యూఎస్ ఓపెన్ ఫైనల్లో సానియా జోడీ
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్లోకి సానియా మిర్జా- మార్టినా హింగిస్ జోడీ ప్రవేశించింది. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో సానియా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) ద్వయం 6-4, 6-1 తేడాతో ఇటలీకి చెందిన 11వ సీడ్ జోడీ సారా ఎరాని - పెనెట్టాపై విజయం సాధించింది.
రెండు సెట్లలోనే మ్యాచ్ ముగించి దిగ్విజయంగా ఈ జోడీ ఫైన్లల్లోకి దూసుకెళ్లింది. తొలి సెట్లో కాస్తంతా పోరాటం చేసిన ఎరానా - పెనెట్టా జోడీ రెండో సెట్లో పూర్తిగా చతికిలబడింది.