Sambhaji Bhide
-
‘బొట్టు లేదు.. నీతో మాట్లాడను’
ముంబై: మహారాష్ట్ర ఉద్యమకారుడు, రైట్ వింగ్ నేత శంబాజీ భిడే.. మరోసారి వార్తల్లోకెక్కారు. ఓ జర్నలిస్ట్ నుదుట బొట్టు లేని కారణంగా ఆమెతో మాట్లాడేందుకు నిరాకరించిన ఆయన.. ఆపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శంభాజీ భిడే బుధవారం సెక్రటేరియట్‌కు వెళ్లి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలిశారు. ఆపై బయటకు వచ్చిన భిడేను ఓ జర్నలిస్ట్ పలకరించే యత్నం చేశారు. అయితే ఆమె నుదుటపై బొట్టు లేని విషయం గమనించిన ఆయన మాట్లాడను అని తెగేసి చెప్పాడు. ‘‘నన్ను ప్రశ్నించే ముందు బిందీ (బొట్టు) ధరించాలని తెలియదా... నీతో మాట్లాడను. మహిళలు భారత మాతతో సమానం. భారత మాత ఏం విధవ కాదు. అందుకే భారత స్త్రీలు బిందీ లేకుండా విధవ రూపంలో కనిపించకూడద’’ని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సదరు జర్నలిస్ట్ రూపాలీ బీబీ ట్విటర్ వేదికగా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చఖ్నార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలపై వివరణనివ్వాలంటూ శంభాజీకి నోటీసులిచ్చారు. ఇంకోవైపు కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలకు చెందిన మహిళా నేతలు ఆ పెద్దాయన తీరుపై మండిపడుతున్నారు. శంభాజీ ఇలా వివాదంలో చిక్కుకోవడం మొదటిసారేం కాదు. 2018లో.. తన తోటలోని మామిడి పండ్లను తిన్న దంపతులకు మగపిల్లలు పుడతారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. आज माझ्यासोबत घडलेला हा सगळा प्रकार.. आपण एखाद्याचं वय बघून त्याला मान देतो मात्र, समोरची व्यक्ती देखील त्या पात्रतेची असावी लागते. मी टिकली लावावी-लावू नये किंवा कधी लावावी हा माझा अधिकार आहे. आपण लोकशाही असलेल्या देशात राहतोय. #democracy #freedom pic.twitter.com/wraTJf8mRn — Rupali B. B (@rupa358) November 2, 2022 साम टीव्हीच्या महिला पत्रकाराला तु टिकली लावली नाही म्हणून तुझ्याशी बोलणार नाही असे सांगत त्या महिलेचा आणि पत्रकारितेचाही अपमान करणार्या संभाजी भिडेंचा निषेध आहे. याआधी ही महिलांना हीन समजणारी, तुच्छतादर्शक वक्तव्य त्यांनी वारंवार केली आहेत त्यांची मनोवृत्ती यातून दिसून येते.1/2 pic.twitter.com/fVmxNdMivo — Rupali Chakankar (@ChakankarSpeaks) November 2, 2022 -
మహారాష్ట్రలో మారుతున్న సమీకరణాలు.. కూటమిగా శివసేన–సంభాజీ బ్రిగేడ్
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. రెండు పార్టీలు నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. స్ధానిక సంస్ధల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శివసేన, సంభాజీ బ్రిగేడ్ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయని శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇరు పార్టీల నేతలు వెల్లడించారు. సంభాజీ బ్రిగేడ్ పార్టీ అధ్యక్షుడు మనోజ్ ఆఖరే శుక్రవారం ఉదయం శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. సుమారు గంటకుపైగా ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత ఇరువురు కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ ఇక నుంచి రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయని, ప్రజాస్వామ్యాన్ని, బతికించేందుకు రెండు పార్టీలు ఒకటయ్యాయని అన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో సంభాజీ బ్రిగేడ్, శివసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యాన్ని, రీజినల్ పార్టీల అస్థిత్వాన్ని కాపాడేందుకే ఇరువురం ఒక్కటయ్యామని, ఇలాంటి పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీచేసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల శివసేన నుంచి తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏక్నాథ్ శిందేపై, బీజేపీ, ఆరెస్సెస్‌పై ఉద్ధవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో మాదిరిగా ఇరు పార్టీలు పనిచేయడం లేదని, ఇరు పార్టీల ఆలోచన విధానాలు వేరయ్యాయని ఆరోపించారు. ఆరెస్సెస్ రెండుగా చీలిపోయిందని, క్రమంగా బలహీన పడుతోందని ఆయన చురకలంటించారు. శిందే తిరుగుబాటు సంచలనం.. ఒకప్పుడు రాష్ట్రంలో పటిష్టమైన, తిరుగులేని పార్టీగా ఎదిగిన శివసేనను ఏక్నాథ్ శిందే రెండుగా చీల్చారు. దీంతో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. శివసేన నుంచి బయటపడిన శిందే బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. శిందే తిరుగుబాటు చేసిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామ చేయాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి శివసేన అస్ధిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: (గణేశ్ విగ్రహాల ధరలు