Salon Shop
-
నగరంలోని సైనిక్ పురి లో ఇంటర్నేషనల్ జ్యూసి సలోన్ ప్రారంభం (ఫోటోలు)
-
సెలూన్ ఓపెనింగ్‌లో నమ్రత సందడి (ఫోటోలు)
-
20 రూపాయిల కోసం దారుణం..
న్యూఢిల్లీ: రానురాను మనుషుల్లో మానవత్వం మచ్చుకైనా లేకుండా పోతుంది. చిన్న చిన్న విషయాలు కూడా తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి దారుణం ఒకటి దేశ రాజధానిలో చోటు చేసుకుంది. కేవలం 20 రూపాయలు ఇవ్వనందుకు ఓ వ్యక్తిని అతడి కుమారుడి కళ్ల ముందే దారుణంగా కొట్టి చంపేశారు కర్కోటకులు. వివరాలు.. రూపేష్(38) అనే వ్యక్తి ఉత్తర ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో తన భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతం ఘోరమైన నేరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలో రూపేష్ కటింగ్ చేయించుకోవడం కోసం తన ఇంటి పక్కనే ఉన్న బార్బర్ షాప్‌కి వెళ్లాడు. యాభై రూపాయల బిల్లు అయ్యింది. రూపేష్ రూ.30 చెల్లించి మిగతా ఇరవై రూపాయలు తర్వాత ఇస్తా అన్నాడు. దాంతో ఆగ్రహించిన షాపు ఓనర్ తన సోదరుడితో కలిసి అతడిపై దాడి చేశాడు. (చదవండి: పోలీసు ఉన్నతాధికారి దారుణం : వైరల్ వీడియో) ఈ దారుణం జరిగినప్పుడు రూపేష్ కుమారుడు అక్కడే ఉన్నాడు. దాడిని ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ వారు ఆగలేదు. జనాలు చూస్తూ ఉన్నారు కానీ ఆపే ప్రయత్నం చేయలేదు. చివరకు అతడు మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితులు సంతోష్, సరోజ్‌లను అరెస్ట్ చేశారు. -
నేచురల్స్.. ఫుల్కేర్!
జూబ్లీహిల్స్: ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో సురక్షితమైన సెలూన్ సర్వీసులు అందించడం ఎంతో ముఖ్యమని నటి మధుశాలిని అన్నారు. బంజారాహిల్స్ లోని నేచురల్స్ హెయిర్ సెలూన్స్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె గోద్రెజ్ ప్రొఫెషనల్ సురక్ష కార్యక్రమంప్రారంభించి హెయిర్ కటింగ్ చేయించుకున్నారు. నిర్వాహకులు అరవింద్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న తమ సంస్థ శాఖలను ఎప్పటికప్పుడు పూర్తిశానిటైజ్ చేస్తున్నామని, పీపీఈ సూట్లు, మాస్కులు ధరించిన సిబ్బంది సహా అన్ని రకాల భద్రత,పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
మా అనుమతి లేకుండా సెలూన్ పెడతవా..
శంషాబాద్: తమ అనుమతి లేకుండా సెలూన్ షాపు ఎలా పెడతావని ఓ వ్యక్తిపై నాయీబ్రాహ్మణ సంఘం నేథ దాడి చేశాడు. ఈ సంఘటన శంషాబాద్ పట్టణంలో బుధవారం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. దూసకంటి జానకీరాం, రమాదేవి దంపతులు పట్టణంలోని వీకర్‌సెక్షన్ కాలనీలో కొన్నేళ్లుగా నివాసముంటున్నారు. జీవనోపాధి నిమిత్తం జానకీరాం పురపాలక సంఘం అనుమతి తీసుకొని వెళాంగనీ కాలనీ వద్ద సెలూన్ షాప్ పెట్టుకోడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ విషయమై స్థానిక నాయిబ్రాహ్మణ సంఘం నేతలు కొద్దిరోజులుగా అతడిని అడ్డుకుంటున్నారు. జానకీరాం స్థానికుడు కాదని, స్థానికులు మాత్రమే దుకాణం ఏర్పాటు చేసుకోవాలంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా బుధవారం జానకీరాం ఏర్పాటు చేసుకుంటున్న దుకాణం వద్దకు వచ్చిన పట్టణ నాయిబ్రాహ్మణ సంఘం నాయకుడు పాండు అతడిపై దాడికి పాల్పడ్డాడు. అతడి భార్య రమాదేవి వేడుకున్నా వదిలిపెట్టకుండా జానకీరాంపై పిడిగుద్దులు కురిపించాడు. దుకాణం వెంటనే తీసేయాలని హెచ్చరించాడు. ఈ విషయమై బాధిత దంపతులు ఆర్జీఐఏ పోలీసులను ఆశ్రయించారు. శంషాబాద్‌లో పుట్టి పెరిగిన తమను స్థానికులు కాదని దౌర్జన్యానికి పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొన్నిరోజులుగా నాయీబ్రాహ్మణ సంఘం నేతలు బెదిరిస్తున్నారని ఆర్జీఐఏ పోలీసులతో పాటు మున్సిపల్ కార్యాలయంలో పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని బాధిత దంపతులు పోలీస్‌స్టేషన్ వద్ద కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
సేఫ్.. సెలూన్..
సాక్షి, సిటీబ్యూరో: సహజంగానే సెలూన్స్‌లో పరిసరాలు ఆరోగ్య భద్రత విషయంలో కొంత ప్రశ్నార్థకంగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ విజృంభణ దశలో సెలూన్స్‌కు సడలింపులు ఇవ్వడం అనేక భయాలను రేకెత్తించింది. అయితే నగరంలో కొంత కాలంగా చక్కని ఆరోగ్యవంతమైన పద్ధతులు అవలంబిస్తున్న సెలూన్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని హామీ ఇస్తున్నాయి. వినియోగదారులు నిరభ్యంతరంగా తమ సేవలు వినియోగించుకోవచ్చని చెబుతున్నాయి. ♦ ‘మొదటి నుంచీ అత్యుత్తమ ఉత్పత్తుల, నాణ్యమైన విధానాలు పాటిస్తున్నాం. ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం’ అని లాక్మె సెలూన్స్ సీఈఓ పుష్కరాజ్ అంటున్నారు. నగరంలోని ఈ తరహా బ్రాండెడ్ సెలూన్స్ ప్రస్తుతం సురక్షిత పద్ధతులను అవలంబిస్తున్నాయి. ♦ ఆరోగ్య సేతు యాప్ ద్వారా సెలూన్ సిబ్బందిని, వినియోగదారులను పరిశీలించడం ♦ వినియోగదారుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ తీసుకోవడం. సీనియర్ సిటిజన్స్, పిల్లలు వంటి హైరిస్క్ వినియోగదారులకు పలు పార్లర్ చికిత్సలు నిరాకరించడం. ♦ సెలూన్స్ అసలు సామర్థ్యంలో కేవలం 50శాతం మంది సిబ్బందిని మాత్రమే సేవలకు వినియోగించడం. ♦ సోషల్ డిస్టెన్సింగ్‌కు తగ్గట్టుగా సీటింగ్ అమరికలో మార్పు. అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే సేవలు. ♦ చేతులు తాకే అవకాశం ఉన్న ప్రతి వస్తువు, పరిసరాల డీప్ క్లీనింగ్ రోజంతా సాగుతుంది. ♦ సిబ్బందికి మాస్కులు, గ్లవ్స్, విజర్స్, డిస్పోజబుల్ యాప్రాన్స్ పంపిణీ ♦ 90శాతం సేవలకు సింగిల్ యూజ్ కిట్స్. ♦ స్కిన్, హెయిర్, మేకప్ సేవలకు వ్యక్తిగతంగా స్పర్శించడం తగ్గించేందుకు ప్రత్యేకమైన పద్ధతులు. ♦ అన్ని సేవలకూ బయోగ్రేడబుల్, డిస్పోజబుల్స్ వినియోగం. ♦ ప్రతి పరికరం, ఉత్పత్తి వినియోగించిన అనంతరం తప్పనిసరిగా స్టెరిలైజేషన్. ♦ బిల్లింగ్, చెల్లింపుల దగ్గర ఎటువంటి కాంటాక్ట అవసరం లేకుండా చర్యలు. ♦ పోస్ట్ కేర్ ప్రొడక్టులు కావాల్సిన వారికి కాంటాక్ట్ రహితంగా హోమ్ డెలివరీ. ఈ తరహా జాగ్రత్తలు పాటించే సెలూన్స్ నగరంలో కొన్ని మాత్రమే ఉన్నాయి. వినియోగదారులు ఎక్కడైనా ఇతర సెలూన్లకు వెళ్లే ముందు ఈ జాగ్రత్తలు పాటించే వాటిని ఎంపిక చేసుకోవాలని, వీలైతే అక్కడి నిర్వహకులకు సూచించి ప్రత్యేక జాగ్రత్తలు పాటించేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
ఐసీయూ తరహాలో..
