SAP Labs
-
గుడ్ న్యూస్: 15,000 ఉద్యోగాలు.. ప్రారంభమైన సాఫ్ట్వేర్ కంపెనీ క్యాంపస్ నిర్మాణం
జర్మనీకి చెందిన మల్టీనేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ శాప్ (SAP) ల్యాబ్స్ బెంగళూరులో రెండో క్యాంపస్ నిర్మాణాన్ని తాజాగా ప్రారంభించింది. 15,000 మంది ఉద్యోగులు పని చేసేందుకు సరిపోయేలా ఈ క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. శాప్ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సీనియర్ వైస్ ప్రెసిడింట్ సింధు గంగాధరన్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 41.07 ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. ఇది 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ‘శాప్ ల్యాబ్స్ ఇండియా 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం బెంగళూరులో 15,000 ఉద్యోగాలను సృష్టించే కొత్త 41 ఎకరాల క్యాంపస్‌తో భారతదేశంలో మా పెట్టుబడులను మరింతగా పెంచుతున్నాం’ అని శాప్ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సీనియర్ వైస్ ప్రెసిడింట్ సింధు గంగాధరన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌లో ప్రస్తుతం శాప్ ల్యాబ్స్‌కు అతిపెద్ద ఆర్అండ్డీ హబ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ మొత్తం ఆర్అండ్డీ విభాగంలో 40 శాతం వాటా దీని నుంచి ఉంది. కొత్త క్యాంపస్ నిర్మాణం భారతదేశం పట్ల తమ నిబద్ధతను మరింత బలపరుస్తుందని శాప్ కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: ట్విటర్ క్రాష్: ఇష్టమొచ్చినట్లు ఉద్యోగులను పీకేస్తే ఇలాగే ఉంటుంది! -
ఆగని ఉద్యోగాల కోత.. శాప్ ల్యాబ్స్ నుంచి 300 మంది అవుట్
SAP ల్యాబ్స్ భారతదేశ కేంద్రాలలో పనిచేస్తున్న సుమారు 300 మంది ఉద్యోగులను తొలగించింది. గ్లోబల్ డెలివరీ సెంటర్ మూసివేయడం వల్ల ఈ తొలగింపు జరిగిందని సంస్థ తెలిపింది. ఇందులో ఎక్కువ మంది బెంగళూరు, గురుగ్రామ్ కార్యాలయాల్లో పనిచేసేవారు ఉండటం గమనార్హం. నివేదికల ప్రకారం, కంపెనీ తొలగించిన ఉద్యోగులలో దాదాపు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల అనుభవం ఉన్నవారు కూడా ఉన్నారు. రిట్రెంచ్‌మెంట్ తర్వాత వీరందరికి కంపెనీ మంచి ప్యాకేజీ, ఇతర ప్రయోజనాలను అందిస్తూ మార్గం చూపుతుంది. ఉద్యోగుల తొలగింపు రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన వ్యూహాత్మక పరివర్తన, ఇది ప్రస్తుతం తొలగింపుకి గురైన ఉద్యోగులపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. కొత్త ఉద్యోగుల నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కొంతమంది చెబుతున్నారు. గత నెలలో, శాప్ ల్యాబ్స్ యొక్క మాతృ సంస్థ శాప్ ప్రపంచవ్యాప్తంగా దాని "కోర్ బిజినెస్"పై దృష్టి పెట్టడానికి తొలగింపులను ప్రకటించింది. దీని వల్ల 3 వేలమంది ఉద్యోగులను తొలగించింది. డిసెంబర్ 2022తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కంపెనీ తొలగింపులు ప్రకటించింది. (ఇదీ చదవండి: తడబడిన ట్విటర్.. నిమిషాల్లో వేల పిర్యాదులు) 2025 నాటికి కంపెనీ భారతదేశంలోని హెడ్‌కౌంట్ రెట్టింపు చేయనున్నట్లు, దీనికోసం దాదాపు 15,000 మంది సామర్థ్యంతో బెంగళూరులోని దేవనహళ్లి ప్రాంతంలో కొత్త క్యాంపస్ ప్రారంభించనున్నట్లు గతంలో ప్రకటించింది. దీనికోసం ఇప్పటికే 41 ఎకరాల భూమిని కొనుగోలోను చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, డెల్, ఫిలిప్స్, ఓఎల్ఎక్స్, స్విగ్గీ, గూగుల్ వంటి సంస్థలు చాలా మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఈ జాబితాలో శాప్ ల్యాబ్స్ కూడా చేరింది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఈ జాబితాలోకి మరిన్ని పెద్ద కంపెనీలు కూడా చేరతాయనటంలో ఎటువంటి సందేహం లేదు. -
ఆ టెక్ కంపెనీలో భారీగా ఉద్యోగుల నియామకం
బెంగళూరు : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎఫెక్ట్ తో సాప్ట్ వేర్ సంస్థల ఉద్యోగాలు ఊడతాయనే ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వారి ఆందోళనకు చెక్ పెడుతూ మరికొన్ని టెక్ సంస్థలు భారీగా ఉద్యోగాల నియామకంపైన కూడా దృష్టిపెడుతున్నాయి. బహుళ జాతీయ సాప్ట్ వేర్ కమ్యూనికేషన్ సంస్థలో ఒకటైన ఎస్ఏపీ భారీగా ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు తెలుస్తోంది. వచ్చే రెండేళ్లలో ఈ కంపెనీ దాదాపు 2500 మంది ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోవాలని యోచిస్తోందని సంబంధిత వర్గాలు చెప్పాయి. బెంగళూరు క్యాంపస్‌లో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలో ఈ ఇంజనీర్ల రిక్రూట్ మెంట్‌ను కంపెనీ చేపట్టబోతుందని పేర్కొన్నాయి. 50 మిలియన్ యూరోల పెట్టుబడులతో 5.15 లక్షల చదరపు అడుగుల్లో ఈ కొత్త సౌకర్యాన్ని కంపెనీ ప్రారంభించింది. గత రెండేళ్లుగా కూడా కంపెనీ మంచి ఉద్యోగ నియామకాలు చేపడుతూ వస్తోంది. ప్రతేడాది 1500 మంది ఇంజనీర్లను ఇప్పటికే ఈ కంపెనీ నియమించుకుంది. గత రెండేళ్లుగా తమ నియామకాలు కాలేజీ క్యాంపస్‌ల ద్వారానే జరిపామని ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ఖండెల్వాల్ చెప్పారు. ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియాలో 10వేలకు పైగా ఉద్యోగులున్నారని, వారిలో 7500 మంది ఇంజనీరింగ్ డివిజన్లో పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎస్ఏపీకి మొత్తం 85000 మంది ఉద్యోగులున్నారు.