అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలం చిలామాకులరాయి అటవీ ప్రాంతంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అయితే అటవీ ప్రాంతంలో పడి ఉన్న ఈ మృతదేహన్ని చూస్తే.. ఎవరైనా చంపి ఇక్కడ పడివేసి ఉండవచ్చుననే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.