Middle East Respiratory Syndrome virus
-
కొరియాలో 166కి పెరిగిన మెర్స్ కేసులు
సియోల్ : దక్షిణ కొరియాలో మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) మరింత విజృంభించింది. శుక్రవారం మరో నాలుగురు మెర్స్ బారిన పడ్డారు. దీంతో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 166కు పెరిగిందని దేశ ఆరోగ్య మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ వైరస్ సోకి ఒకరు మరణించారని పేర్కొంది. వైరస్ సోకిన 75 ఏళ్ల వృద్ధుడు శామ్సంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపింది. దేశంలో బుధవారం ఎనిమిది... గురువారం మూడు మెర్స్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. -
దక్షిణ కొరియాలో మెర్స్ మరింత తీవ్రతరం
సియోల్: దక్షిణ కొరియాలో ప్రాణాంతక మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ మరింత తీవ్రతరమైంది. శనివారం నాటికి మరో 12 మెర్స్ కేసుల నమోదు కావడంతో దేశంలోని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో మెర్స్ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 138కు చేరినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వీరిలో ఇప్పటివరకూ 14 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. తాజా మృతుల్లో 67 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి నుంచి మరో నలుగురికి మెర్స్ వైరస్ సంక్రమించినట్లు పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న మెర్స్ ను నిరోధించే క్రమంలో అధికారులు దేశంలోని స్కూళ్లను మూసివేశారు. స్థానికులు వీలైనంత వరకూ ఇళ్లల్లోనే గడపాలని, ఒక వేళ బహిరంగ ప్రదేశాలకు వస్తే మాస్క్లు ధరించాలని సూచించారు. ఈ వైరస్ తొలుత సౌదీ అరేబియాలో 2012లో వెలుగుచూసింది. కాగా, గడిచిన మంగళవారం నుంచి ఈ వైరస్ శరవేగంగా విస్తరించడానికి కారణాలు తెలుసుకునే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) బృందం పరిశోధనలు చేస్తోంది. అయితే కొన్ని వారాల తరువాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని డబ్యూహెచ్ఓ టీమ్ తెలిపింది. -
మెర్స్ దాడితో కొరియా విలవిల
సియోల్: దక్షిణ కొరియాను వణికిస్తున్న మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) మరింత విజృంభిస్తోంది. ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. గతంలో 35 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించగా ఆ సంఖ్య ఇప్పటికి 95కు చేరింది. వీరిలో ఏడుగురు మరణించారు. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు లోనవుతున్నారు. వేగంగా విస్తరిస్తున్న మెర్స్ ను నిరోధించే క్రమంలో అధికారులు 700 స్కూళ్లను మూసివేశారు.స్థానికులు వీలైనంత వరకూ ఇళ్లల్లోనే గడపాలని, ఒక వేళ బహిరంగ ప్రదేశాలకు వస్తే మాస్క్లు ధరించాలని సూచించారు. ఓ 68 ఏళ్ల వ్యక్తి సౌదీ అరేబియాలో పర్యటించి వచ్చిన తర్వాత అతను వైరస్ బారిన పడ్డాడని అతని వల్ల ఇతరులకు ‘మెర్స్’ వేగంగా వ్యాపిస్తోందని తెలుస్తోంది. ఈ వైరస్ తొలుత సౌదీ అరేబియాలో 2012లో వెలుగుచూసింది. కాగా, గడిచిన మంగళవారం నుంచి ఈ వైరస్ శరవేగంగా విస్తరించడానికి కారణాలు తెలుసుకునే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) బృందం, దక్షిణ కొరియా అధికారులు కలిసి సంయుక్తంగా ఈ ప్రాంతంలో పరిశోధనలు చేయనున్నారు. ఈ పరిశోధన వివరాలను శనివారం నాడు వెల్లడిస్తారు. -
దక్షిణ కొరియాను వణికిస్తున్న ‘మెర్స్’
సియోల్: ‘మెర్స్’ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ దక్షిణ కొరియాను వణికిస్తోంది. ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో 700 స్కూళ్లను మూసివేశారు. ఈ మేరకు అధికార యంత్రాంగం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. స్థానికులు వీలైనంత వరకూ ఇళ్లల్లోనే గడపాలనీ, ఒక వేళ బహిరంగ ప్రదేశాలకు వస్తే మాస్క్లు ధరించాలని అధికారులు సూచించారు. ముప్ఫై అయిదు మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇద్దరు మరణించారని అక్కడి ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఓ 68 ఏళ్ల వ్యక్తి సౌదీ అరేబియాలో పర్యటించి వచ్చిన తర్వాత అతను వైరస్ బారిన పడ్డాడని అతని వల్ల ఇతరులకు ‘మెర్స్’ వేగంగా వ్యాపిస్తోందని తెలుస్తోంది. ఈ వైరస్ తొలుత సౌదీ అరేబియాలో 2012లో వెలుగుచూసింది.