దెందులూరులో వ్యక్తి హత్య
దెందులూరు : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సానిగూడెంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. రామకృష్ణ(50) అనే వ్యక్తిని సొంత వదిన, అన్న కొడుకు రవికుమార్‌లు కలిసి రోకలిబండతో అతడి తలపై మోదారు. దీంతో అతడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. అనంతరం నిందితులు దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ హత్యకు ఆస్తివివాదాలే కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.