
కొరియాలో 166కి పెరిగిన మెర్స్ కేసులు
సియోల్ : దక్షిణ కొరియాలో మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) మరింత విజృంభించింది. శుక్రవారం మరో నాలుగురు మెర్స్ బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 166కు పెరిగిందని దేశ ఆరోగ్య మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ వైరస్ సోకి ఒకరు మరణించారని పేర్కొంది. వైరస్ సోకిన 75 ఏళ్ల వృద్ధుడు శామ్సంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపింది. దేశంలో బుధవారం ఎనిమిది... గురువారం మూడు మెర్స్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.