సాక్షి, సిటీ నెట్వర్క్: కోవిడ్ సరికొత్త పాఠాలు నేర్పించింది. అన్ని రంగాలు, సేవల్లోనూ కరోనా నిబంధనలకుఅనుగుణమైన మార్పులు వచ్చేశాయి.కోవిడ్‌కు ముందు, ఆ తర్వాత సేవలనిర్వచనాలు మారాయి. అన్ని రకాల వ్యాపార కార్యకలాపాల్లోనూ కోవిడ్ కట్టడి చర్యలు తప్పనిసరిగా మారాయి.మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు అన్నిచోట్లా దర్శనమిస్తున్నాయి.పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్లను తలపించే డ్రెస్సులతో సెలూన్లు సేవలందజేస్తున్నాయి. ఒకసారి వినియోగించి పారేసే సింగిల్ యూజ్ ఎక్విప్మెంట్ కిట్లు వినియోగంలోకి వచ్చాయి. మరోవైపు జనం సైతం ఎక్కడికెళ్లినా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. స్వచ్ఛందంగానే భౌతిక దూరం పాటిస్తున్నారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ షోరూమ్‌లు, మొబైల్ ఫోన్ షాపులు, వస్త్ర దుకాణాలు తదితర చోట్ల శానిటైజర్లు ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం లాక్డౌన్ నిబంధనలు భారీగా సడలించి అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు అనుమతినివ్వడంతో నగరంలో సందడి పెరిగింది. రహదారులపై వాహనాల రాకపోకలు సైతం పెరిగాయి. ఇదే సమయంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే వివిధ రకాల అవసరాల కోసం బయటకి వచ్చే నగరవాసులు కోవిడ్ నిబంధనలను పాటించేందుకే మొగ్గుచూపుతున్నారు. మరోవైపు వ్యాపార సంస్థలు సైతం నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. పలు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ షోరూమ్‌లలో థర్మల్ స్క్రీనింగ్‌లను ఏర్పాటు చేశారు. వినియోగదారుల శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటేనే అనుమతిస్తున్నారు. షోరూమ్ బయటే కాలుతో నొక్కి వినియోగించేందుకు అనువైన శానిటైజర్లను ఏర్పాటు చేశారు. ఒకేసారి ఎక్కువ మంది వినియోగదారులు వచ్చినప్పుడు భౌతిక దూరానికి విఘాతం కలగకుండా చిన్న చిన్న బృందాలుగా ఏర్పాటు చేసి పంపిస్తున్నారు. మరోవైపు పలు దుకాణాల్లో సిబ్బంది సంఖ్యను సైతం బాగా తగ్గించి సేవలు అందజేస్తున్నారు. మరోవైపు సుదీర్ఘమైన లాక్డౌన్ కారణంగా షాపులు మూసి ఉంచడం, కోవిడ్ నిబంధనల దృష్ట్యా పలు వస్తువులు, సేవల ధరలు సైతం పెరిగాయి. సాధారణ రోజుల్లో ఉన్న ధరలపై 20 నుంచి 26 శాతం వరకు పెంచి విక్రయిస్తున్నారు. ఐసీయూ తరహాలో.. 'మై సర్వీస్ వెరీ సేఫ్’. ఇప్పుడు హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్లు కొత్త తరహా నినాదాన్ని అందుకున్నాయి. కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన సెలూన్లు వినియోగదారులకు సురక్షితమైన సేవలనందించేందుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను తలపిస్తున్నాయి. పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. సెలూన్లు, బ్యూటీపార్లర్లలో పనిచేసే హెయిర్‌స్టైలిస్ట్‌లు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్లతో పాటు మాస్కులు, గ్లౌస్లు విధిగా ధరిస్తున్నారు. చాలా చోట్ల సింగిల్ యూజ్ ఎక్విప్మెంట్లనే వినియోగిస్తున్నారు. కత్తెర, దువ్వెన వంటివి వినియోగదారులు సొంతంగా తెచ్చుకొనేలా ప్రోత్సహిస్తున్నారు. వేడి డెట్టాల్ నీటిలో శుభ్రం చేస్తున్నారు. కస్టమర్ల రద్దీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కరిద్దరు కస్టమర్లకు మించి వెయిటింగ్లో ఉండనీయడం లేదు. అన్నిచోట్ల ఫోన్ బుకింగ్‌లు తప్పనిసరయ్యాయి. కేటాయించిన స్లాట్ ప్రకారం సేవలందజేస్తున్నారు. వరుసగా 4 సీట్లు ఉంటే ఒకటి విడిచి మరో సీటులో సేవలు అందిస్తున్నారు. ప్రతి గంటకు ఒకసారి శానిటైజ్ చేస్తున్నారు. హ్యాండ్‌వాష్ చేసుకున్న తర్వాతే వినియోగదారులను అనుమతిస్తున్నారు. రెస్టారెంట్లలో టేక్ అవే సర్వీసులు.. రెస్టారెంట్లు, హోటళ్లు టేక్ అవే సర్వీసులను అందజేస్తున్నాయి.రెండు రోజులుగా అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోవడంతో పార్శిళ్లు తీసికెళ్లే వారి సంఖ్య తగ్గింది. మాస్క్, భౌతికదూరం పాటించాలని, వచ్చిన వారు శానిటర్తో చేతులు శుభ్రపరుచుకోవాలని వినియోగదార్లకు సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఓన్లీ టేక్ అవే (పార్శిల్)కి మాత్రమే అవకాశం ఉండటంతో తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. పార్శిల్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితిలో లోపలి లాంజ్‌లో నాలుగు అడుగుల దూరంలో చైర్స్‌ను అమర్చారు. వచ్చిన వారికి ఒక మినరల్ వాటర్ బాటిల్ ఇచ్చి పార్శిల్ వచ్చే వరకు అక్కడ సేద తీరేలా ఏర్పాట్లు చేశారు. ఎంట్రన్స్‌లో ఉంచిన థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. కోవిడ్ రహిత క్యాబ్ సేవలు.. క్యాబ్‌లు క్రమంగా రోడ్డెక్కుతున్నాయి. ఉబెర్, ఓలా వంటి సంస్థలు కోవిడ్ వైరస్ నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తున్నాయి. బుకింగ్ బుకింగ్‌కూ మధ్య కారును శానిటైజ్ చేయడం తప్పనిసరి చేశారు. క్యాబ్ డ్రైవర్లకు మాస్క్‌లు, గ్లౌజ్‌లతో పాటు శానిటైజేషన్‌ను ఆయా సంస్థలే అందించేలా చర్యలు చేపట్టాయి. గ్రేటర్లో సుమారు 2 లక్షల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం క్యాబ్స్‌కు గ్రీన్ సిగ్నల్ పడ్డా ఈ రెండు రోజుల్లో 10 శాతం మాత్రమే రోడ్డెక్కాయి. పూర్తి స్థాయిలో కరోనా జాగ్రత్తలతో కూడిన పరికరాలను సమకూర్చుకుని రోడ్డెక్కాలనే వ్యూహంలో ఉన్నారు. ఉబెర్‌లో ఇద్దరికే అనుమతి.. క్యాబ్ డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు మాస్క్‌లు, శానిటైజేషన్ చేయించుకోవాలనే నిబంధన ఉంది. ప్రతి బుకింగ్ తర్వాత కారు లోపల భాగాన్ని శానిటైజ్ చేయాలని నిర్ణయించాం. అది ఏ మేర సాధ్యమవుతుందో ఆలోచిస్తున్నాం. క్యాబ్‌లో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులకు అనుమతి ఉండగా.. ఊబెర్ క్యాబ్ మాత్రం డ్రైవర్‌తో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతిస్తాం. – ప్రవీణ్, ఉబెర్ క్యాబ్ చందానగర్ బ్రాంచ్ లీడ్ ఆస్పత్రి తరహా సేవలు.. ఆస్పత్రి తరహాలో సెలూన్లో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక్కో కస్టమర్ బయటికి వెళ్లి మరో