నేడు కౌన్సెలింగ్కు సెలవు
కల్లూరు రూరల్: జిల్లా కేంద్రంలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి రెండు కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్కు 209 మంది విద్యార్థులు హాజరైనట్లు కో ఆర్డినేటర్ సంజీవరావ్ తెలిపారు. బి.తాండ్రపాడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 101 మంది, రాయలసీమ యూనివర్సిటీలో 108 మంది అభ్యర్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ వై.విజయభాస్కర్, సంజీవరావ్ పేర్కొన్నారు. శనివారం పాలిటెక్నిక్ కళాశాలలో 90001 నుంచి 97వేలు, ఆర్యూలో 97,001 నుంచి 1,05,000 ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.
కౌన్సెలింగ్కు 111 మంది హాజరు
నూనెపల్లె: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్కు 111 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గురువారం 75,001 నుంచి 90వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించగా అభ్యర్థులకు సర్టిఫికెట్లను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు క్యాంప్ కన్వీనర్ ఎం.రామసుబ్బారెడ్డి తెలిపారు. 11 మంది ఎస్సీ, 100 మంది ఓసీ, బీసీ అభ్యర్థులు హాజరైనట్లు ఆయన చెప్పారు.
శనివారం 90,001 నుంచి 1,05,000 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరు కావచ్చని తెలిపారు. ఇప్పటి వరకు కౌన్సెలింగ్కు హాజరుకాని వారు కూడా రావచ్చన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం కౌన్సెలింగ్కు జరగదన్నారు. క్యాంపులో సిస్టమ్ అధికారులుగా మంజునాథ్, సుబ్బరాయుడు, అధ్యాపకులు రాజశేఖర్ రెడ్డి, లలిత, రఘునాథ్ రెడ్డి, చీఫ్ వెరిఫికేషన్ అధికారిగా కృష్ణమూర్తి, వెంకట్రావు వ్యవహరించారు.
17 నుంచి వెబ్ కౌన్సెలింగ్: ఎంసెట్ కౌన్సెలింగ్ లో పాల్గొన్న అభ్యర్థులకు ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు క్యాంప్ అధికారి తెలిపారు. వెబ్ ఆప్షన్ల తర్వాత 26, 27 తేదీల్లో సవరణ ఉంటుందని చెప్పారు. అయితే తెలంగాణాలో ఈనెల 19న సర్వే నేపథ్యంలో వెబ్ కౌన్సెలింగ్ ఉండదని ఆయన చెప్పారు.