Samajwadiparty
-
'నకిలీగాళ్లతో జాగ్రత్త.. నాన్న ఆశీస్సులు నాకే'
లక్నో : నకిలీ సమాజ్ వాది పార్టీ నేతలతో జాగ్రత్తగా ఉండాలని తన పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ హెచ్చరికలు జారీ చేశారు. శనివారం పార్టీ వార్షిక సమావేశం జరిగిన సందర్భంగా మరోసారి నరేశ్ ఉత్తమ్‌ను ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా పార్టీ నేతలు, కార్యకర్తలు మరోసారి తమ బాధ్యతలను గుర్తించాలని సూచించారు. గోరఖ్‌పూర్, పుల్పూర్ స్థానాలు ఖాళీ అయ్యాయని, ఉప ఎన్నికల్లో వాటిని సమాజ్‌వాది పార్టీ ఖాతాలో వేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ రెండు స్థానాల్లో ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య గతంలో గెలిచి ప్రస్తుతం అసెంబ్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో వాటిని లక్ష్యంగా చేసుకొని ముందుకెళ్లాలని అఖిలేశ్ కోరారు. 'నకిలీ సమాజ్‌వాదీల నుంచి జాగ్రత్తగా ఉండండి. సమాజ్‌వాది ఉద్యమాన్ని ఆపేందుకు వారు గతంలో పలు విధాలుగా ప్రయత్నించారు. వారు చేసిన ఒక కుట్రలో విజయం సాధించారు. అందుకే మనం ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయాం. అలాంటి అవకాశం ఇక మళ్లీ ఇవ్వొద్దు. నేతాజీ(ములాయం) తన తండ్రి అని ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటాను. ఆయన ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉంటాయి. ఈ ఉద్యమాన్ని మేం కలిసి ముందుకు తీసుకెళతాం' అని అఖిలేశ్ చెప్పారు. -
అత్యాచారాలపై ములాయం వివాదాస్పద వ్యాఖ్యలు
-
అత్యాచారం చేస్తే ఉరితీస్తారా?: ములాయం
మొరాదాబాద్: అత్యాచారం చేస్తే ఉరితీస్తారా అంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యలు చేసి తాజాగా వివాదంలో కూరుకుపోయారు. రేపిస్టులకు అనుకూలంగా ములాయం వ్యాఖ్యలు చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో గతవారం రెండు గ్యాంగ్ రేప్ లకు సంబంధించిన కేసుల్లో నిందితులకు మరణశిక్ష వేయడంపై ములాయం ఆగ్రహం వ్యక్తం చేశారు. రేప్ కేసులో మరణశిక్ష వేయడమే పరిష్కారమా? వాళ్లు యువకులు. యువకులు తప్పు చేస్తారు అంటూ మొరాదాబాద్ ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని శక్తి మిల్స్ లో ఓ ఫోటో జర్నలిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్ పై జరిగిన అత్యాచారం కేసులో ముగ్గురికి మరణశిక్ష విధించారు. అమ్మాయిలకు, అబ్బాయిలకు విబేధాలు వస్తాయి. దాంతో అమ్మాయిలు వెళ్లి అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేస్తారు. పాపం యువకులు ముగ్గురికి మరణ శిక్ష వేశారని ములాయం వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం చేస్తే మరణశిక్షేనా అంటూ తీవ్రంగా స్పందించారు. అధికారంలోకి వస్తే చట్టాలను మారుస్తాం. తప్పుడు కేసులు పెట్టేవారిపై కూడా శిక్షలు వేస్తామని పరోక్షంగా మహిళపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచార కేసులో వేస్తున్న శిక్షలపై, విధిస్తున్న చట్టాలను ములాయం ప్రశ్నించడం కొత్త వివాదానికి దారితీసింది. తాను అధికారంలోకి వస్తే అత్యాచారం కేసులకు సంబంధించిన చట్టాలను మారుస్తానని ములాయం అన్నారు. రేపిస్టులకు ములాయం బాసటగా నిలవడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పలు మహిళా సంఘాలు ఎలక్షన్ కమిషన్, జాతీయ మహిళ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.