పోచమ్మ గుట్టపై లేటరైట్ ఖనిజం
వేమనపల్లి : మండలంలోని మారుమూల ముక్కిడిగూడెం గ్రామ సమీపంలో పోచమ్మ గుట్టపై ఇనుము, లేటరైట్ ఖనిజం సమృద్ధిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గుట్టపైకి వెళ్లి ఇనుప ఖనిజం ఉన్న ప్రాంతాన్ని అన్వేషించారు. గుట్టపై దొరికిన నలుపు వర్ణంలో బరువుగా ఉండే ఖనిజాన్ని లాబరేటరీ పరీక్షల కోసం తీసకెళ్లారు. హైదరాబాద్‌కు చెందిన సమృత్ అనే ప్రైవేట్ కంపెనీ సౌజన్యంతో సర్వే చేపట్టినట్లు అసిస్టెంట్ జియాలజిస్ట్ రఘుబాబు తెలిపారు. ఖనిజం ఉన్న ప్రాంతం గిరివెల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధి కిందకు వస్తుందని మ్యాప్ ద్వారా అంచనా వేశారు. వారి వెంట తహశీల్దార్ రమేశ్‌గౌడ్, సర్పంచ్ వెంకటేశం, అటవీ బీట్ అధికారి రషీద్, మైన్స్ సర్వేయర్ వెంకటేశ్వర్లు, సమృత్ కంపెనీ రిప్రెజెంట్ సుధీర్, వీఆర్వో మల్లేశ్ పాల్గొన్నారు.