సాక్షి విలేకరిపై దాడి
గుంటూరు: గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పర్యటన వార్త కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి విలేకరి మస్తాన్వలిపై కొం దరు దుండగులు దాడికి తెగబడ్డారు. సరస్వతి సిమెంట్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన భూ ముల్లో అక్రమంగా కొందరు రైతులు పంటలు పండించారు. వాటిని తొలగించాలని యాజమా న్య ప్రతినిధులు డిమాండ్ చేయగా వివాదం చెలరేగింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఎమ్మెల్యే యరపతినేని బుధవారం వచ్చా రు. ఆయన వార్త కవరేజీకోసం వెళ్లిన విలేకరిపై రైతులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. పోలీ సులు రంగప్రవేశంచేసి విలేకరిని రక్షించారు. వారు చెన్నాయపాలెం గ్రామ శివారు వరకు రక్షణగా వ చ్చారు. అక్కడినుంచి స్నేహితులు ద్విచక్రవాహనంపై ఇంటికి చేర్చారు.
వివాదానికి కారణమైన భూములను ఎమ్మెల్యే యరపతినేని బుధవారం పరిశీలించారు. పాడైన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున, స్వచ్ఛంద సంస్థ ద్వారా రూ.5 వేలు అందిస్తానని హామీ ఇచ్చారు. అయితే పత్తి పంటలో ఐదు పెట్రోలు సీసాలు, బాంబులు, కత్తులు, కొడవళ్లు కనిపించాయి. ఎమ్మెల్యే చెన్నాయపాలెం గ్రామానికి సుమారు 35 వాహనాల్లో సుమారు 150 మంది జనంతో రావడం గమనార్హం.