
ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనును నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బోయపాటి తల్లి సీతారావమ్మ(80) ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. దీంతో గుంటూరు జిల్లా పెద్దకాకాని వెళ్లిన బన్నీ.. బోయపాటిని కలిసి ధైర్యం చెప్పారు. బోయపాటితోపాటు ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. కాగా, బోయపాటి, బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడ్ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. మరోవైపు బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ మరణించడంతో అల్లు కుటుంబం విజయవాడ వెళ్లిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment