samavedam
-
సామవేద సారమిదీ..
భారతీయ సంస్కృతీ వైభవంలో భాగంగా... నాదమే శంకరుడి శరీరం.. అంటూ త్యాగరాజు తన కీర్తన ద్వారా ప్రతిపాదించిన సంగీత తత్త్వాన్ని ప్రస్తావించుకుంటూ ‘మోదకర..’ అంటే అది సంతోషం ఇవ్వగలిగినదని ఆయన చెప్పిన విషయాలను తెలుసుకుంటున్నాం. మోదము అంటే హర్షము. సంతోషం ఇవ్వగలిగినది శాంతి. శాంతి అంటే ...ఎంత అనుభవించినా..రుచి తీరదు. ఎంతో హాయిగా ఉన్నట్లు అనిపించడమే కాదు... అసలు నిజంగా పరమ ప్రశాంతంగా ఉండగలిగిన స్థితికన్నాకూడా సుఖమయమైన స్థితి మరొకటి ఉండదు. ఆ స్థితికి చేరుకుంటే... మనసు కదలకుండా ఉండిపోతుంది. (చదవండి: సంసార జీవితంతో వేగలేను) నీళ్ళ కొలనులో రాయి వేస్తే... కెరటాలు వస్తాయి.. ధ్యానంలో కూడా అలా కదిలిన మనసును స్థిరం గా నిలబెట్టడానికి షోడశోపచారాలతో మళ్ళీ పరమేశ్వరుడి వద్దకు తీసుకెళ్ళినప్పుడు.. పరమ సంతోషం అక్కడే ఉద్బుదం అవుతుంది. సంçస్కృతి–అంటే తడి కలిగి ఉండడం... ఆర్ద్రత. ఒక విత్తనానికి తడి తగిలితే అంకురం వస్తుంది... అలాగే ఇది. కళకు, సంస్కృతి కి ఉండే గొప్పతనం ఏమిటంటే– అది అవతలివారిలో మంచి అధ్యవసానంతో కూడుకున్న బుద్ధిని నింపుతుంది. శాంతాన్ని నింపుతుంది. ఆ శాంతాన్ని ఇవ్వగలిగిన వేదం–సామవేదం. సామ–ఆమ.. అంటే శాంతి అనే అర్థం. సామగానం చేస్తే వెంటనే శాంతి కలుగుతుంది. సామగానం దీర్ఘంగా ఊపిరిపట్టి చేయాలి. అంత స్వరంతో అలా చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఊపిరి బిగపట్టడం కష్టమవుతుంది. ఫలితంగా స్వరభంగమవుతుంటుంది కూడా.(చదవండి: అర్థం ఉంటేనే అది శబ్దం అవుతుంది) ఇతర వేదాలను చదివేటప్పుడు స్వరభంగం దోషం. అనుమతించరు. కానీ సామవేదం చదివేటప్పుడు కించిత్ స్వరభంగం జరిగినా... పట్టించుకోకూడదు. అందుకే ‘‘వేదానం సామవేదోస్మి’’ అంటాడు కృష్ణ భగవానుడు. అంటే వేదాలలో నేను సామవేదాన్ని–అని. సామము పాడితే శాంతి కలుగుతుంది. సామదానం జరిగితే ప్రశాంతత దొరుకుతుంది. సంగీతం సామవేదంలోంచి వచ్చింది. సంగీతం తక్షణ ఫలితం ఏమిటి? అవతలివాడు ప్రశాంత పడతాడు. అంటే... అస్థిమితంగా ఉండేవారు శాంతిపొందుతారు. సంగీతం గురించి మాట్లాడుతూ–‘సంగీత మపి సాహిత్యం సరస్వత్యాః స్తన ద్వయమ్ ఏకమాపాత మధురం అన్యదాలోచనామతమ్‘. సంగీతసాహిత్యాలు– సరస్వతీ దేవి రెండు పాలిండ్లు. సంగీతమనే స్తనంలోంచి వచ్చిన పాలు అవతలివాడి ప్రజ్ఞాపాటవాలతో సంబంధం లేకుండా సంతోషాన్నిస్తాయి. అదే సాహిత్యమయితే కొంత శక్తి ఉంటే తప్ప అర్థం చేసుకుని ఆనందాన్ని పొందలేరు. ‘‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగానరసం ఫణిః’’. ఎప్పుడూ అస్థిమితంతో, కోపంతో ఊగిపోయే పాము కూడా సామగానం వినపడితే పడగ అలాగే పెట్టి ఆగిపోతుంది. కదలదు. ఎప్పుడూ అస్థిరంగా కదిలిపోతూ, ఏడుస్తూ, అటూ ఇటూ తిరుగుతూ, అల్లరి చేసే పిల్లలు కూడా సామగానం వినపడితే అలా నిలబడిపోయి సంతోషాన్ని పొందుతారు. బుద్దిలేని జీవులు కూడా అటువంటి సంగీతానికి ప్రసన్నత్వాన్ని పొందుతాయి. కారణం– అది సామవేదంలోంచి రావడం. అది శాంతి కారణం. శాంతి కారకం కావడానికి సంగీతం తప్ప–అదివిని మనసులో అశాంతి కలగడానికి సంగీతం సాధన కాదు. అటువంటి ‘‘మోదకర నిగమోత్తమ సామవేదసారం వారమ్ వారమ్’’ అన్నారు త్యాగరాజస్వామి. నిగమాలు అంటే వేదాలు. వాటిలో ఉత్తమమైనది సామవేదం. దాని సారమే పరమశివుడు. అందుకే ఆయన నటరాజుగా నిలబడ్డాడు. అన్ని కళలు ఆయననుండే వచ్చాయి. అలా రాశీభూతమైన సామవేద సారము శివుడే. ఇది భారతీయ సంగీతానికున్న గొప్పతనం. ఇదీ భారతీయ సంస్కృతికి పునాది. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
‘ప్రకృతిలో ప్రతీది అమ్మ ప్రతి రూపమే’
