షూటింగ్లకు కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చింది
ముంబై: మూవీ షూటింగ్ లకు కొద్దిరోజులు బ్రేక్ పెట్టింది బాలీవుడ్ సుందరి సనా అబ్దుల్ అహద్ సయీద్. 'స్టూడెండ్ ఆఫ్ ది ఇయర్' మూవీతో గ్లామర్ పాత్రలో రీఎంట్రీ ఇచ్చిన సనా, నటనకు సంబంధించిన ఓ వర్క్ షాప్కు హాజరయ్యేందుకు లాస్ ఏంజిల్స్ వెళ్లనుంది. అందుకే కొన్ని రోజులు షూటింగ్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. తొలి మూవీకి ముందే లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ అకాడమీ వర్క్ షాప్కు అప్లై చేసుకున్నట్లు తెలిపింది. అయితే తనకు అకాడమీలో చాన్స్ దొరికేలోగా మూవీలో నటించేందుకు అవకావం ఉంటే వదులుకోకుడని స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చేశానని వివరించింది. 2012లో రిలీజైన 'స్టూడెండ్ ఆఫ్ ది ఇయర్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన విషయం విదితమే.
షారుక్ నటించిన 'కుచ్ కుచ్ హోతా హై' మూవీతో బాలనటిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నటి సనా సయీద్. రియాల్టీ షోలు సెలబ్రిటీలు తాము ఎలా ఉంటారన్నది తెలిపేందుకు చక్కని వేదిక అని చెప్పింది. టీవీ షో, బాలీవుడ్ ఇండస్ట్రీలలో దేనిని ఎంచుకుంటారన్న విలేఖరి ప్రశ్నకు.. కచ్చితంగా బాలీవుడ్ మూవీలనే ఎంచుకుంటానన్నది. టీవీ షోలు 'ఝలక్ దిక్ లాజా', 'నాచ్ బలియో 7' లలో సనా పాల్గొన్న విషయం అందరికి విదితమే. లాస్ ఏంజిల్స్ వెళ్తున్నానని, తన దగ్గర టిక్కెట్లు కూడా ఉన్నాయంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.