
దక్షిణ కొరియాను వణికిస్తున్న ‘మెర్స్’
సియోల్: ‘మెర్స్’ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ దక్షిణ కొరియాను వణికిస్తోంది. ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో 700 స్కూళ్లను మూసివేశారు. ఈ మేరకు అధికార యంత్రాంగం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. స్థానికులు వీలైనంత వరకూ ఇళ్లల్లోనే గడపాలనీ, ఒక వేళ బహిరంగ ప్రదేశాలకు వస్తే మాస్క్‌లు ధరించాలని అధికారులు సూచించారు. ముప్ఫై అయిదు మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు.
ఇద్దరు మరణించారని అక్కడి ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఓ 68 ఏళ్ల వ్యక్తి సౌదీ అరేబియాలో పర్యటించి వచ్చిన తర్వాత అతను వైరస్ బారిన పడ్డాడని అతని వల్ల ఇతరులకు ‘మెర్స్’ వేగంగా వ్యాపిస్తోందని తెలుస్తోంది. ఈ వైరస్ తొలుత సౌదీ అరేబియాలో 2012లో వెలుగుచూసింది.