Sanakhan
-
వివాహం చేసుకున్న బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి, హిందీ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సనా ఖాన్ వివాహం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన ముఫ్తీ అనాస్ సయీద్‌ను శుక్రవారం ఆమె పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తాజాగా ఈ విషయాన్ని సనా ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. వివాహ వేడుకలో సయీద్‌తో కలిసి దిగిన పెళ్లి ఫొటోను ఆమె పోస్ట్‌చేశారు. ‘అల్లాహ్(దేవుడు) దయతో ఒకరినొకరు ప్రేమించుకొని, వివాహం చేసుకున్నాము. ఈ ప్రపంచంలో దేవుడు మనల్ని ఎప్పుడూ ఐక్యంగా ఉంచుతారు’ అని ఆమె కాప్షన్ జతచేశారు. చదవండి: సినిమాలకు వీడ్కోలు చెప్పిన నటి View this post on Instagram A post shared by Sayied Sana Khan (@sanakhaan21) ఈ ఫొటోలో సనా ఖాన్ చెర్రీ రెండ్ బ్రైడల్ లెహంగాను, ఆమె భర్త తెల్లని దుస్తులను ధరించి కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఫొటోతో పాటు పెళ్లి వేడుకలో ఆమె, తన భర్త కేక్‌కట్ చేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, అక్టోబర్ 8న ఇకపై సినమాల్లో నటించబోనని, శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నట్లు సనా ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. సనాఖాన్ తెలుగులో నందమూరి కల్యాణ్ రామ్ ‘కత్తి’, మంచు మనోజ్ ‘మిస్టర్ నూకయ్య’ సినిమాల్లోనూ నటించిన సంగతి తెలిసిందే. హిందీలో పలు సినిమాల్లో నటించిన ఆమె బిగ్‌బాస్ 6వ సీజన్లో పాల్గొని అలరించారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
శింబుతో మరోసారి..
ముంబై భామ సానాఖాన్ నటుడు శింబుతో మరోసారి జత కట్టడానికి రెడీ అవుతోంది. ఇంతకు ముందు ఆయనతో సిలంబాట్టం చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయమైన సానాఖాన్ ఆ తరువాత పయనం, తంబిక్కు ఉంద ఊరు, ఆయిరం విళక్కు, ఒరు నడిగైయిన్ డైరీ తదితరు చిత్రాల్లో నటించింది. అయితే ఆ చిత్రాలేవీ ఆ అమ్మడి కెరీర్‌కు ప్లస్ అవలేదు. దీంతో కోలీవుడ్ సానాఖాన్‌ను పక్కన పెట్టేసింది. ఆ తరువాత తెలుగు, మలయాళం భాషల్లోనూ నటించినా అక్కడా అచ్చిరాలేదు. దీంతో హిందీ చిత్రాలపైనే దృష్టి సారించిన సానాఖాన్కు చాలా కాలం తరువాత అదీ తన తొలి హీరోతోనే మరోసారి రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది.శింబు తాజాగా అన్భానవన్ అసరాధవన్ అడంగాధవన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నాలుగు పాత్రల్లో నటిస్తున్న శింబుకు జంటగా ఇప్పటికీ మిల్కీబ్యూటీ తమన్నా, శ్రియ నటిస్తున్నారు.నాలుగు పాత్రల్లో మదురై మైఖెల్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను శింబు పూర్తి చేశారట. ఇక అశ్విన్ దాదా పాత్రకు చెందిన సన్నివేశాల చిత్రీకరణకు త్వరలో చిత్ర యూనిట్ థాయ్‌ల్యాండ్ వెళ్లనుంది. ఇకపోతే ఇందులో మరో కథానాయకి కోసం చాలా మంది ప్రముఖ నటీమణుల్ని పరిశీలించిన దర్శక నిర్మాతలు చివరికి నటి సానాఖాన్‌ను ఎంపిక చేశారు. శింబు నటిస్తున్న నాలుగు పాత్రల్లో ఏ నటి ఏ పాత్రకు జంటగా నటిస్తున్నారన్నది చిత్ర వర్గాలు ప్రస్తుతానికి సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత మైఖెల్ రాయప్పన్ నిర్మిస్తున్నారు.యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.