sanghamithra
-
ఎన్ని చట్టాలొచ్చినా మహిళలపై దాడులా ?: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: ఆడపిల్లలపై అఘాయిత్యాలు తగ్గాలంటే చట్టాల అమలు సరిగా జరగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. నిర్భయ చట్టాలు వచ్చినా కూడా ఎక్కడ అమలు కావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు 40 శాతం హింసను ఇళ్లల్లోనే ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను మనుషులుగా చూడాలని, మహిళలంతా సంఘటితమై తమ సమస్యలను ఎదుర్కోవాలని సూచించారు. కడుపులో ఉన్నప్పటి నుంచే ఆడబిడ్డలపై దౌర్జన్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హజీపూర్ ఘటన దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని, మళ్లీ అలాంటి అఘాయిత్యాలు జరగకుండా చర్యలు తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పించిన కమిషనర్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం జరిగిన సంఘమిత్ర అవార్డుల కార్యక్రమంలో కవిత పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘షీ టీమ్స్’ అన్ని జిల్లాల్లో ఉన్నాయని, ఇతర రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని గుర్తుచేశారు. ఆడబిడ్డలకు గౌరవం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించారు. మహిళలు సంతోషంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. షీ టీమ్స్‌తో పాటు సంఘమిత్ర కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. సంఘమిత్రలు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ని కోరుతానని చెప్పారు. తనను కూడా సంఘమిత్రలో చేర్చుకోవాలని సీపీని ఈ సందర్భంగా కవిత కోరారు. -
ఏం చేద్దాం..మీరే దొంగ ఓట్లు వేసేయండి!
లక్నో : ఎన్నికల ప్రచారంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే నాయకుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ప్రతీ ఒక్కరూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అనుచరులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి సంఘమిత్ర మౌర్య కూడా ఈ కోవలో చేరిపోయారు. యూపీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కూతురైన సంఘమిత్ర బదౌన్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘ ప్రతీచోటా దొంగ ఓట్లు వేయడం జరుగుతూనే ఉంటుంది కదా. మీకు కూడా చాన్స్ వస్తే అలాగే చేయండి(నవ్వుతూ). పోలింగ్ రోజు ప్రతీ ఒక్కరు ఓటు వేయాల్సిందే. ఇక్కడ(బదౌన్) కూడా అందరూ ఓటేయాలి. ఒకవేళ ఓటర్లు రాకపోతే మీరే దొంగ ఓట్లు వేసేయండి. కాకపోతే కాస్త రహస్యంగా ఆ పని చేయండి’ అంటూ తన అనుచరవర్గాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సంఘమిత్ర వ్యాఖ్యల గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటారంటూ జిల్లా మెజిస్ట్రేట్ దినేశ్ కుమార్‌ను మీడియా ఆశ్రయించింది. ఆమె వ్యాఖ్యల గురించి ఇంతవరకు ఎటువంటి సమాచారం తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు. అయితే అనుచిత వ్యాఖ్యలు చేసిందెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా గతంలో కూడా సంఘమిత్ర ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘ ఎన్నికల సందర్భంగా ఎవరైనా గూండాయిజం చేయాలని ప్రయత్నిస్తే అస్సలు బాగోదు. ఎందుకంటే అందరికంటే పెద్ద గూండాను నేను ఇక్కడే ఉన్నాను. మీ ఆత్మగౌరవం నిలవాలంటే బదౌన్ ప్రజల జోలికి రావొద్దు’ అని ఆమె హెచ్చరించారు. ఇక మంగళవారం జరుగనున్న మూడో దఫా ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్‌తో సంఘమిత్ర తలపడనున్నారు. -
షాకిచ్చిన నయనతార!
చెన్నై: తేనాండాల్ ఫిలింస్ నిర్మాణంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం సంఘమిత్ర. ఇందులో జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తునండగా సంఘమిత్ర అనే టైటిల్ రోల్‌ను శృతిహాసన్ నటించాల్సి ఉంది. అందుకోసం ఆమెకు కత్తిసామువంటి కళల్లో శిక్షణలు కూడా ఇప్పించారు. అయితే, చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోయే సమయంలో పరిస్థితుల్లో ఆ చిత్రం నుంచి శృతి పక్కకు తప్పుకున్నట్టు వెల్లడించారు. దీంతో ఆ పాత్ర కోసం తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషా నటి కోసం గాలించాల్సిన పరిస్థితి సంఘమిత్ర బృందానికి ఏర్పడింది. అప్పుడే దక్షిణాదిలో అగ్ర తారలుగా వెలుగుతున్న నయనతార, అనుష్కలతో రెండేళ్లకు కాల్ షీట్లకు బేరసారాలు జరిపారు. ఇద్దరూ ఇప్పటికే కొన్ని చిత్రాలలో కమిట్ అయి నటిస్తుండడం వలన ఇప్పటికి సంఘమిత్రలో నటించడం కుదరదని తెలిపారట. అయినప్పటి నయనతార నటిస్తే బాగుంటుందని తలచిన చిత్ర బృందం ఆమెతో పలుమార్లు చర్చలు జరుపుతూ వచ్చారు. సంఘమిత్ర తో కమిట్ అయితే కనీసం ఒకటిన్నర సంవత్సరం వేరే చిత్రాలలో నటించడానికి కుదరదు. దీంతో జాగ్రత్తగా ఆలోచించిన నయన్ తాను సంఘమిత్రలో నటించడానికి సిద్ధమేనని తెలిపిందట. అయితే అందుకు ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ మొత్తం విని బెంబేలెత్తిన చిత్ర బృందం ఆ తర్వాత నుంచి ఆమెతో చర్చలు జరపడం నిలిపేసినట్లు కోలీవుడ్ టాక్. -
అందుకే తప్పుకున్నా!
‘‘ఈ సినిమా కోసం ఫిజికల్‌గానే కాదు.. మెంటల్‌గా కూడా చాలా ప్రిపేర్ అవుతున్నా. కొన్ని యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నా’’ అని శ్రుతీహాసన్ చెప్పి నెల రోజులు కూడా కాలేదు. ఈలోపు ఆమె ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ సినిమా ఏదో ఊహించే ఉంటారు. ‘సంఘమిత్ర’. శ్రుతీహాసన్ లీడ్రోల్లో దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో సుందర్.సి రూపొందించనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రిలీజ్ చేశారు. శ్రుతి కూడా అక్కడకు వెళ్లారు. అలాంటిది ఈ సినిమా నుంచి ఆమె ఎందుకు తప్పుకున్నారు? ‘‘పూర్తి బౌండ్ స్క్రిప్ట్ అందజేయకపోవడం, షూటింగ్ షెడ్యూల్స్ గురించి సరిగ్గా క్లారిటీ ఇవ్వకపోవడంవల్లే శ్రుతి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు’’ అని ఆమె వ్యక్తిగత సిబ్బంది సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ‘‘కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రుతీహాసన్‌తో ‘సంఘమిత్ర’ చేయలేకపోతున్నాం’’ అంటూ చిత్రనిర్మాణ సంస్థ శ్రీ తేనాండాల్ ఫిల్మ్స్ ప్రకటించింది. నిజానికి ఈ సినిమా కోసం శ్రుతి లండన్‌లో యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. అదంతా వేస్ట్ అయిందను కోడానికి లేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఆమె ఇలాంటి సినిమా చేస్తే ఉపయోగపడుతుంది కదా.