కాకినాడ కల్చరల్ : ప్రకృతిలో ప్రతీది అమ్మ ప్రతి రూపమేనని, మంచి మనస్సుతో అమ్మను కొలిస్తే అనుగ్రహం లభిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సామవేదం çషణ్ముఖ శర్మ ప్రవచించారు. స్థానిక సూర్యకళామందర్లో సరస్వతీ గానసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీభాగవతం ప్రవచన కార్యక్రమాలు మంగళవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో దేవీ భాగవతంలోని ఎన్నో అంశాలను వాటి అంతరార్థాలను షణ్ముఖశర్మ శ్రోతలకు వివరించారు. 18 పురాణాల విశిష్టత, దుర్గాదేవి వైభవాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. భక్తి మార్గంలో నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమానికి ముందు సామవేదం షణ్ముఖ శర్మ, పుష్పలత దంపతులను సరస్వతీ గానసభ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గానసభ ఉపా««దl్యక్షురాలు ఎల్.శేషుకుమారి, కార్యదర్శి శ్రీరంగనాథరావు, చైర్మన్ ఎల్.సత్యనారాయణ, సహాయ కార్యదర్శి కేవీఎస్ ఆంజనేయులు, సభ్యులు కేవీవీ శర్మ, ఆర్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచమంతటా నిండి ఉన్న జగన్మాత
కాకినాడ కల్చరల్ : జగన్మాత ప్రపంచమంతటా నిండి ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. సరస్వతీ గానసభ ఆధ్వర్యాన సూర్య కళామందిర్లో ‘దేవీభాగవతం’పై ఆయన ప్రవచనం చేశారు. చైతన్య స్వరూపిణిగా అమ్మను ఆరాధించడం ప్రతి వ్యక్తికీ ప్రథమ కర్తవ్యమని అన్నారు. ప్రవచనాలు మూడో రోజైన శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గానసభ ఉపా««దl్యక్షులు ఎల్.శేషుకుమారి, కార్యదర్శి ఎల్.రంగనాథరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘విశ్వనాథ’ది కవితారూపంలోని తపస్సు
‘సాహితీ సమాలోచనం’లో సామవేదం పాల్గొన్న అతిరథ మహారథులు రాజమహేంద్రవరం కల్చరల్ : సనాతన ధర్మప్రతిష్ఠకు అవతరించిన మహాయోగి కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అని, ఆయన కవితారూపక తపస్సు చేశారని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. తెలుగురథం సంస్ధ ఆధ్వర్యంలో శనివారం త్యాగరాజ నారాయణదాస సేవాసమితి ఆడిటోరియంలో జరిగిన విశ్వనాథ సాహితీసమాలోచనంలో సామవేదం పాల్గొని ప్రసంగించారు. విశ్వనాథ వాజ్ఞ్మయమంతా సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకుని సాగిందని, వేదాలలో, వేదాంతంలో విమలార్థాలను ప్రకటించడానికి వచ్చిన సరస్వతీ స్వరూపమే విశ్వనాథ అని అన్నారు.‘సద్యోనిర్గతమైన సర్వ కవితాసంరంభాన్ని’ ఆయన భగవంతునికి నివేదన చేశారు. జీవిత లక్షణాలయిన చావుపుట్టుకల విషవలయంనుంచి బయటపడటానికే ఆయన కవిత్వాన్ని నమ్ముకున్నారు. ‘శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్’ అన్న పోతనామాత్యుని లాగే ఆయన రామాయణ కల్పవృక్షాన్ని మోక్షసాధనకు రచించారని తెలిపారు.‘రామాయణ కల్పవృక్షం లోకానికి కావ్యం, నాకు సాధన’ అని విశ్వనాథ స్వయంగా పేర్కొన్నారని వివరించారు. భాగవత విరించి డాక్టర్ టి.వి.నారాయణరావు మాట్లాడుతూ శ్రీశ్రీ ‘నాకు సంస్కృతం రాదు, వాల్మీకి రామాయణం అర్థమవుతుంది,తెలుగు వచ్చు, విశ్వనాథ కల్పవృక్షం అర్థం కాదు’ అనేవారని గుర్తు చేశారు. విశ్వనాథ రచించిన కల్పవృక్షం గురించి మాట్లాడాలంటే అది వాగ్రూపమైన ఒక సత్రయాగ మవుతుందన్నారు. ‘జీవుని వేదన’ అనే మాటను పట్టుకుని ఆయన కల్పవృక్షాన్ని నిర్మించారని తెలిపారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ సాహితీ విరాడ్రూపం విశ్వనాథ అని, ఎందరు ఎన్ని రూపాలలో ఆయన కవిత్వాన్ని ఆవిష్కరించినా, చెప్పవలసింది ఇంకా మిగిలే ఉంటుందని అన్నారు. ఆదాయపుపన్నుశాఖ అధికారి ఓలేటి రామావతారం మాట్లాడుతూ 20వ శతాబ్దపు వటవృక్షం విశ్వనాథ సత్యనారాయణ అన్నారు. ఆయన స్పృశించని సాహితీ ప్రక్రియ లేదన్నారు.తెలుగు రథం ప్రతినిధి కొంపెల్ల శర్మ ప్రసంగించారు. భారతభారతి శలాక రఘునాథ శర్మ విశ్వనాథ కవితావైభవాన్నివిపులంగా వర్ణించారు. ప్రముఖ ఆడిటర్ వి.భాస్కరామ్, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. పలువురు సాహిత్యాభిమానులు హాజరయ్యారు.