‘ప్రకృతిలో ప్రతీది అమ్మ ప్రతి రూపమే’ | devivaibhavam | Sakshi
Sakshi News home page

‘ప్రకృతిలో ప్రతీది అమ్మ ప్రతి రూపమే’

Published Tue, Sep 20 2016 9:49 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

‘ప్రకృతిలో ప్రతీది అమ్మ ప్రతి రూపమే’

‘ప్రకృతిలో ప్రతీది అమ్మ ప్రతి రూపమే’

కాకినాడ కల్చరల్‌ :
ప్రకృతిలో ప్రతీది అమ్మ ప్రతి రూపమేనని, మంచి మనస్సుతో అమ్మను కొలిస్తే అనుగ్రహం లభిస్తుందని  ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సామవేదం çషణ్ముఖ శర్మ ప్రవచించారు. స్థానిక సూర్యకళామందర్‌లో సరస్వతీ గానసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీభాగవతం ప్రవచన కార్యక్రమాలు మంగళవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో దేవీ భాగవతంలోని ఎన్నో అంశాలను వాటి అంతరార్థాలను షణ్ముఖశర్మ శ్రోతలకు వివరించారు. 18 పురాణాల విశిష్టత, దుర్గాదేవి వైభవాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. భక్తి మార్గంలో నడుచుకోవాలని సూచించారు. కార్యక్రమానికి ముందు సామవేదం షణ్ముఖ శర్మ, పుష్పలత దంపతులను సరస్వతీ గానసభ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గానసభ ఉపా««దl్యక్షురాలు ఎల్‌.శేషుకుమారి, కార్యదర్శి శ్రీరంగనాథరావు, చైర్మన్‌ ఎల్‌.సత్యనారాయణ, సహాయ కార్యదర్శి కేవీఎస్‌ ఆంజనేయులు, సభ్యులు కేవీవీ శర్మ, ఆర్‌.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement