మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
హైదరాబాద్: సనత్‌నగర్‌లో రోడ్డుపక్క నడిచి వెళ్తున్న మహిళ మెడలోని గొలుసును ఆగంతకులు లాక్కుని పోయారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. సనత్‌నగర్‌లోని హనుమాన్ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న రమాదేవి(30) మెడలోని రెండు తులాల బంగారు గొలుసును వెనుక నుంచి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు దోచుకు పోయారు. చెవి కమ్మలు కూడా లాక్కునేందుకు యత్నించటంతో రమాదేవి ప్రతిఘటించింది. పెనుగులాటలో ఆమె చెవికి గాయాలయ్యాయి. ఎస్సార్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో రమాదేవి ఫిర్యాదు చేసింది. బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.