'భారతీయులు మా గురువులు'
సూరత్: భారతీయులను తాము గురువులుగా పరిగణిస్తామని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, టిబెటన్ల ఆధ్యాత్మిక నేత దలైలామా చెప్పారు. తొలిసారిగా ఆయన ఈరోజు గుజరాత్లో పర్యటించారు. సంతోక్బా అవార్డు అందుకునేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ అవార్డు కింద 25 లక్షల రూపాయల నగదుతోపాటు వజ్రం పొదిగి బంగారు పూతతో రూపొందించిన ఒక జ్ఞాపినకు అందజేస్తారు.
సూరత్ విమానాశ్రయంలో దలైలామా విలేకరులతో మామాట్లాడారు. ప్రాచీన కాలంలోనే ఇక్కడి నలంద విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాతి పొందిందన్నారు. తన మనసు నలంద( ప్రాచీన బౌద్ధారామం) ఆలోచనలతో నిండి ఉంటుందని చెప్పారు. అందుకే భారతీయులు తమకు గురువులని ఆయన అన్నారు.