బాలీవుడ్ నటి, హిందీ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సనా ఖాన్ వివాహం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన ముఫ్తీ అనాస్ సయీద్‌ను శుక్రవారం ఆమె పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తాజాగా ఈ విషయాన్ని సనా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. వివాహ వేడుకలో సయీద్‌తో కలిసి దిగిన పెళ్లి ఫొటోను ఆమె పోస్ట్‌చేశారు. ‘అల్లాహ్(దేవుడు) దయతో ఒకరినొకరు ప్రేమించుకొని, వివాహం చేసుకున్నాము. ఈ ప్రపంచంలో దేవుడు మనల్ని ఎప్పుడూ ఐక్యంగా ఉంచుతారు’ అని ఆమె కాప్షన్ జతచేశారు. చదవండి: సినిమాలకు వీడ్కోలు చెప్పిన నటి
ఈ ఫొటోలో సనా ఖాన్ చెర్రీ రెండ్ బ్రైడల్ లెహంగాను, ఆమె భర్త తెల్లని దుస్తులను ధరించి కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఫొటోతో పాటు పెళ్లి వేడుకలో ఆమె, తన భర్త కేక్‌కట్ చేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, అక్టోబర్ 8న ఇకపై సినమాల్లో నటించబోనని, శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నట్లు సనా ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. సనాఖాన్ తెలుగులో నందమూరి కల్యాణ్ రామ్ ‘కత్తి’, మంచు మనోజ్ ‘మిస్టర్ నూకయ్య’ సినిమాల్లోనూ నటించిన సంగతి తెలిసిందే. హిందీలో పలు సినిమాల్లో నటించిన ఆమె బిగ్‌బాస్ 6వ సీజన్‌లో పాల్గొని అలరించారు.
Comments
Please login to add a commentAdd a comment