సేవాలాల్ మహారాజ్ చరిత్ర అందరికీ తెలవాలి
దేవరకొండ : సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చరిత్రను తెలంగాణలోని ప్రతి గిరిజ నుడు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉం దని సేవాలాల్ బంజార సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మోతీలాల్‌నాయక్ అభిప్రాయపడ్డారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఈనెల 12న దేవరకొండ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్లో నిర్వహించనున్న నేపథ్యంలో వారు మహారాజ్ చరిత్రకు సం బంధించిన బ్రోచర్‌ను మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మోతీలాల్‌నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ 278వ జయంతిని జరుపుకునే తరుణంలో తెలంగాణలోని ప్రతి గిరిజనుడు ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాంరావు మహా రాజ్, ఎమ్మెల్సీ రాములునాయక్, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎస్టీ సెల్ జిల్లా అ«ధ్యక్షుడు రాం బాబునాయక్, లాలునాయక్ తదితరులు హాజరవుతున్నట్లు ఆయన తెలి పారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు పెద్దసంఖ్యలలో తరలిరావాలని కోరారు. నాగునాయక్, సాయికుమార్, రాజు, రమేశ్, కె.సునీల్, కె.రమేశ్, కె.శరత్‌నాయక్, నాగరాజు పాల్గొన్నారు.