శివమొగ్గ నుంచి గీతా శివరాజ్‌కుమార్
బెంగళూరు, శివమొగ్గ పార్లమెంటు స్థానం నుంచి జేడీఎస్ పార్టీ తరఫున ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు శివరాజ్‌కుమార్ భార్య గీతా శివరాజ్‌కుమార్ పోటీ చేయడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కువూరస్వామి స్పష్టం చేశారు.
నెలమంగళ సమీపంలోని మల్లాపురలో రాయల్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన వార్షికోత్సవ సంబరాలకు కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ...శివమొగ్గ నుంచి గీతా శివరాజ్‌కుమార్ పోటీ చేస్తున్నారని తెలిపారు. కాగా చిక్కబళ్లాపుర పార్లమెంటు స్థానానికి అనితా కువ ూరస్వామి పోటీ చేయడంపై పార్టీలో చర్చించి మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఇక చిక్కబళ్లాపురలో వీరప్ప మొయిలీని ఓడించేందుకు మీరు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారటకదా అన్న విలేకరుల ప్రశ్నకు కుమారస్వామి సమాధానమిస్తూ....రాష్ట్రంలోని ఏ పార్లమెంటు స్థానంలోనూ ఏ పార్టీతోనూ తమ పార్టీ పొత్తుపెట్టుకోలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 28 పార్లమెంటు స్థానాల్లోనూ జేడీఎస్ స్వతంత్రంగానే పోటీ చేస్తుందని వెల్లడించారు.
24న గీతా శివరాజ్‌కుమార్ నామినేషన్
శివమొగ్గ లోక్‌సభ స్థానం నుంచి జేడీఎస్ పార్టీ తరఫున తన సహోదరి, నటుడు శివరాజ్‌కుమార్ భార్య గీతా శివరాజ్‌కుమార్ పోటీ చేయనున్నారని జేడీఎస్ చీఫ్ విప్ మధు బంగారప్ప వెల్లడించారు. శివమొగ్గ జిల్లాలోని సొరబ తాలూకాలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మధు బంగారప్ప మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి ఇప్పటికే ఈ విషయంపై నటుడు శివరాజ్‌కుమార్‌తో చర్చించారని, గీతా రాజకీయ ప్రవేశానికి శివరాజ్‌కుమార్ అంగీకారం తెలిపారని చెప్పారు.
ఈనెల 17న శివమొగ్గలో నిర్వహించే జేడీఎస్ బృహత్ సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నట్లు మధు బంగారప్ప తెలిపారు. ఈనెల 24న గీతా శివరాజ్‌కుమార్ తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారని పేర్కొన్నారు.