వివస్త్రను చేసి ఓ మహిళను చితకబాదారు...
పాట్నా: ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసిందనే ఆరోపణలతో ఓ మహిళను బహిరంగ ప్రదేశంలో వివస్త్రను చేసి గ్రామస్తుల సమక్షంలో చితకబాదిన ఘటన పాట్నాలో సంచలనం రేపింది. పాట్నాకు సమీపంలోని నిజాముద్దీన్ పూర్ గ్రామంలో భూమికి సంబంధించిన వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేశారని బుధవారం రాత్రి బహిరంగ ప్రదేశంలో సంగీతాదేవి అనే మహిళ బట్టలూడదీసి విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు.
ఇంటి నుంచి బయటకు ఈడ్చి గ్రామస్థుల సమక్షంలో వివస్త్రను చేసి దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. తీవ్రగాయలతో ఉన్న సంగీతాదేవిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే కిడ్నాప్ గురైన ఇద్దరు హత్యకు గురయ్యారని.. వారి మృతదేహాలు నిజాముద్దీన్ పూర్ లో గురువారం ఉదయం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు.