ప్రపంచమంతటా నిండి ఉన్న జగన్మాత
Published Fri, Sep 16 2016 10:11 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
కాకినాడ కల్చరల్ :
జగన్మాత ప్రపంచమంతటా నిండి ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. సరస్వతీ గానసభ ఆధ్వర్యాన సూర్య కళామందిర్‌లో ‘దేవీభాగవతం’పై ఆయన ప్రవచనం చేశారు. చైతన్య స్వరూపిణిగా అమ్మను ఆరాధించడం ప్రతి వ్యక్తికీ ప్రథమ కర్తవ్యమని అన్నారు. ప్రవచనాలు మూడో రోజైన శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గానసభ ఉపా««దl్యక్షులు ఎల్.శేషుకుమారి, కార్యదర్శి ఎల్.రంగనాథరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement