Sameer Rizvi
-
వైభవ్, ఆయూశ్ కాదు.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్!
ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం సమీర్ రిజ్వీ తన మెరుపు బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్ విఫలమవుతున్న చోట రిజ్వీ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ యూపీ ఆటగాడు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఒంటి చేత్తో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించాడు.లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ 6 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో రిజ్వీ(70 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అదే పరిస్థితి. 163 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ 8 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మళ్లీ రిజ్వీనే తన సంచలన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. కేవలం 51 బంతుల్లోనే 90 పరుగులు చేసి ఢిల్లీకి రెండో విజయాన్ని అందించాడు. ఐపీఎల్ చరిత్రలో 'ఇంపాక్ట్ ప్లేయర్'గా వచ్చి అత్యధిక స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా రిజ్వీ రికార్డులెక్కాడు. రిజ్వీ ప్రస్తుతం 160 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీ ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా రిజ్వీకే ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కడం గమనార్హం.భారత జట్టులోకి ఎంట్రీ?మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్న సమీర్ రిజ్వీని భారత జట్టుకు ఎంపిక చేయాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ప్రస్తుత భారత టీ20 జట్టులో టాపార్డర్ పటిష్టంగా కన్పిస్తున్నప్పటికి మిడిలార్డర్ కొంచెం వీక్‌గానే ఉంది. దీంతో రిజ్వీ లాంటి ధీటైన బ్యాటర్ జట్టులోకి వస్తే భారత మిడిలార్డర్ మరింత పటిష్టంగా మారనుంది.అయితే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ రిజ్వీ ప్రదర్శలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత జట్టు ఈ ఏడాది జూన్‌లో భారత్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌కు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.దీంతో భారత జట్టులో రిజ్వీకి చోటు దక్కే ఛాన్స్ ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గత కొంత కాలంగా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దమ్ములేపుతున్న వైభవ్ సూర్యవంశీని కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ యువ సంచలనం ఇటీవల తన 15వ ఏట అడుగుపెట్టడంతో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి అర్హత సాధించాడు. అతడితో పాటు భారత అండర్-19 కెప్టెన్ అయూశ్ మాత్రే కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ ఏడాది జూన్‌లో భారత అండర్-19 జట్టు రెడ్ బాల్ సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఒకవేళ ఈ టూర్‌కు మాత్రే, వైభవ్ ఎంపిక అయితే సీనియర్ జట్టులో వచ్చేందుకు వేచి ఉండక తప్పదు. అంతేకాకుండా భారత సీనియర్ జట్టులో ఇప్పటికే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో ముగ్గురు ఓపెనర్లుగా ఉన్నారు. వీరి ముగ్గరు కూడా ఓపెనర్లగా విజయవంతమయ్యారు. వీరి గైర్హజారీలో వైభవ్‌కు భారత జట్టులో చోటు దక్కే అవకాశముంది. ఏదేమైనప్పటికి సమీర్ రిజ్వీ అంతర్జాతీయ అరంగేట్రం మాత్రం ఖాయమైనట్లు తెలుస్తోంది.చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్! -
అతడిని వదిలి సీఎస్కే తప్పు చేసిందా?
ఐపీఎల్ 2026 సీజన్లో సమీర్ రిజ్వీ సంచలన ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించడమే గాక రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌ను లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో రిజ్వీ (47 బంతుల్లోనే 70 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి లక్నో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. తాజాగా శనివారం ముంబై ఇండియన్స్‌పై అదే తరహాలో రెచ్చిపోయాడు. ఈసారి కాస్త డోసు పెంచిన సమీర్ రిజ్వీ (Sameer Rizvi) 51 బంతుల్లోనే 90 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ హీరోగా నిలిచాడు. నిజానికి సమీర్ రిజ్వీ క్రీజులోకి వచ్చే సమయానికి ఢిల్లీ 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఈ సమయంలో క్రీజులో అడుగుపెట్టిన రిజ్వీ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. రెండు మ్యాచ్‌లు కలిపి 160 పరుగులు చేసిన సమీర్ రిజ్వీ ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా 2024 ఐపీఎల్ సీజన్‌కు ముందు సమీర్ రిజ్వీని చెన్నై సూపర్‌కింగ్స్ రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్లో రిజ్వీకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. అయితే 2025 సీజన్‌కు ముందు రిజ్వీని విడుదల చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ రిజ్వీని కేవలం రూ. 