డెబ్బయ్‌ల్లో డాషింగ్‌గా..
ఈయన కండలు చూడండి.. మీ కండలు ఒకసారి చూసుకోండి.. ఎలాగనిపిస్తోంది? ఏముంది బాడీ బిల్డర్‌కు ఆ మాత్రం కండలుండవా అని అంటారా.. ఈ బాడీబిల్డర్ వయసు 70 అయితే.. ఈయన తొలిసారి జిమ్‌కు వెళ్లింది కూడా 44 ఏళ్ల వయసులోనని తెలిస్తే.. గ్రేట్ అని అనాల్సిందేగా. అమెరికాకు చెందిన శామ్ బ్రయాంట్ జూనియర్ ప్రస్తుతం అక్కడ సెలబ్రిటీ అయిపోయాడు. అనేక పోటీల్లో ప్రైజులు కొట్టేస్తున్న ఈయనను చూసి యువకులు అసూయపడుతుంటారు. ఈయన బాడీని చూసినవారు.. శామ్ వయసు విషయం తెలియగానే నోరెళ్లబెట్టడం కామన్ అట.