సామిల్లో అగ్నిప్రమాదం
కీసర: షార్ట్‌సర్క్యూట్‌తో సా మిల్లో మంటలు చెలరేగాయి. రూ. 8 లక్షల విలువైన ఆస్తినష్టం జరిగింది. ఈ సంఘటన మండల పరిధిలోని యాద్గార్పల్లి చౌరస్తా సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాద్గార్పల్లి గ్రామ చౌరస్తా సమీపంలో ముప్పై ఏళ్లుగా జైభారత్ సామిల్ కొనసాగుతోంది. ఈ కంపెనీలో ఇళ్లకు ఉపయోగించే తలుపులు తయారుచేస్తుంటారు.
మంగళవారం రాత్రి వరకు పనిచేసిన కార్మికులు క ంపెనీ సమీపంలోని క్వార్టర్స్‌లో నిద్రించా రు. బుధవారం తెల్లవారుజామున తలుపులు తయా రు చేసే సెక్షన్లో ప్రమాదవశాత్తు షార్ట్‌సర్క్యూట్ ఏర్పడింది. దీంతో మంటలు చెలరేగాయి. ఎండిన కలప పెద్దమొత్తంలో ఉండడంతో మంటలు క్షణాల్లో భారీగా వ్యాపించాయి. క్వార్టర్స్‌లో నిద్రిస్తున్న కార్మికులు విషయం గుర్తించి కంపెనీ యజమాని శ్రీకాంత్‌చారితో పాటు కీసర పోలీసులకు సమాచారం ఇచ్చా రు. సీఐ గురువారెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మౌలాలి, చర్లపల్లి నుచి రెండు ఫైరిం జన్లను రప్పించారు. దీంతోపాటు స్థానికంగా ఉన్న 15 వాటర్ ట్యాంకర్లను సైతం తెప్పించారు. అతికష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రూ. 8 లక్షలు విలువచేసే కట్టెలు,యంత్రాలు కాలిపోయాయని కంపెనీ యజమాని తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి పేర్కొన్నారు. కాగా, ఇటీవల కీసర మండల పరిధిలో పలు అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అధికారులు స్పందించి మండల కేంద్రంలో ఫైరింజన్ ఏర్పాటు చేయాలని స్థానికులు తెలిపారు.