s/o జస్టిన్
ఈ పిల్లాడిని గుర్తుపట్టారా..! ఇంటర్నెట్తో పరిచయమున్న ప్రతి నెటిజన్‌కు ఈ బుడతడు సుపరిచితమే.. ఫేస్బుక్లో ఫ్రెండ్ ఫొటోకు కామెంట్ చేయాలంటే ఈ చిన్నోడి ఫొటో పెట్టాల్సిందే కదా..! అమెరికాలోని ఫ్లోరిడాలో ఉండే ఈ బుడతడి పేరు సామ్ గ్రైనర్.
వీడికి 11 నెలల వయసున్నప్పుడు బీచ్‌లో ఇసుక తింటుండగా వీళ్ల మమ్మీ ఈ ఫొటో తీసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారట.. ఎనిమిదేళ్ల వయసున్న సామ్.. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన తండ్రి జస్టిన్ కోసం మళ్లీ నెట్ ముందుకొచ్చాడు. రూ.46.8 లక్షలు కావాల్సి ఉండగా ఇప్పటివరకూ రూ.23 లక్షలు విరాళం ఇచ్చారు.