Samsung Galaxy S5
-
విమానం నుంచి జారిపడ్డ ఫోన్: వైరల్ వీడియో
నాష్విల్లే: చేతిలో నుంచి జారిపడితేనే పగిలిపోయే మొబైల్ ఫోన్.. వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డా కనీసం చిన్న గీత కూడా పడలేదు. పైగా ఆ వీడియో వైరల్ అయింది. అమెరికాలోని టెన్నెస్సీకి చెందిన బ్లేక్ హెండర్సన్ మొన్న ఆదివారం ఓ చిన్నతరహా విమానంలో ప్రయాణిస్తుండగా... అతి సమీపం నుంచి వేరొక విమానం దూసుకురావడాన్ని గమనించాడు. వెంటనే తన శాంసంగ్ గెలాక్సీ ఎస్5 మొబైల్ ఫోన్ తీసి దృశ్యాలను చిత్రీకరించడం మొదలుపెట్టాడు. అనూహ్యంగా మొబైల్‌ఫోన్ చేతి నుంచి జారిపోయింది! వేల అడుగుల ఎత్తు నుంచి కిందికి పడుతూ అది దృశ్యాలను రికార్డు చేయడం, చివరికి ఒక ఇంట్లోని పెరట్లో సురక్షితంగా ల్యాండ్ కావడం, ఆకాశం నుంచి ఊడిపడ్డ ఫోన్‌ను చూసి ఆ ఇంటివాళ్లు ఆశ్చర్యపోవడం.. అంతా సెకన్లలో జరిగిపోయింది. టెలికాం కంపెనీ సహాయంతో జీపీఎస్ ద్వారా హెండర్సన్ పోగొట్టుకున్న మొబైల్‌ను తిరిగి పొందాడు. అంత ఎత్తునుంచి పడినా ఫోన్‌కు చిన్న గీత కూడా పడకపోవడం విచిత్రం. హెండర్సన్ బంధువొకరు.. ఫోన్లో రికార్డయిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అయింది. -
శామ్సంగ్ గెలాక్సీ ఎస్5 విక్రయాలు షురూ
న్యూఢిల్లీ/సియోల్: శామ్సంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ ఎస్5 స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌ను భారత్‌లో రూ.51,500 ధరకు విక్రయిస్తున్నామని శామ్సంగ్ ఇండియా కంట్రీహెడ్(ఐటీ అండ్ మొబైల్ డివిజన్) వినీత్ తనేజా చెప్పారు. ఈ ఫోన్‌ను ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో శామ్సంగ్ ఆవిష్కరించింది. గత నెల 29న ప్రి బుకింగ్స్ ప్రారంభించింది. గెలాక్సీ ఎస్4 కంటే గెలాక్సీ ఎస్5కు మూడు రెట్లు ఎక్కువగా ప్రిబుకింగ్స్ వచ్చాయని వినీత్ తనేజా చెప్పారు. భారత్‌లో ఇప్పటిదాకా గెలాక్సీ స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్లను 3.5 కోట్లు విక్రయించామని ఆయన పేర్కొన్నారు. గెలాక్సీ ఎస్5లో 5.1 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2.1 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. యాపిల్ ఐఫోన్ 5ఎస్‌లో ఉన్నట్లుగానే గెలాక్సీ ఎస్5లో ఫింగర్ స్కానర్ ఫీచర్ ఉందని, ఇంకా పర్సనల్ ఫిట్నెస్ ట్రాకర్, ఎస్ హెల్త్ వంటి ఫీచర్ కూడా ఉందని వివరించారు. 30 శాతం శామ్సంగ్ ఫోన్లే: వరుసగా రెండో క్వార్టర్లో కూడా లాభాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ ఫోన్‌ను శామ్సంగ్ కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ విక్రయాలతో మళ్లీ తాము లాభాల బాట పడతామని కంపెనీ ఆశిస్తోంది. ఈ ఫోన్‌పై సమీక్షలు బాగానే వచ్చినప్పటికీ, ఇంతకు ముందటి గెలాక్సీ ఫోన్‌కు, పోటీ కంపెనీల హై ఎండ్ స్మార్ట్ఫోన్లకు భిన్నంగా చెప్పుకోదగ్గ తేడాలు పెద్దగా ఏమీ లేవని పలువురు పెదవి విరుస్తున్నారు. కాగా కంపెనీ ఇటీవలి రికార్డ్ స్థాయి లాభాలకు శామ్సంగ్ మొబైల్ విభాగమే ప్రధాన కారణం. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన మొబైల్ ఫోన్లలో 30 శాతం శామ్సంగ్ కంపెనీవే. -
లాట్ మొబైల్స్‌లో ఎస్5 ప్రీ బుకింగ్ ఆఫర్
