santhosha
-
నిద్ర లేవలేదని.. పిల్లలపై వేడినీళ్లు పోసిన తల్లి!
సంగారెడ్డి: నిద్రలేవలేదనే కారణంతో ఇద్దరు చిన్నారులపై ఓ తల్లి వేడినీటిని గుమ్మరించింది. దీంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుసూదన్‌గౌడ్ కథనం ప్రకారం.. ఎల్కపల్లికి చెందిన ఎంచర్ల సంతోష, సాయిలు దంపతులకు ఇద్దరు సంతానం. భార్యాభర్తల మధ్య కొన్ని నెలలుగా వివాదాలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో నిద్ర లేవలేదనే కారణంతో చిన్నారులు శ్రీనిధి, రిత్విక్లపై మరిగేనీటిని పోసింది. ఈ ఘటనలో పొట్ట, ఛాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రిత్విక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మనసు చదివేస్తాడు
‘విక్రమార్కుడు’ సినిమాలో ప్రతినాయకుడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు అజయ్. పలు చిత్రాల్లో హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా నటిస్తున్న ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘స్పెషల్’. వాస్తవ్ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందమ్ శ్రీవాస్తవ్ నిర్మించారు. వాస్తవ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక మైండ్ రీడర్ స్టోరీ. ఓ వ్యక్తిని ఒక అమ్మాయి లవ్ చేసి వదిలేస్తుంది. ఆ అమ్మాయి అతన్ని మోసం చేయడానికి కారణమైన వాళ్ల మీద ఈ మైండ్ రీడర్ పగ తీర్చుకుంటాడు. మనుషుల్ని టచ్ చేసి, వాళ్ల మైండ్ రీడ్ చేసే ఒక పారాసైకాలజీ స్కిల్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. హాలీవుడ్ తరహా కథాంశంతో తీసిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ఇది. అజయ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు’’ అన్నారు. ‘‘ఫ్యాంటసీ లవ్ యాక్షన్ షేడ్స్‌తో నడిచే చిత్రమిది. కథ, కథనం, ట్విస్టులు ఈ చిత్రానికి ప్రధాన బలం. ఇందులోని డైలాగ్స్ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్‌ని ఇస్తాయి. ఈనెల 29న టీజర్‌ను, నవంబర్ చివరి వారంలో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని శ్రీవాస్తవ్ అన్నారు. రంగ, అక్షత, సంతోష, అశోక్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎన్వీఎస్ మన్యం, కెమెరా: బి అమర్ కుమార్. -
అప్పుడు మాకు నిద్రపట్టలేదు...!
అజయ్, రంగ, అక్షిత, సంతోష ముఖ్యతారాగణంగా నందనాల్ క్రియేషన్స్ పతాకంపై వాస్తవ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘స్పెషల్’. ద స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ అనేది ఉపశీర్షిక. ఎన్వీయస్ మణ్యం స్వరకర్త. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ రివెంజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేశాం. మా చిత్రానికి అజయ్‌గారు బ్యాక్‌బోన్ లాంటి వారు. ఇన్వెస్టిగెటివ్ ఆఫీసర్‌గా ఆయన మేము ఊహించిన దాని కన్నా సూపర్‌గా నటించారు. సైకాలజీ డాక్టర్ అశోక్‌కుమార్, అక్షిత, సంతోష, రంగా బాగా నటించారు. మా సినిమా కాస్త షూటింగ్ జరిగిన తర్వాత ‘రాజుగారి గది 2’ లో నాగార్జున మైండ్ రీడర్‌గా చేస్తున్నారని తెలిసింది. అప్పుడు మాకు నిద్రపట్టలేదు. కానీ, సినిమా చూశాక నాగార్జునగారి క్యారెక్టర్ చూసి, హ్యాపీ ఫీలయ్యాం. ఆయన నటన ఎక్స్లెంట్. మా మైండ్ రీడర్‌కి, ‘రాజుగారి గది–2’ మైండ్ రీడర్‌కి పోలిక లేదు’’ అన్నారు. ‘‘కథ వినగానే ఇలాంటి కాన్సెప్ట్ చిత్రాలు ప్రేక్షకులు నచ్చుతాయా అని ఆలోచించాను. కానీ, అవుట్‌పుట్ బాగా వచ్చింది. మంచి క్యారెక్టర్ చేస్తున్నాను’’ అన్నారు అజయ్. ‘ఈ చిత్రంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్యారెక్టర్ చేశాను’’ అన్నారు రంగా. అశోక్‌కుమార్, ఎస్వీయస్ మణ్యం, అక్షిత పాల్గొన్నారు. -
