుమార్ వుడయార్ శిల్పశాలలో రూపుదిద్దుకుంది. ఈ విగ్రహాన్ని శాలివాహన చక్రవర్తి జయంతి రోజైన ఈనెల 22న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నెలకొల్పనున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో గుంటూరు జిల్లా శాలివాహన సంక్షేమ సంఘం వారు ఈ విగ్రహాన్ని తయారుచేయించారు. మంగళవారం ఈవిగ్రహాన్ని చిలకలూరిపేటకు తరలించారు. అశోకుడు కాలంలో మగధ సామ్రాజ్యానికి శాలివాహన చక్రవర్తి సామంతుడుగా ఉంటూ ప్రత్యేక ప్రతిపత్తితో పాలన సాగించారు. తరువాత గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని ధరణికోటను రాజధానిగా చేసుకుని సామ్రాజ్యాన్ని విస్తరించారు.ఆ చక్రవర్తి కథతోనే ఇటీవల బాలకృష్ణ హీరోగా ‘గౌతవీుపుత్ర శాతకర్ణి’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ చక్రవర్తి విగ్రహం తొలుత ఎ¯ŒSటీ రామారావు హయాంలో హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నెలక్పొనున్న ఈ విగ్రహం నవ్యాంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిదని శిల్పి రాజ్‌కుమార్ తెలిపారు. గుర్రం రెండు కాళ్లపై రెండు టన్నుల విగ్రహం ముందు రెండు కాళ్లు పైకి లేపి వెనుక రెండు కాళ్లపై నిలబడిన గుర్రంపై ఒక చేత్తో ఖడ్గం, మరో చేత్తో కళ్లెం పట్టుకున్న శాలివాహన చక్రవర్తి విగ్రహాన్ని 12 అడుగుల పొడవున సుమారు రెండు టన్నుల కాంస్యంతో తయారుచేశారు. -
శాలివాహనుల సంక్షేమానికి కృషి
రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ తుగ్గలి వేళంగి(కరప): రాష్ట్రంలోని శాలివాహనుల సంక్షేమానికి కృషిచేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ శాలివాహన ఫెడరేషన్ చైర్మన్ తుగ్గలి కె.నాగేం ద్ర తెలిపారు. వేళంగిలో బుధవారం జరిగిన శాలివాహనుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాలివాహనుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసిందన్నారు. తమ పిల్లలను చదివించి, ఉన్నతులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వమిచ్చే నిధులతో ఒక్కొక్కరికి రూ.2 లక్షలు వంతున, అయిదుగురు కల్సి ఒక గ్రూపుగా ఏర్పడితే రూ.10 లక్షలు వంతున వ్యాపారం చేసుకొనేందుకు రుణంగా మంజూరు చేస్తామన్నారు. నిరుద్యోగులు శాలివాహన వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుంటే, వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్పంచ్ నుంచి మేయర్, శాసనసభ్యులు వంటి పదవులేకాక, అన్నిరంగాలలో వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంఘం రాష్ట్ర కోశాధికారి సఖినేటిపల్లి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ, కాకినాడ డివిజన్ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్, మండలశాఖ అధ్యక్షుడు కాజులూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.