పెరిగాయ్... ఎందుకంటే..) గత్యంతరం లేక శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి అలాగే కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీలు శివసేనతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో శివసేన ఏకాకిగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి సందర్భంలో శివసేనతో జతకట్టేందుకు సంభాజీ బ్రిగేడ్ పార్టీ ముందుకు రావడంతో పరోక్షంగా మరింత బలాన్ని చేకూర్చినట్లైంది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరాఠాలకు ఎన్నడూ న్యాయం జరగలేదని, స్వార్థం కోసం శివసేనను అంతర్గతంగా చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉద్ధవ్ ఆరోపించారు. ఇద్దరం కలిసి నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతామని ఆయన స్పష్టం చేశారు. మరాఠా సమాజంలో చీలికలు తెచ్చేవారిని భూస్ధాపితం చేద్దామని ఉద్ఘాటించారు. అయితే ఇరు పార్టీల మధ్య సమన్వయం చేకూర్చేందుకు ప్రత్యేకంగా ఒక సమన్వయ సమితి కూడా ఏర్పాటు చేయనున్నట్లు శివసేన సీనియర్ నేత సుభాష్ దేశాయ్ వెల్లడించారు. రెండు పార్టీల ఆలోచన విధానాలు, పనిచేసే పద్దతి ఒకే రకంగా ఉన్నాయని, అందుకే ఇరువురి చేతులు కలిశాయని దేశాయ్ వ్యాఖ్యానించారు. -
‘ఏకాదశి కాబట్టే అమెరికా సఫలం అయ్యింది’
న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆఖరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యావత్ దేశ ప్రజలు ఇస్రో శాస్త్రవేత్తలకు బాసటగా నిలిచారు. మీరు సాధించింది మామూలు విజయం కాదంటూ మద్దతు తెలిపారు. చంద్రయాన్-2 విఫలం కావడంతో మరోసారి అమెరికా మూన్ మిషన్ టాపిక్ తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ మాజీ కార్యకర్త, సంచలనాలకు మారు పేరైన శంభాజీ భిఢే, అమెరికా మూన్ మిషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకాదశి రోజున ప్రయోగం నిర్వహించారు కాబట్టి అమెరికా మూన్ మిషన్ సక్సెస్ అయ్యిందన్నారు. వివరాలు.. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న భిఢే మాట్లాడుతూ ‘అమెరికా 38 సార్లు మూన్ మిషన్ చేపట్టినా విజయవంతం కాలేదు. ఆ తరువాత అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు భారతీయ కాలమానాన్ని ఆశ్రయించారు. ఫలితంగా అమెరికా తన 39వ మూన్ మిషన్ ప్రయోగాన్ని ఏకాదశి తిథి రోజున నిర్వహించి విజయం సాధించింది’ అని అన్నారు. కాగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం భిడేకు కొత్త కాదు. గతంలో తన తోటలోని మామిడి పండ్లను తింటే మగపిల్లలు పుడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో ట్విస్ట్!
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా- కోరెగావ్ అల్లర్ల కేసు మరో మలుపు తిరిగింది. భీమా- కోరెగావ్ అల్లర్లు సహా ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర ఆరోపణలతో.. విరసం నేత వరవరరావు సహా మరో నలుగురు పౌర హక్కుల నేతలను పుణె పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం వారందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ కేసుకు సంబంధించిన విచారణను అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబరు 6కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో భీమా- కోరెగావ్ హింసాకాండపై మహారాష్ట్ర ప్రభుత్వం రహస్య నివేదికను తెరపైకి తెచ్చింది. పది మంది సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ రూపొందించిన రహస్య నివేదిక జనవరి 20నే ప్రభుత్వానికి అందజేసింది. వారిద్దరే ప్రణాళికలు రచించారు.. భీమా- కోరెగావ్ హింసాకాండకు హిందుత్వ సంస్థలకు చెందిన నేతలే కారణమని రహస్య నివేదిక వెల్లడించింది. వివాదాస్పద హిందుత్వ నేత శంభాజీ బిడే, మిలింద్ ఎక్బోటేలు కలిసి అల్లర్లకు ప్రణాళికలు రచించారని పేర్కొంది. ఈ మేరకు జనవరి 20న షోలాపూర్ రేంజ్ ఐజీ విశ్వాస్నాంగ్రే పాటిల్‌కు నిజనిర్ధారణ కమిటీ నివేదిక సమర్పించింది. అయితే ఇన్నాళ్లుగా ఈ కేసులో ఎటువంటి పురోగతి సాధించని మహారాష్ట్ర ప్రభుత్వం.. పౌర హక్కుల నేతల అరెస్టు తర్వాత నివేదికను తెరపైకి తీసుకురావడం.. మరోవైపు దీనికి అంతటికీ మావోయిస్టులే కారణం అంటూ మహారాష్ట్ర పోలీసులు ఆరోపణలకు దిగడంతో.. ఈ కేసులో గందరగోళం నెలకొంది. కాగా గతేడాది డిసెంబర్ 31న పుణెకి సమీపంలోని భీమా కోరెగావ్ గ్రామంలో దళితులు, ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా పుణె పోలీసులు మంగళవారం ఉదయం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో విరసం నేత వరవరరావు, ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, ఫరీదాబాద్‌లో ట్రేడ్ యూనియన్ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్, ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: భీమా కోరేగావ్ సంఘటనకు బాధ్యలెవరు?)