sarainodu teaser
-
సరైనోడు
కండలు తిరిగిన దేహం.... చురకత్తుల్లాంటి చూపులు... ప్రేమించే మనసు... తేడా వస్తే ఎంతకైనా తెగించే ధైర్యం... ఇలా అన్ని క్వాలిటీస్ ఉన్న సరైనోడు ఆ కుర్రాడు. ఇన్ని లక్షణాలున్న పవర్ఫుల్ కుర్రాడి పాత్రలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సరైనోడు’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ ఏ రేంజ్లో రెచ్చిపోయి డ్యాన్స్ చేశారో చూపించడానికి శాంపుల్‌గా ఇటీవల ‘బ్లాక్ బస్టరే...’ పాట ప్రోమోను విడుదల చేశారు. దీనికి యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఏప్రిల్ 1న ఈ చిత్రం పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ‘‘ఏప్రిల్ 10న విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను భారీ ఎత్తున నిర్వహించనున్నాం. వేసవిలో అందరినీ అలరించే చిత్రం అవుతుంది’’ అని నిర్మాత తెలిపారు. -
సరైనోడు టీజర్ బంపర్ హిట్
అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసా నటించిన 'సరైనోడు' టీజర్ బంపర్ హిట్ అయ్యింది. యూట్యూబ్‌లో దీన్ని విడుదల చేసిన ఒక్కరోజులోనే దాదాపు 6.50 లక్షల హిట్లు ఈ టీజర్‌కు వచ్చాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా దీన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పిన మాటలు నెటిజన్లను బాగానే ఆకట్టుకున్నాయి. బహుశా అందుకేనేమో, టీజర్‌ను బాగా ఆదరించారు. సనాఫ్ సత్యమూర్తి సినిమా విడుదలైన తర్వాత చాలా సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవలి కాలంలో హిట్ సినిమాల హీరోయిన్గా బ్రాండ్ పడిన రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ఇంతకుముందు 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలో బన్నీ సరసన నటించిన కేథరిన్ ట్రెసా కూడా ఇందులో చేస్తోంది.