వాటిని బాయ్ ఫ్రెండ్ చేత క్లీన్ చేయిస్తాడట!
లండన్: సంగీత రంగంలో పలు విభాగాల్లో ఇచ్చే గ్రామీ అవార్డులను దక్కించుకోవడం పట్ల సింగర్, లిరిక్స్ రైటర్ సామ్ స్మిత్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. 57వ ‘గ్రామీ’ అవార్డుల ప్రధానోత్సవంలో స్మిత్ నాలుగు అవార్డులను దక్కించుకున్నాడు. అయితే ఈ అవార్డులను తన తదుపరి బోయ్ ఫ్రెండ్ చేత క్లీన్ చేయిస్తానంటున్నాడు స్మిత్.
గత కొన్ని నెలల క్రితం తన బాయ్ ఫ్రెండ్ జోనాథన్ జీజిల్ తో స్మిత్ తెగతెంపులు చేసుకున్నసంగతి తెలిసిందే. తనను స్వలింగ్ సంపర్కునిగా (గే) ప్రకటించుకున్న అనంతరం స్మిత్-జీజిల్ ల సంబంధాలు బెడిసికొట్టాయి. ' నేను గ్రామీ అవార్డుల కార్యక్రమానికి ఒంటరిగానే వెళ్లాను. కనీసం గ్రామీ అవార్డులను నా నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ చేత పాలిష్ చేయిస్తా' అంటూ జోక్ పేల్చాడు స్మిత్.