sapak thakra
-
సపక్ తక్రా రాష్ట్ర జట్ల ఎంపిక
నారాయణపురం (ఉంగుటూరు): అండర్–19 సెపక్తక్రా రాష్ట్ర జట్టును శుక్రవారం నారాయణపురం బాపిరాజు స్టేడియంలో ఎంపిక చేశారు. బాలుర జట్టు : డి.బీరజు (కడప), కె.నాగశివ (పశ్చిమ), పి.గోవర్ధ¯ŒS (కర్నూల్), ఎ¯ŒS.నంద్ కుమార్(నెల్లూరు), ఎంవీవీఎ¯ŒS సాయి (పశ్చిమ), స్టాండ్ బైలుగా కె.వినీత్ కుమార్ (కర్నూల్). బి.నితి¯ŒSరెడ్డి (కడప) ఎంపికయ్యారు. బాలికల జట్టు : జి.భవాని (కృష్ణా), ఎం.కల్యాణి (పశ్చిమ), వి.మాధవి (నెల్లూరు), ఎస్.పద్మ (శ్రీకాకుళం), బి.ఝాన్సీ (శ్రీకాకుళం), స్టాండ్ బైలుగా ఎం.యువదీక్షత (పశ్చిమ), ఈ వెంకటలక్ష్మి (పశ్చిమ) ఎంపికైనట్టు అండర్–19 ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐజాక్, జిల్లా ఒలింపిగ్ అసోసియోష¯ŒS కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ చెప్పారు. -
సత్తాచాటిన పశ్చిమ
నారాయణపురం (ఉంగుటూరు) : సపక్తక్రా రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు సత్తాచాటింది. బాలుర జట్టు విజేతగా నిలిచింది. నారాయణపురం బాపిరాజు స్టేడియంలో రెండురోజులుగా జరుగుతున్న అండర్–19 సపక్ తక్రా బాల, బాలికల టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. శుక్రవారం జరిగిన తుది పోటీల్లో కర్నూలు జట్టు ద్వితీయ స్థానం దక్కించుకోగా కడప జట్టు తృతీయస్థానం పొందింది. బాలికల విభాగంలో నెల్లూరు జట్టు ఛాంపియ¯ŒSగా నిలిచింది. శ్రీకాకుళం దిృతీయ, పశ్చిమ గోదావరి తృతీయ స్థానాలు సాధించాయి. విజేతలకు సర్టిఫికెట్లు, పతకాలను అందజేశారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ వి.సోమశేఖర్ అధ్యక్షత వహించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తిరుపణ్యం, సపక్తక్రా రాష్ట్ర పరిశీలకుడు ఎ. సుబ్బరాజు, ఈ పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి అద్దంకి ఐజాక్, జిల్లా ఒలింపిక్స్ అసోసియేష¯ŒS కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ, జీఎంఎస్ కుమార్, రాజా, మూర్తి, శ్రీను, పాల్గొన్నారు.