కస్టమర్‌ను లోపలికి పిలిచే ముందే షాపును పూర్తిగా శుభ్రపరుస్తున్నాం. పరికరాలు, టవల్స్, సీట్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నాం. – శ్రీనివాస్, సెలూన్ నిర్వాహకుడు ఈ పద్ధతులు ఎప్పటికీ పాటించాలి హెయిర్ కటింగ్ దుకాణాల్లో అమలు చేస్తున్న శానిటరీ పద్ధతులు బాగున్నాయి. కరోనా మాత్రమే కాదు ఎటువంటి అంటు వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఈ పద్ధతులు ఎంతగానో దోహదం చేస్తాయి. అన్ని రోజుల్లోనూ ఇటువంటివి అమలు చేయడం అందరికీ మంచిది. – వెంకటేశ్, వినియోగదారుడు శానిటైజేషన్ తప్పనిసరి.. కోవిడ్– 19 నేపథ్యంలో అటు క్యాబ్ డ్రైవర్లకు, ఇటు ప్రయాణికులకు సురక్షితమైన ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. క్యాబ్‌లపై విశ్వాసం కలిగేలా కారు లోపలి భాగంలో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలనే ఆలోచనలోనే యాజమాన్యం కూడా భావిస్తోంది. ఆ దిశగా క్యాబ్ డ్రైవర్లను కూడా సిద్ధం చేసే పనిలో ఉంది.– గోపీ, ఓలా క్యాబ్ ప్రతినిధి -
సెలూన్ షాప్‌లో పీపీఈ కిట్లు..
అహ్మదాబాద్ : కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఓ సెలూన్ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. కస్టమర్లకు హెయిర్ కట్ చేసే సమయంలో కరోనా సోకకుండా ఉండేందకు రక్షణగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ) కిట్లను ధరిస్తున్నారు. గుజరాత్ నడియాద్లోని ఓ సెలూన్ షాప్ యజమాని.. తన షాప్‌లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాడు. దీంతో ఆ సెలూన్ షాప్‌లోకి సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి కస్టమర్లకు హెయిర్‌కట్ చేస్తున్నారు. హెయిర్ కట్ చేసే సిబ్బంది పూర్తి స్థాయి పీపీఈ కిట్లు ధరించడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఆ సెలూన్‌కు వస్తున్న కస్టమర్లు కూడా ముఖానికి మాస్క్‌లు ధరించడంతోపాటుగా, భౌతిక దూరం నిబంధనను విధిగా పాటిస్తున్నారు. దీనిపై ఆ సెలూన్ షాప్ యజమాని విశాల్ మాట్లాడుతూ.. తమ సిబ్బందికి, కస్టమర్లకు కరోనా సోకకుండా ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తున్నట్టు తెలిపారు. కాగా, కరోనా వ్యాప్తికి అడ్డకట్టవేయడంలో పీపీఈ కిట్లు కీలక భూమిక పోషిస్తాయనే సంగతి తెలిసిందే. కేవలం కరోనా చికిత్స కేంద్రాలలోనే కాకుండా పారిశుద్ధ్య కార్మికులు కూడా వీటిని పూర్తిస్థాయిలో వినియోగిస్తే కరోనా వ్యాప్తిని మరింత సమర్థవంతంగా అడ్డుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. (చదవండి : జూమ్ కాల్‌తో 3700మందికి ఉబెర్ ఉద్వాసన) -
జీవితమే ఒక ‘ఆట’
