Sapna pabbi
-
సినిమాల కన్నా స్మాల్ స్క్రీన్ మీదే..
సప్న పబ్బి.. సినిమా ప్రేక్షకుల కన్నా బుల్లి తెర వీక్షకులకు బాగా పరిచయం ఉన్న ఆర్టిస్ట్. ఈ మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి నటిగా స్థిరపడింది. లండన్‌లో స్థిరపడ్డ పంజాబీ కుటుంబం వీళ్లది. సప్న పుట్టింది, పెరిగింది అక్కడే. బర్మింగ్‌హామ్‌లోని అస్టన్ యూనివర్సిటీలో డిగ్రీ చదివింది. మోడలింగ్‌లో అవకాశాలు రావడంతో ముంబైకి షిఫ్ట్ అయింది. ఫస్ట్ స్క్రీన్ అపియరెన్స్.. ‘ఘర్ ఆజా పర్దేశీ’ అనే టీవీ సీరియల్‌తో. ఇందులో నటిస్తున్నప్పుడే ‘24’ అనే సిరీస్‌లో అవకాశం వచ్చింది. రెండు సీజన్స్‌లో నటించింది సప్న.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌కి కూతురుగా. ఖామోషియా... సప్న మొదటి సినిమా. హ్యాపీ బిగినింగ్ ఇచ్చిన సినిమా ఏం కాదిది ఆమెకు. కొన్ని సీన్ల చిత్రీకరణలో దర్శకుడు విక్రమ్ భట్‌కు, సప్నకు మధ్య కాస్త వివాదం రేగింది. ‘ఖామోషియా’ కథ చెప్పినప్పుడే ఆ సన్నివేశాలనూ వివరించాను. అప్పుడు ఒప్పుకొని తీరా సెట్స్ మీద ససేమిరా అంది’ అంటూ స్వప్న తీరును విమర్శించాడు విక్రమ్ భట్. ‘నిజమే.. కథ చెప్పినప్పుడు ఓకే అనిపించి ఒప్పుకున్నాను. కాని షూటింగ్ అప్పుడు నాకెందుకో నచ్చలేదు. నేనేం పోర్న్ స్టార్‌ని కాదుకదా..’ అని సమాధానమిచ్చింది సప్న. వెబ్ సిరీస్.. సినిమాల కన్నా స్మాల్ స్క్రీన్ మీదే సౌకర్యంగా ఫీలవుతున్నట్టుంది సప్న. ఆమె యాక్టింగ్ పోర్ట్‌ఫోలియోలో వెబ్ సిరీస్ సంఖ్యే ఎక్కువ. బిందాస్ వెబ్ చానెలో ‘ది ట్రిప్’, అమెజాన్‌లో బ్రీత్ – 1, ఇన్సైడ్ ఎడ్జ్ –2, నెట్‌ఫ్లిక్స్‌లో ‘డ్రైవ్(సినిమా) స్ట్రీమ్ అవుతున్నాయి. పుస్తకాలు.. చదవడం ఆమె అభిరుచి. షూటింగ్స్ లేకపోయినా, విరామం దొరికనా పుస్తకం చదువుకుంటుంది. బయోగ్రఫీలు, ఫిలాసఫీలంటే ఎక్కువ ఇష్టపడుతుంది. తనకు అనిపించిందే చేస్తుంది. ఒపీనియన్ పోల్‌ను ఇష్టపడదు. బిందాస్‌గా ఉంటుంది. మీటూ.. ఉద్యమంలో తనూశ్రీ దత్తకు అండగా నిలబడింది. ‘హాలీవుడ్లో ప్రతి ఒక్కరు సినిమాలతోపాటు టీవీలోనూ నటిస్తారు. ప్లాట్‌ఫామ్ లేదా మీడియం ఏంటీ అనేది ముఖ్యం కాదు వాళ్లకు. ఆర్టే ఇంపార్టెంట్. కాని బాలీవుడ్లో అలా కాదు. సినిమా, టీవీకి మధ్య గీత గీసుకున్నారు. దాన్ని బ్రేక్ చేయాలి. ఆ ఐస్‌ను బద్దలు కొట్టాలి. నా వరకు నాకైతే నటనే ముఖ్యం. ప్లాట్‌ఫామ్ కాదు’ అంటుంది సప్న పబ్బి. -
షూటింగ్లో నాకూ అలాగే జరిగింది : నటి
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపులపై టీవీ నటి సప్నా పబ్బీ నోరు విప్పారు. పని ప్రదేశంలో మహిళలకు రక్షణ లేదని ఆమె వాపోయారు. నానా పటేకర్ వంటి బాలీవుడ్ ప్రముఖులపై వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన తనుశ్రీ దత్తాకు తన మద్దతు ప్రకటించారు. అనిల్‌కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘24’ సిరీస్‌లో సప్నా నటించారు. 