హైదరాబాద్: లాట్ మొబైల్స్‌లో లేటెస్ట్ శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5 ప్రీ బుకింగ్ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం ఆకర్షణీయమైన ఆఫర్లతో కేవలం రూ.500కే ఎస్5ను బుక్‌చేసుకునే సదుపాయాన్ని లాట్ మొబైల్స్ కల్పిస్తోంది. క్రెడిట్, డెబిట్ కార్డులతో కూడా ఎస్5ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బుక్ చేసుకునేవారికి 15% క్యాష్ బ్యాక్, ఇతర క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై బుక్ చేసుకునేవారికి 10% క్యాష్ బ్యాక్ ఆఫర్లను లాట్ మొబైల్స్ అందజేస్తోంది. వీటితోపాటు లాట్ మొబైల్స్‌లో ఎస్5 కొన్నవారికి 1 సంవత్సరం అదనపు వారంటీతో కలిపి మొత్తం రెండేళ్ల ఉచిత వారంటీ అందుబాటులో ఉంటుంది. -
శామ్సంగ్ గెలాక్సీ ఎస్5 విక్రయాలు
న్యూఢిల్లీ: శామ్సంగ్ కంపెనీ గెలాక్సీ మోడల్లో ఐదవ జనరేషన్ హ్యాండ్సెట్, గెలాక్సీ ఎస్5ను గురువారం భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. వచ్చే నెల 11 నుంచి ఈ ఫోన్ల విక్రయాలను ప్రారంభిస్తామని శామ్సంగ్ ఇండియా కంట్రీ హెడ్ (ఐటీ అండ్ మొబైల్ డివిజన్) వినీత్ తనేజా చెప్పారు. ఏప్రిల్ 11నే ధరను నిర్ణయిస్తామని, రూ.51,000-రూ.53,000 రేంజ్లో ఉండొచ్చని కంపెనీ పేర్కొన్నారు. ముందస్తు బుకింగ్స్ రేపటి (శనివారం)నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. గెలాక్సీ ఎస్5తో పాటు మరో 3 వేరబుల్ (ధరించే)డివైస్‌లను కూడా కంపెనీ ఆవిష్కరించింది. గేర్ 2(రూ.21,900); గేర్ ఫిట్, గేర్ 2 నియో(ఒక్కో దాని ధర రూ.15,000) మూడున్నర కోట్ల గెలాక్సీ డివైస్‌లు ఇప్పటిదాకా భారత్‌లో మూడున్నర కోట్ల గెలాక్సీ డివైస్‌లను(స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లతో కలుపుకొని) విక్రయించామని తనేజా చెప్పారు. మంచి నాణ్యతగల ఉత్పత్తులకు ఎక్కువ డబ్బు చెల్లించడానికి వినియోగదారులు వెనకాడడం లేదని పేర్కొన్నారు. గెలాక్సీ నోట్ 3ను మార్కెట్లోకి తెచ్చినప్పుడే ఈ విషయం స్పష్టమైందని వివ రించారు. ఈ డివైస్ల కొనుగోళ్ల కోసం బైబ్యాక్, ఈఎంఐ ఆఫర్లనందిస్తున్నామని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్‌ను తొలిసారిగా ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో శామ్సంగ్ ఆవిష్కరించింది. ఎస్5 ప్రత్యేకతలు... గెలాక్సీ ఎస్4లో ఉన్నట్లే ఎస్5 ఫోన్లో 5.1 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే(వాటర్ ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్ కూడా), ఆక్టా-కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2.1 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని తనేజా వివరించారు. బ్యాటరీ 21 గంటల టాక్‌టైమ్‌ని ఇస్తుందన్నారు. యాపిల్ ఐ ఫోన్ 5ఎస్‌లో ఉన్న ఫింగర్ స్కానర్ ఫీచర్ ఈ గెలాక్సీ ఎస్5లో ఉందని చెప్పారు. ఇది భద్రమైన బయోమెట్రిక్ స్క్రీన్-లాకింగ్ ఫీచర్ అని, సురక్షితంగా మొబైల్ చెల్లింపులు జరపవచ్చని తనేజా వివరించారు. ఇక పర్సనల్ ఫిట్నెస్ను ట్రాక్ చేసే ఎస్ హెల్త్, తదితర ప్రత్యేకతలున్నాయని, 4 రంగుల్లో లభ్యమవుతుందని పేర్కొన్నారు. 4జీ నెట్వర్క్ కోసం ఎదురుచూస్తున్నామని, త్వరలో 4జీ హ్యాండ్సెట్లను అందిస్తామన్నారు.