దావూద్ లొంగిపోతానన్నాడు కానీ...
న్యూఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం లోంగిపోతానంటూ వచ్చిన కథనాన్ని కొనసాగింపుగా ప్రముఖ అంగ్ల దిన పత్రిక హిందుస్థాన్ టైమ్స్ ఆదివారం మరో కథనాన్ని ప్రచురించింది. అందులో ఈ వివాదాస్పద కథనంపై డీల్లీ పోలీస్ మాజీ కమిషనర్ నీరజ్ కుమార్, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శంతన్ సేన్ మరింత స్పష్టత ఇచ్చారు. లొంగిపోతానంటూ దావూద్ తన సహచరుడు లాలా ద్వారా వర్తమానం పంపాడని నీరజ్ తెలిపారు. అయితే లొంగిపోవడం సంగతి పక్కన పెట్టి తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో దావుద్ పడ్డాడన్నారు.
కానీ దావూద్ లొంగిపోతానంటూనే... కొన్ని షరతులు పెట్టాడని శంతన్ సేన్ వివరించారు. అందులోభాంగా 1993 బాంబు పేలుళ్ల కేసు తప్ప మిగతా కేసులన్నింటినీ ఎత్తేయాలని షరత్ విధించాడన్నారు. దావూద్ షరతులను మేము అంగీకరించలేదన్న విషయాన్ని వారు స్పష్టం చేశారు. లొంగిపోవడానికి వచ్చిన నిందితుడు ఎప్పుడూ షరతులు పెట్టకూడదన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. అందుకే మేము దాన్ని తిరస్కరించామన్నారు. కండిషన్లు పెట్టినందునే దావూద్‌తో మాట్లాడవద్దని నీరజ్‌కుమార్‌కు స్పష్టం చేశామన్నారు శంతన్ సేన్.