24 చిత్రీకరణ సమయంలో దర్శకుడు తనపట్ల ఎంత దురుసుగా ప్రవర్తించాడో తెలుపుతూ సప్నా సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. (ఏంటి ఇదేమన్నా జోక్ అనుకుంటున్నారా : నటి) వెకిలి నవ్వులు.. పాటకు రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఒక బిగుతైన బికినీ వేసుకోవాల్సి వచ్చిందనీ, అది తనకెంతో అన్‌కంఫర్ట్‌గా అనిపించిందని సప్నా పేర్కొన్నారు. ఆ ఇబ్బందికి పరిష్కారంగా నేనొక చిన్న సలహా ఇస్తే ఎవరూ పట్టించుకోలేదని వివరించారు. పైగా తన మాటలకు దర్శకుడు, స్టైలిస్ట్ (లేడీ) వెకిలిగా నవ్వి తనను మరింత బాధపెట్టారని ఆమె తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. దాదాపు 7 గంటలపాటు ఆ బికినీ ధరించాల్సి రావడంతో.. ఛాతీ భాగంలో తీవ్రమైన నొప్పి వచ్చిందని సప్నా తన పోస్టులో ఆవేదన చెందారు. తనకు తోడుగా నిలవాల్సిందిపోయి.. నా స్టైలిస్ట్ దర్శకుడితో కలిసి జుగుప్సాకరంగా నవ్విందని మండిపడ్డారు. దర్శకుడికి వ్యతిరేకంగా మాట్లాడితే.. ఆ ప్రోగ్రాం నుంచి తనను తొలగిస్తారనే భయంతో ఇన్నాళ్లు ఈ విషయాన్ని బయటపెట్టలేదని తెలిపారు. కాగా, నటుడు నానా పటేకర్‌తో పాటు దర్శకులు వివేక్ అగ్నిహోత్రి, రాకేష్ సారంగ్, కొరియోగ్రఫర్ గణేష్ ఆచార్యా, నిర్మాత సామీ సిద్దిఖీలపై తనుశ్రీ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. (చదవండి : నానా పటేకర్ నుంచి నోటీసులు అందాయ్..) -
కొడుక్కి క్లాస్ పీకిన టాప్ హీరో!
ముంబై: అనిల్ కపూర్ తనయుడు, వర్ధమాన హీరో హర్షవర్థన్ కపూర్ తన ప్రేయసి సప్నా పాబీకి బ్రేకప్ చెప్పాడు. వీరిద్దరూ అనిల్ కపూర్ కారణంగా విడిపోయినట్టు బాలీవుడ్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. '24' సినిమాలో అనిల్ కపూర్ కూతురిగా నటించిన సప్నాతో హర్షవర్థన్ ప్రేమలో పడ్డారు. యువజంట ప్రేమలోకాల్లో విహరించింది. విషయం అనిల్ కపూర్ కు తెలియడంతో కొడుక్కి క్లాస్ తీసుకున్నాడట. కెరీర్ ఆరంభంలో ప్రేమాదోమా అంటూ తిరిగితే మంచిది కాదని సలహాయిచ్చాడట. నీతో పాటు ఆమె కెరీర్ కూడా పాడవుతుందని నచ్చచెప్పాడు. తండ్రి మాటలను తలకెక్కించుకున్న హర్షవర్థన్ ప్రియురాలికి బ్రేకప్ చెప్పాడు. తన తమ్ముడికి సోనమ్ కపూర్ కూడా బ్రెయిన్ వాష్ చేసిందని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. 'మిర్జియా' సినిమాతో హర్షవర్థన్ హీరోగా బాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు 'రంగ్ దే బసంతి' ఫేమ్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకానుంది. -
అనిల్ కపూర్ కొడుకుతో డేటింగ్?
‘కామోషియాన్’ చిత్రంలో హాట్ హాట్‌గా అందాలు ఒలికించి కుర్రకారు మనసును దోచుకున్న విదేశీ మోడల్ సప్నా పబ్బి. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా సప్నా గ్లామర్ మాత్రం క్లిక్ అయింది. అసలు విషయంలోకి వెళితే, సప్నా ఇప్పుడు అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారని సమాచారం. కొన్ని నెలలుగా వీరిద్దరూ కలిసి రెస్టారెంట్స్, పబ్స్ చుట్టూ తిరుగుతున్నారట. పైకి మాత్రం ఫ్రెండ్షిప్ అని చెబుతున్నా, వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. హర్షవర్ధన్ ప్రస్తుతం తన మొదటి చిత్రం ‘మీర్జి యాన్’ అనే సినిమా లో నటిస్తున్నారు ఈ సినిమా విడుదల వరకైనా వరకైనా మీడియా కంటపడొద్దని తండ్రి అనిల్‌కపూర్ చెప్పారట. అయినా సరే, తండ్రి మాట కాదని మరి సప్నాతో డేటింగ్ చేస్తున్నారట హర్షవర్ధన్.