కోడలు దిద్దిన కాపురం
♦ కన్నీటిని దిగమింగి.. కష్టాలకు ఎదురొడ్డి.. ♦ ఆ కుటుంబానికి అత్తాకోడళ్లే పెద్ద దిక్కు ♦ ‘సాగు’తోన్న సంసారం ఎందరికో ఆదర్శం ♦ అత్తాకోడళ్ల జీవన యానం వర్గల్: అత్తాకోడళ్లు కలిసికట్టుగా సాగారు... కాపురం నిలబెట్టారు. ఇంటి పెద్దల్లో ఒకరు మరణించగా.. మరొకరు మంచాన పడ్డారు. ఆడవాళ్లం మేమేం చేయగలం అని వారు చేతులెత్తేయలేదు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఇద్దరు కలిసి కష్టపడి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఆదర్శంగా నిలిచారు. వర్గల్ మండలం సింగాయపల్లికి చెందిన రైతు టేకులపల్లి మల్లారెడ్డి-నర్సమ్మ దంపతులు. కొడుకు గోపాల్‌రెడ్డి, కోడలు సంతోష, మనవరాలు నవ్య, మనవడు అరవింద్ ఉ న్నారు. ఈ కుటుంబానికి వ్యవసాయమే ఆధా రం. సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో సంతోష భర్త గోపాల్‌రెడ్డి అకాల మరణంతో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఏ మా త్రం నెరవని సంతోష అత్తామామలతో కలిసి పొలంబాట పట్టింది. మరో మూడేళ్లు గడిచిందో లేదో ఇంటి పెద్దగా ఉన్న మామ మల్లారెడ్డి తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో అత్తాకోడళ్లు మరోసారి కష్టాలు ఎదురయ్యాయి. అయినా వాటికి ఎదురొడ్డి నిలిచారు. అత్తాకోడళ్లు కలిసి రెండెకరాల్లో కూరగాయ పంటలు సాగు చేయడం దినచర్యగా మార్చుకున్నారు. పురుషులకు దీటుగా ‘బంగారు’ పంటలు పండిస్తూ ఆ అత్తాకోడళ్లు గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరోవైపు తీరిక దొరికితే చాలు కోడలు సంతోష బీడీలు చుడుతూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. పుట్టెడు కష్టాలు ఎదురైనా.. నా పిల్లలు ఐదేళ్లలోపు వయసు ఉన్నప్పుడే ఆ దేవుడు నా భర్త గోపాల్‌రెడ్డిని దూరం చేశాడు. మా కుటుంబం ఒక్కసారిగా కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తరువాత మూడేండ్లకు మామ మల్లారెడ్డి ఆరోగ్యం దెబ్బతిన్నది. నేనూ, మా అత్త కష్టం చేస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితి. చిన్నపిల్లలు బెంగటిల్లొద్దని ఎవుసం బరువు బాధ్యతలు అత్తాకోడళ్లం నెత్తినెత్తుకున్నం. రెండెకరాల పొలానికి నీటి సవులత్ ఉన్నది. కాలం బట్టి మిర్చి, ఆలుగడ్డ, గుమ్మడి, కీర పంటలు వేసుకుంటున్నం. డ్రిప్ పెట్టుకున్నం. మిగతా రెండెకరాలల్ల పునాస పంటలు వేస్తం. నాకు వీలైనపుడు బీడీలు కూడా చేస్తుంట. మా కష్టం ఎన్నడు వృథా కాలేదు. మంచి దిగుబడి సాధించినం. పిల్లలకు తండ్రి లేని లోటు లేకుండ చూసుకుంటున్న. - సంతోష కీర, మిరప వేసినం... మాకున్న నాలుగెకరాలల్ల రెండెకరాలకు నీళ్ల సవులత్ ఉన్నది. కాలం ఎన్కకుపోయింది. దీంతోని బోరు బాయిల నీళ్లు ఎకరానికే సరిపోతున్నయ్. పంట పండితెనే పిల్లలకు చదువులు, కుటుంబం గడుస్తది. ఎకరం భూమిల అద్దెకరం కీర, అద్దెకరంల మిర్చి వేసుకున్నం. ఇపుడు పూత దశకొచ్చింది. అత్తాకోడళ్లం శేనుకాడనె పంట పనుల్లో మునిగి తేలుతం. కరువుల సైతం మంచి పంట దిగుబడి తెచ్చినం. సర్కారు గింత సాయం చేస్తె ఎకరంల పందిరి వేసుకుంటం. భూమిని నమ్ముకున్నోళ్లు ఎన్నడు చెడిపోరు. - నర్సమ్మ (అత్త)