
సరైనోడు టీజర్ బంపర్ హిట్
అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసా నటించిన 'సరైనోడు' టీజర్ బంపర్ హిట్ అయ్యింది. యూట్యూబ్‌లో దీన్ని విడుదల చేసిన ఒక్కరోజులోనే దాదాపు 6.50 లక్షల హిట్లు ఈ టీజర్‌కు వచ్చాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పిన మాటలు నెటిజన్లను బాగానే ఆకట్టుకున్నాయి. బహుశా అందుకేనేమో, టీజర్‌ను బాగా ఆదరించారు.
సనాఫ్ సత్యమూర్తి సినిమా విడుదలైన తర్వాత చాలా సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవలి కాలంలో హిట్ సినిమాల హీరోయిన్‌గా బ్రాండ్ పడిన రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ఇంతకుముందు 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలో బన్నీ సరసన నటించిన కేథరిన్ ట్రెసా కూడా ఇందులో చేస్తోంది.