శాంసంగ్ కొత్త గెలాక్సీ, ప్రత్యేకతలు అవే!
దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన పాపులర్ 'జే' సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జే7ప్లస్‌ను ఆవిష్కరించింది. థాయ్‌లాండ్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. అధికారిక వెబ్సైట్లో దీని ధర 12,900 థాయ్ బట్(థాయ్‌లాండ్ కరెన్సీ) అంటే మన దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.24,800. సెప్టెంబర్ 15 నుంచి ఇది మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీఆర్డర్లను శాంసంగ్ ప్రారంభించింది. తన వెబ్సైట్లో ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు.
ఈ డివైజ్‌తో పాటు యూ ఫ్లెక్స్ వైర్లెస్ ఈయర్‌ఫోన్స్ ఉచితంగా కంపెనీ అందించనుంది. అయితే ఈ డీల్ సెప్టెంబర్ 17 వరకు మాత్రమే. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ వెనుకవైపు రెండు కెమెరాలు. అంతేకాక ఒకేసమయంలో రెండు వాట్సాప్ అకౌంట్లను వాడుకునే సామర్థ్యం. ఆపిల్ సిరి, గూగుల్ అసిస్టెంట్లకు పోటీగా ఉండే తీసుకొచ్చిన శాంసంగ్ డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ బిక్స్బీ సపోర్టు కూడా దీనికి ప్రత్యేకతగా నిలుస్తుంది. ఇప్పటికే బక్స్బీని శాంసంగ్ భారత్ మినహా 200 పైగా దేశాల్లో లాంచ్ చేసింది.
శాంసంగ్ జే7 ప్లస్ ఫీచర్లు
5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ స్క్రీన్
2.4గిగాహెడ్జ్ హిలియో పీ20 ఆక్టాకోర్ ప్రాసెసర్
4జీబీ ర్యామ్
32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
256జీబీ వరకు విస్తరణ మెమరీ
13 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్‌తో రెండు వెనుక కెమెరాలు
16 మెగాపిక్సెల్‌తో ఫ్రంట్ కెమెరా
3000ఎంఏహెచ్ బ్యాటరీ