Sanya
-
రాకాసిలా విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారీ... మళ్లీ లాక్డౌన్ దిశగా అడుగులు
Covid outbreak Tropical Sanya, ‘China’s Hawaii’: చైనాలో మళ్లీ కరోనా మహమ్మారీ రాకాసిలా విరుచుకుపడుతుంది. గత కొన్ని రోజులుగా కరోనా తగ్గుముఖం పట్టిందని ఆనందంగా ఊపిరి పీల్చుకునేలోపు మళ్లీ పగపట్టినట్టుగా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ మేరకు చైనా దక్షిణ తీరంలోని హైనాన్ ప్రావిన్స్ రాజధాని సాన్యాలో అధిక సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదీగాక సాన్యా పర్యాటక హాట్‌స్పాట్‌గా ప్రసిద్ధి. దీంతో ప్రస్తుతం అక్కడ సుమారు 80 వేల మంది దాక పర్యాటకులు ఉన్నారు. ఐతే వేగంగా విజృంభిస్తున్న ఈ కరోనా కేసుల దృష్ట్యా అధికారులు బహిరంగ ప్రదేశాల్లో సాముహికంగా ప్రజలు తిరగడాన్ని నిషేధించారు. శనివారం ఉదయం నుంచి ప్రజల కదలికలను నియంత్రించడమే కాకుండా రెస్టారెంట్లు, బార్లు, నగరంలోని ప్రసిద్ధ డ్యూటీ-ఫ్రీ మాల్స్‌తో సహా చాలా బహిరంగ వేదికలను మూసివేయమని ఆదేశించారు. అంతేగాదు ప్రసుతం నగరంలో నెలకొన్న పరిస్థితిని అర్థం చేసుకుని పర్యాటకులు తమకు సహకరించాలని కోరారు. పర్యాటకులు సాన్యా నగరాన్ని విడిచిపెట్టడం కోసం సకాలంలో కరోనా టెస్టులు చేయించుకోవడం తప్పనసరి అని చెప్పారు. అలాగే విమానం ధరలు పెరగడంతో ప్రస్తుతం ఎంతమంది సాధ్యమైనంత తొందరగా సాన్యా నగరాన్ని వదిలి వెళ్లగలరనేది చెప్పలేనని తెలిపారు. ప్రస్తుతం సాన్యాలో ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు దాదాపు 455 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. నగరంలో మాస్ టెస్టింగ్ జరుగుతోందని, కనీసం ఆగస్ట్ 8 వరకు బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని నివాసితులకు సూచించడమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పౌరులు కూడా నగరంలోకి ప్రవేశించవద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు కట్టడి చేసే దిశగా మళ్లీ కఠిన లాక్ డౌన్ ఆంక్షలు విధించనున్నట్లు నొక్కి చెప్పారు. (చదవండి: ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం... స్పాట్లో ఆహుతైన వాహనాలు) -
సంగీతంలో సస్పెన్స్
సందీప్, శివ, విశ్వాస్, ఠాగూర్, సాన్య, జోయా ముఖ్య తారలుగా గంటాడి కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. గడ్డం రవి సమర్పణలో గంటాడి కృష్ణ, సురేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి టీఆర్ఎస్ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. గంటాడి కృష్ణ మాట్లాడుతూ– ‘‘మంచి కథ, కథనాలతో సంగీత ప్రధానంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు. ‘‘ఓ కొత్త కథతో కృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు సురేష్ రెడ్డి. ‘‘కచ్చితంగా హిట్ కొడతామనే నమ్మకం ఉంది’’ అన్నారు సందీప్, విశ్వాస్. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ బామ్మిశెట్టి, సహ నిర్మాతలు రాధాకృష్ణ, మహేష్ కల్లె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రాహుల్, పరిటాల. -
మైమరిపించిన ముద్దుగుమ్మలు..