అపరిమిత శిష్యవాత్సల్యం అయ్యర్ సొత్తు
రాజమహేంద్రవరం కల్చరల్ : అపరివిుత శిష్యవాత్సల్యం పద్మభూషణ్ పాల్ఘాట్ మణి అయ్యర్ సొత్తు అని ఆయన ప్రియశిషు్యడు ఆర్.సురేంద్ర¯ŒS పేర్కొన్నారు. సాంస్కతిక సేవాసమితి సంగీతహరి ఆధ్వర్యంలో శనివారం దానవాయిపేట పాండురంగస్వామి ఆలయంలో జరరుగుతున్న మణి అయ్యర్ జయంతి ఉత్సవాల మలిరోజు ఆయన అయ్యర్ జీవిత విశేషాలను వివరించారు. శిషు్యల్లో ఎటువంటి వివక్ష మణి అయ్యర్ చూపేవారు కాదన్నారు. ప్రముఖ మృదంగ విద్వాంసుడు, మణి అయ్యర్ శిషు్యడు వరదా కమలాకరరావు మాట్లాడుతూ గురువు మన్ననలను పొందని శిషు్యడు జీవితంలో రాణించలేడన్నారు.మరో ప్రముఖ మృదంగ కళాకారుడు కమలాకర యోగీష్ స్వాగత వచనాలు పలికారు. సురేంద్ర¯ŒS తమిళ ప్రసంగాన్ని కమలాకరరావు అనువదించారు. తిరుపతికి చెందిన కోమండూరి వేంకట కృష్ణ గాత్రకచేరీ అలరించింది. ఆముదాలవలసకు చెందిన మావుడూరి సత్యనారాయణ శర్మ వయొలిన్, త్రివేండ్రంకు చెందిన సురేంద్ర¯ŒS మృదంగం, చెన్నయ్‌కు చెందిన పురుషోత్తం కంజీరతో సహకరించారు.