95 లక్షలకే దక్కించుకుంది. కానీ ఇప్పుడు రిజ్వీ మాత్రం తక్కువ ధరకే ఎక్కువ లాభాలు చూపిస్తున్నాడు. దీంతో సీఎస్కే అభిమానులు ఆ జట్టు యాజమాన్యాన్ని ట్రోల్స్‌తో ముంచెత్తారు. ‘చెన్నై జట్టులో ఉన్నప్పుడు అవకాశాలు ఇవ్వలేదు.. ఇప్పుడేమో ఢిల్లీ తరఫున విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ అవార్డులు కొల్లగొడుతున్నాడు’.. ‘సమీర్ రిజ్వీని వదిలేసి సీఎస్కే దిద్దుకోలేని తప్పు చేసింది’ అని కామెంట్లు పెట్టారు. ఇక లక్నోతో జరిగిన మ్యాచ్ లోనూ 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను సమీర్ రిజ్వీ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గెలిపించడం విశేషం.Sameer Rizvi's last 3 knocks for Delhi Capitals:vs PBKS - 58(25)vs LSG - 70(47)vs MI - 90(51)& u know what? CSK let him go to DC for just 95 lakhs when he showed glimpses of his unlimited potential in very 1st game. CSK is worse team for youngsters!pic.twitter.com/zmDEOe9SMB— Rajiv (@Rajiv1841) April 4, 2026🚨 BIG BLUNDER FROM CSK> CSK bought Sameer Rizvi in 2024 for 8.40 CR> Played him mostly at No.6> Didn't give him chances> Released him in 2025> Delhi Capitals bought him for just ₹95 lakh> Backed him at No. 4 and now he’s winning matches for thempic.twitter.com/bjZBi0KipG— Tejash (@Tejashyyyyy) April 4, 2026చదవండి: కార్ల్సన్ వింత ప్రవర్తన.. తోటి ప్లేయర్‌కు అవమానం! -
'సూపర్' సమీర్
గత మ్యాచ్‌లో లక్నోపై తన మెరుపు బ్యాటింగ్ ట్రైలర్‌తో సరిపెట్టిన సమీర్ రిజ్వీ... ఈ సారి ముంబై బౌలర్లకు సినిమా చూపించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన రిజ్వీ... కుదురుకున్నాక మైదానం నలువైపులా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. బంతి ఎక్కడ పడ్డా దాని గమ్యస్థానం బౌండరీనే అన్నట్లు చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం చేరింది. బ్యాటింగ్‌లో ముంబై ఇండియన్స్ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోగా...ఆపై సమీర్ ధాటికి బౌలర్లు నిలువలేకపోవడంతో పరాజయం మూటగట్టుకుంది.న్యూఢిల్లీ: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... ఐపీఎల్ 19వ సీజన్లో వరుసగా రెండో విజయం తమ ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్‌లో లక్నోను చిత్తుచేసిన అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్... శనివారం ‘డబుల్ హెడర్’లో భాగంగా జరిగిన మొదటి పోరులో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించింది. 13 ఏళ్ల తర్వాత విజయంతో సీజన్‌ను ఆరంభించిన ముంబై తమ రెండో మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో కనీస ప్రదర్శన కనబర్చలేక వెనుకబడి పోయింది. ఏకపక్షంగా సాగిన పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా అనారోగ్యంతో మ్యాచ్‌కు దూరం కావడంతో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సాధించగా...రోహిత్ శర్మ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సమీర్ రిజ్వీ (51 బంతుల్లో 90; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒంటి చేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి పతుమ్ నిసాంక (30 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) సహకరించాడు. 2025 సీజన్ ఢిల్లీ ఆఖరి మ్యాచ్‌నుంచి చూస్తే రిజ్వీ వరుసగా మూడో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకోవడం విశేషం. నాలుగే సిక్స్‌లు... గత మ్యాచ్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మైదానంలో అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్‌కు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో చెలరేగారు. ముకేశ్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (9), హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (0) పెవిలియన్ బాటపట్టారు. దీంతో ముంబై 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్‌తో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ఇద్దరు విధ్వంసకర వీరులు క్రీజులో ఉన్నా... ఆశించినంత వేగంగా ఆడలేకపోయారు. మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించిన అనంతరం రోహిత్ వెనుదిరగగా... షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (5) విఫలమయ్యాడు. ఆఖర్లో నమన్ ధీర్ (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), సాంట్నర్ (18 నాటౌట్; 2 ఫోర్లు) కాస్త పోరాడటంతో ముంబై ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్ మొత్తంలో నాలుగు సిక్స్‌లు మాత్రమే నమోదయ్యాయి. పవర్‌ప్లేలో ఒక్క సిక్స్ కూడా లేకుండా ముంబై ముగించడం 2023 తర్వాత ఇదే తొలిసారి. హార్దిక్ స్థానంలో సూర్యకుమార్... గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సూర్యకుమార్ యాదవ్... ఈ పోరులో ముంబై జట్టుకు సారథిగా వ్యవహరించాడు. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అస్వస్థతకు గురవడంతో... అతడి స్థానంలో జట్టు పగ్గాలు అందుకున్నాడు. బ్యాటింగ్‌లో హాఫ్‌సెంచరీ చేసిన సూర్య... జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.సమీర్ సెంచరీ మిస్... గత మ్యాచ్‌లో లక్నో బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న సమీర్ రిజ్వీ... ముంబైపై అదే దూకుడు కొనసాగించాడు. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (1) మరోసారి విఫలం కాగా... నితీశ్ రాణా (0) డకౌటయ్యాడు. దీంతో ఢిల్లీ జట్టు 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించగా... ‘ఇంపాక్ట్ ప్లేయర్’ సమీర్ రిజ్వీతో కలిసి నిసాంక పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. ఆరంభంలో నిసాంక వేగంగా ఆడగా... అతడికి రిజ్వీ అండగా నిలిచాడు. సాంట్నర్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన నిసాంక... శార్దుల్ ఠాకూర్ ఓవర్లో 6, 4, 4తో చెలరేగాడు. మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం నిసాంక అవుట్ కాగా... అక్కడి నుంచి రిజ్వీ దంచుడు ప్రారంభమైంది. అప్పటి వరకు 23 బంతుల్లో 25 పరుగులే చేసిన రిజ్వీ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బాష్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో 4, 4, 6, 6తో 20 పరుగులు రాబట్టిన సమీర్... మయాంక్ మార్కండేకు రెండు సిక్స్‌లు రుచి చూపించాడు. ఈక్రమంలో 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న రిజ్వీ... దీపక్ చాహర్ ఓవర్లో 4, 6... శార్దుల్ ఓవర్లో 4, 4, 6తో సెంచరీకి సమీపించాడు. అయితే మరో భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో బాష్ బౌలింగ్‌లో అతడు వెనుదిరగగా... మిల్లర్ (21 నాటౌట్; 4 ఫోర్లు), స్టబ్స్ (3 నాటౌట్) మిగిలిన పనిపూర్తి చేశారు. 17 ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సాధించిన విజయాలు. ముంబైపై అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ (18) అగ్రస్థానంలో ఉంది.స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) అక్షర్ (బి) ముకేశ్ 9; రోహిత్ (సి) నితీశ్ రాణా (బి) అక్షర్ 35; తిలక్ (సి అండ్ బి) ముకేశ్ 0; సూర్యకుమార్ (ఎల్బీ) ఎన్గిడి 51; రూథర్‌ఫోర్డ్ (సి) ముకేశ్ (బి) విప్రాజ్ 5; నమన్ (సి) స్టబ్స్ (బి) నటరాజన్ 28; సాంట్నర్ (నాటౌట్) 18; బాష్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–18, 2–18, 3–71, 4–85, 5–122, 6–146. బౌలింగ్: ముకేశ్ 3–0–26–2; ఎన్గిడి 4–0–34–1; అక్షర్ 4–0–22–1; విప్రాజ్ 3–0–24–1; కుల్దీప్ 3–0–31–0; నటరాజన్ 3–0–24–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) రికెల్టన్ (బి) దీపక్ 1; నిసాంక (సి) మార్కండే (బి) సాంట్నర్ 44; నితీశ్ రాణా (రనౌట్) 0; సమీర్ రిజ్వీ (సి) తిలక్ (బి) బాష్ 90; మిల్లర్ (నాటౌట్) 21; స్టబ్స్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–2, 2–7, 3–73, 4–151. బౌలింగ్: దీపక్ చాహర్ 3–0–20–1; బుమ్రా 4–0–21–0; సాంట్నర్ 3–0–22–1; శార్దుల్ 3–0–41–0; మార్కండే 2–0–20–0; కార్బిన్ బాష్ 3.1–0–39–1. -
సమీర్ రిజ్వీ సంచలనం.. ముంబైకి షాకిచ్చిన ఢిల్లీ
ఐపీఎల్-2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గ్రాండ్ విక్టరీ సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో చేధించింది.ఢిల్లీ యువ సంచలనం సమీర్ రిజ్వీ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రిజ్వీ.. ముంబై బౌలర్లను ఉతికారేశాడు. ఓ దశలో తొలి ఐపీఎల్ సెంచరీ చేసేలా కన్పించిన రిజ్వీ.. ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. మొత్తంగా 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేసి రిజ్వీ ఔటయ్యాడు. అతడితో పాటు పాటు ఫాథుమ్ నిస్సాంక 44 పరుగులతో రాణించాడు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, శాంట్నర్, బాష్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ(35), నమన్ధీర్(28) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఎంగిడి, అక్షర్ పటేల్, నిగమ్, నటరాజన్ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. సమీర్ రిజ్వీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: IPL 2026: అర్జున్ సంచలన బౌలింగ్.. స్టంప్స్ ఎగిరిపోయాయి! వీడియో


