ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్.. వీడియో వైరల్
కుచ్ కుచ్ హోతా హై ఫేమ్ సనా సయీద్ న్యూయర్ వేళ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. లాస్ ఏంజిల్స్‌లో తన ప్రియుడు సబా వాగ్నర్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది బాలీవుడ్ భామ. కరణ్ జోహార్ నిర్మించిన 'కుచ్ కుచ్ హోతా హై' చిత్రంలో షారూఖ్, రాణి కుమార్తెగా అంజలి పాత్రలో సనా కనిపించింది. ఆమె తన ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేస్తూ లవ్ సింబల్‌తో ఎంగేజ్మెంట్ గుర్తుగా రింగ్‌ను జతచేసింది. ఆమె పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే పలువురు ప్రముఖులు ఈ జంటను కంగ్రాట్స్ తెలిపారు.
సనా కెరీర్..: కాగా.. కాజోల్, రాణి ముఖర్జీ కూడా నటించిన కరణ్ జోహార్ చిత్రంలో సనా షారూఖ్ కుమార్తెగా అంజలి పాత్రను పోషించింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో తర్వాత రాణి ముఖర్జీతో కలిసి మరో చిత్రంలో నటించింది. ఆ తర్వాత కరణ్ జోహార్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌లోనూ కనిపించింది. ఈ చిత్రంలో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించారు. 2012 చిత్రం తర్వాత, సనా అనేక టెలివిజన్, రియాల్టీ షోలలో కూడా కనిపించింది.
సబా వాగ్నర్ ఎవరు?:సనా ప్రియుడు సబా వాగ్నర్ ఒక సౌండ్ డిజైనర్. అతను లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్నాడు. అతను తరచుగా ఇన్‌స్టాగ్రామ్‌లో సనాతో ఉన్న ఫోటోలు, వీడియోలను పంచుకుంటాడు.
View this post on Instagram
A post shared by Sana Saeed (@sanaofficial)