ఈ చిత్రాలు చూశారా.. ఓ ఫొటో ఇండియూ ఖోఖో కప్పు సాధించిన జట్టు సభ్యులతో సారంగపాణి.. మరో చిత్రంలో కటింగ్ చేస్తున్నది కూడా సారంగపాణియే.. జాతీయ స్థారుులో ఆడిన వ్యక్తి సెలూన్ షాప్‌లో పనిచేయడం ఏంటని ఆశ్చర్య పోతున్నారా.. ఇదీ నిజం..! ఎన్ని పతకాలు సాధించినా.. అవార్డులు వరించినా.. ఏవీ కడుపునింపలే.. ప్రస్తుతం కులవృత్తే ఆకలి తీరుస్తోంది! ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఉద్యోగం ఇవ్వాలని సారంగపాణి కోరుతున్నాడు.. ఖిల్లా నుంచి మొదలు.. వరంగల్ కోటకు చెందిన నాగవెల్లి సారంగపాణికి చిన్నతనం నుంచే ఆటలపై ఎంతో ఆసక్తి ఉండేది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్న సారంగపాణికి ఖోఖో అంటే చచ్చేంత ప్రాణం. అయితే ఖోఖోపై అతడికి ఉన్న అభిరుచిని గమనించిన పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు అందులో నైపుణ్యాలు నేర్పించారు. ఇందులో భాగంగా పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏటా నిర్వహించే పోటీల్లో సారంగపాణి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించేవాడు. కాగా, 1999లో మణిపూర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు సారథ్యం వహించి బ్రౌంజ్ మెడల్‌ను సంపాదించాడు. 1996లో మొదటిసారిగా అం తర్జాతీయస్థాయిలో కోల్‌కతాలో నిర్వహించిన ఏషియన్ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టోర్నమెంట్లో భారతజట్టు బం గారు పతకం సాధిం చేందుకు సారంగపాణి ఎంతో కృషిచేశాడు. ప్రోత్సాహం కరువు.. నిరుపేద కుటుంబానికి చెందిన సారంగపాణికి ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో ఇబ్బం దులు ఎదుర్కొంటున్నాడు. ఖోఖోలో మేరునగధీరుడిగా పేరుగాంచిన సారంగపాణికి కొన్ని నెలల నుంచి ఆర్థిక ఇబ్బందులు నీడలా వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో 2001 వరకు పోటీ ల్లో పాల్గొన్న అతడు ది క్కుతోచని పరిస్థితిలో ఖోఖోకు స్వస్తిపలికి కు టుంబపోషణ కోసం కులవృత్తి సెలూన్‌షాపు ను పెట్టుకుని పనిచేస్తున్నాడు. దీంతో రోజు వచ్చే అరకొర సంపాదన తో అనారోగ్యంతో బా ధపడుతున్న తల్లికి వైద్యం చేయిస్తూ జీవిస్తున్నాడు. మంత్రి హామీ బుట్టదాఖలు.. అంతర్జాతీయస్థాయి క్రీడాకారుడిగా పేరు సంపాదించిన సారంగపాణికి అప్పటి హోంశా ఖ మంత్రి దేవేందర్‌గౌడ్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే మంత్రి హామీ అమలు కోసం ప్రభుత్వం వద్దకు తిరిగినా సారంగపాణికి ఉద్యో గం రాలేదు. అటు ఉద్యోగం రాక... షాపు సరిగ్గా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. దీంతో కొన్నేళ్ల నుంచి సారంగపాణి మరో షాపులో కూలీగా పనిచేస్తున్నాడు. సారంగపాణి ట్రాక్ రికార్డ్ పశ్చిమబెంగాల్లో 1988లో నిర్వహించి న సబ్‌జూనియర్ జాతీయస్థాయి ఖోఖో చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. మహారాష్ట్రలోని సతారాలో 1992లో జరిగిన నేషనల్ స్కూల్‌గేమ్స్‌లో రజత పతకం సాధించాడు. 1996లో కోల్క తాలో జరిగిన ఏషియన్ చాంపియన్‌షిప్‌లో ఏపీ జట్టుకు బంగారు పతకాన్ని సాధించిపెట్టాడు. మణిపూర్‌లో 1999లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ఏపీ తరపున ఆడి బ్రౌంజ్మెడల్ సాధించాడు. అలాగే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. 1998లో ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో చాంపియన్ సాధించాడు. 1994లో హర్యానాలో జరిగిన సీనియర్ ఖోఖో పోటీల్లో చాంపియన్‌షిప్ సాధిం చాడు. అలాగే పలు పోటీల్లో ప్రతిభ కనబరిచాడు.