Samsung Medical Center
-
కొరియాలో 166కి పెరిగిన మెర్స్ కేసులు
సియోల్ : దక్షిణ కొరియాలో మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) మరింత విజృంభించింది. శుక్రవారం మరో నాలుగురు మెర్స్ బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 166కు పెరిగిందని దేశ ఆరోగ్య మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ వైరస్ సోకి ఒకరు మరణించారని పేర్కొంది. వైరస్ సోకిన 75 ఏళ్ల వృద్ధుడు శామ్సంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపింది. దేశంలో బుధవారం ఎనిమిది... గురువారం మూడు మెర్స్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. -
కొరియాలో మరో ఎనిమిది మెర్స్ కేసులు నమోదు
సియోల్: దక్షిణ కొరియాలో మరో ఎనిమిది మంది మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 162కు చేరిందని ఆ దేశ వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. ఈ వైరస్ బారిన పడిన ఐదుగురు ప్రస్తుతం సియోల్‌లోని శామ్సంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపింది. అలాగే ఈ ఆసుపత్రిలోని ఓ వైద్యుడికి ఈ వైరస్ ఇటీవలే సోకినట్లు గుర్తించామని చెప్పింది. ఈ వైరస్ సోకిన మరో ముగ్గురు హల్యమ్ యూనివర్శిటీ ఆసుపత్రితోపాటు గ్యాంగ్గాండ్ క్యూంగ్జీ యూనివర్శిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ఈ వైరస్ సోకి ఇప్పటి వరకు 19 మంది మరణించారని... అలాగే 124 మంది వైద్య చికిత్స పొందుతున్నారని... వారిలో 18 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది. అయితే మెర్స్ వైరస్ సోకిన ఇద్దరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు దక్షిణ కొరియా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ దక్షిణ కొరియాను వణికిస్తోంది. ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో దాదాపు దేశవ్యాప్తంగా 700 స్కూళ్లను మూసివేసిన సంగతి తెలిసిందే.